ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్‌లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్‌లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్‌దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి.
సైన్యంలోని డాగ్ యూనిట్‌లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్‌లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్‌లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్‌కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment