
ప్రయాగ్‌రాజ్: మొన్నటి జనవరి 13న ప్రారంభమమై, ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిసమాప్తమయ్యింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అద్భుమైన రీతిలో హారతినిచ్చారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
#WATCH | Uttar Pradesh | Evening 'aarti' was performed in Prayagraj on the occasion of Maha Shivratri pic.twitter.com/iFyMguK1Fs
— ANI (@ANI) February 26, 2025
మహాకుంభమేళా పూర్తయిన నేపధ్యంలో డీఎం రవీంద్రకుమార్ మందర్ మాట్లాడుతూ ‘మహా కుంభ్‌కు కేవలం మనదేశం నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ఇక్కడికి వచ్చినవారంతా మహాకుంభమేళా నియమనిబంధనలన్నింటినీ పాటించారు. వారందరికీ ధన్యవాదాలు. మహాకుంభమేళా పూర్తయిన తరుణంలో ఇక్కడికి వచ్చినవారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సంగమ ఘాట్లలో పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి(Mahashivratri) రోజున రాత్రి 8 గంటల వరకూ త్రివేణీ సంగమంలో 1.53 కోట్లమంది పవిత్రస్నానాలు చేశారు. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో మొత్తం 66.30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు’ అని తెలిపారు.
మహాకుంభ్ ముగిసిన తరుణంలో నేడు(గురువారం) యూపీ సీఎం యోగి ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు రానున్నారు. కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుంభమేళా అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే ఇక్కడి పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య సేవలు అందించిన సిబ్బందికి, పడవ నడిపిన నావికులకు సన్మానం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30కి సీఎం యోగి లక్నో చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రయాగరాజ్‌కు వచ్చి, కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: మే 2 నుంచి కేదార్‌నాథ్ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన