
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగమతీరం నిత్యం భక్తుల రద్దీతో ఉంటోంది. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 22, 23) రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
కుంభమేళా చివరిదశకు చేరుకుంది. ఈరోజు, రేపు చాలామందికి సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు(Government officials) తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంగమతీరంతో పాటు హనుమాన్ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ప్రయాగ్‌రాజ్‌లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ప్రస్తుత పరిస్థితుల గురించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) కుమార్ మందార్ మీడియాతో మాట్లాడుతూ ‘వారాంతంలో భక్తుల రద్దీ ఏర్పడనున్న తరుణంలో మరిన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడికి వచ్చేవారికి పటిష్టమైన భద్రతను అందించేందుకు చర్యలు చేపట్టాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశాం. ముందస్తుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీల సమీక్షా సమావేశం జరిగింది. ప్రవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తున్నాం’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్‌లోడ్ చేసిన వారిపై చర్యలు
Comments
Please login to add a commentAdd a comment