
కేంద్ర మంత్రి జైశంకర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీ : తెలంగాణ రైజింగ్ కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ మేనరకు వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్‌తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ కార్యక్రమాలకు సహకరించాలని విన్నవించారు.
ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్‌ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ రైజింగ్‌ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment