
కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాలు సాధువుల ఆశీస్సులతో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.
మహాశివరాత్రి వేళ పవిత్ర స్నానం ఆచరించడానికి మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో ఐక్యత, సామాజిక సామరస్యాల అద్భుతమైన సంగమం కనిపిస్తోంది.
మహాశివరాత్రి(Mahashivratri) నాడు మహా కుంభమేళాలో భక్లులు స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సంగమం వద్ద జనం గుమిగూడకుండా సమీపంలోని ఘాట్లలో పవిత్ర స్నానం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 64 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాను సందర్శించారు. మహాశివరాత్రి నాడు ఈ సంఖ్య మరింత పెరగనుంది. మహాశివరాత్రికి ముందు రోజు సాయంత్రం నుంచే ఘాట్ల వద్దకు భక్తజనం చేరుకున్నారు.
మహా శివరాత్రి రోజున మహా కుంభమేళాకు చేరుకున్న ప్రతి ఒక్కరూ గంగానదిలో స్నానం చేస్తున్నారు. అనంతరం గంగా మాతను పూజిస్తున్నారు.
మహా కుంభ ప్రాంతంలో యాత్రికుల రాక రాత్రింబవళ్లు కొనసాగుతోంది. సంగమ స్థలిలో పూజా సామగ్రి విరివిగా విక్రయిస్తున్నారు. భద్రతా సిబ్బంది భక్తుల రద్దీని నియంత్రించడంలో బిజీగా ఉన్నారు.
మహా కుంభమేళా సంప్రదాయాలు మహా శివరాత్రి పూజతో పూర్తవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభించారు.
మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోటి మందికి పైగా భక్తులు మహాకుంభ నగరంలో ఉన్నారు.
భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు పూర్తి చేసింది. జనసమూహాన్ని నియంత్రించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్ల కోసం 37,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే 14,000 మంది హోమ్ గార్డులను నియమించారు.
భక్తుల భద్రత కోసం 2,750 ఏఐ ఆధారిత సీసీటీవీలు, మూడు వాటర్ పోలీస్ స్టేషన్లు, 18 వాటర్ పోలీస్ కంట్రోల్ రూములు, 50 వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.
చివరి స్నానానికి భక్తుల రద్దీ(Crowd of devotees) ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, మంగళవారం సాయంత్రం నాటికే కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. మహాశివరాత్రి నాడు సజావుగా పుణ్య స్నానాలు జరిగేలా చూసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం
Comments
Please login to add a commentAdd a comment