Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు | Mahakumbh2025 Crowd of Devotees Magh Purnima on Triveni | Sakshi
Sakshi News home page

Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు

Published Wed, Feb 12 2025 7:01 AM | Last Updated on Wed, Feb 12 2025 7:02 AM

Mahakumbh2025 Crowd of Devotees Magh Purnima on Triveni

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపధ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్‌రాజ్‌ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘపౌర్ణమి వేళ మూడు నుంచి కోట్ల నాలుగు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.
 

మాఘపౌర్ణమి ఏర్పాట్ల గురించి కుంభమేళా అధికారి వివేక్‌ చతుర్వేది మాట్లాడుతూ ఈరోజు(బుధవారం) మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలివస్తున్నారు. భారీసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయన్నారు. 

మహాకుంభమేళాకు ఈరోజు 31వ రోజు. ఈరోజున ఐదవ పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల  భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని  సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.

కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యశిబిరాలలోని సిబ్బంది మాట్లాడుతూ ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని, 500కు పైగా నర్సింగ్‌ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్నంతటినీ నో వెహికిల్‌ జోన్‌గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయటి నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. 

 

ఇది కూడా చదవండి: Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement