Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం | Mahashivratri Vishwanath will give Darshan Continuously | Sakshi
Sakshi News home page

Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం

Published Sat, Feb 22 2025 8:05 AM | Last Updated on Sat, Feb 22 2025 10:00 AM

Mahashivratri Vishwanath will give Darshan Continuously

వారణాసి: ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి(Mahashivratri) వేళ భక్తులు కాశీవిశ్వేశ్వరుణ్ణి మరింత సమయం దర్శించుకునేందుకు అవకాశం కలిగింది. 26న తొలి మంగళహారతి మొదలుకొని 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎనిమిది గంటలపాటు జరగనుంది.

కాశీ విశ్వనాథుని ఆలయ అధికారి విశ్వభూషణ్‌ శివరాత్రి ఏర్పాట్ల గురించి మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 25న శయన హారతి అనంతరం గర్భగుడిని మూసివేస్తామన్నారు. అనంతరం 26న తెల్లవారుజామున 2:30కి మహాశివునికి మంగళహారతి ఇస్తామన్నారు. ఇది పూర్తయ్యాక దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 27న జరిగే శయన హారతివరకూ ఆలయం తలుపులు తెరిచేవుంటాయన్నారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని సందర్శించుకోవచ్చన్నారు. మహా శివరాత్రివేళ సప్తరుషి శృంగార హారతి ఉండదన్నారు.

ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలపాటు శివపార్వతుల కల్యాణం(marriage of Shiva and Parvati) జరగనున్నదని విశ్వభూషణ్‌ తెలిపారు. ఈసారి మహాశివరాత్రికి 14 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలున్నాయన్నారు. భారీగా భక్తులు వస్తున్నందున అందరికీ దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahakumb‍: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement