Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం | Mahashivratri Live Updates Mahakumbh Prayagraj Ayodhya and Kashi Vishwanath Arrangement | Sakshi
Sakshi News home page

Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం

Published Wed, Feb 26 2025 7:03 AM | Last Updated on Wed, Feb 26 2025 10:41 AM

Mahashivratri Live Updates Mahakumbh Prayagraj Ayodhya and Kashi Vishwanath Arrangement

నేడు (బుధవారం) మహాశివరాత్రి(Mahashivratri).. మహా కుంభమేళాకు చివరి రోజు.. సంగమ తీరంలో భక్తులు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చిన భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. చివరి స్నాన ఉత్సవం వేళ భారీ సంఖ్యలో జనం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటున్నారు.  భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఇప్పటికే వాహన రహిత జోన్‌గా ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులపై భారీగా జనసమూహం కనిపిస్తోంది.
 

మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేవారి సంఖ్య మొత్తంగా 67 కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్యలలో, మహాశివరాత్రి  సందర్భంగా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేయడానికి వచ్చే సాధువులు, భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలంతా సమాజ సంక్షేమానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరణ కల్పిస్తుందని ఆయన అన్నారు.

మహా కుంభమేళాకు వచ్చిన ఒక భక్తురాలు  మాట్లాడుతూ ‘నా భావాలను మాటల్లో వ్యక్తపరచలేను.మేము ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాం.. ఇది 2025 మహా కుంభమేళాలో చివరి రోజు.. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. గంగా మాత ఆశీస్సులు  అందుకోవడం మా అదృష్టం’ అని అన్నారు.

మహాశివరాత్రికి ముందే ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి చేరుకున్న భక్తుల సంఖ్య 65 కోట్లు దాటింది. మహాశివరాత్రి నాడు భక్తుల పవిత్ర స్నానాలు సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.  మరోవైపు ఈరోజు భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఘాట్లలో భక్తులు పవిత్ర స్నానాలను క్రమశిక్షణతో చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో  నేటి శివరాత్రితో ముగియనుంది.

 

ఇది కూడా చదవండి: Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement