మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.
మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.
నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.
ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం
Comments
Please login to add a commentAdd a comment