Jai Shankar
-
సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం
ఢిల్లీ : అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్రం స్పందించింది. భారత వలసదారుల పట్ల అమెరికా దురుసుగా ప్రవర్తించలేదు. వలస దారుల విషయంలో కేంద్రం ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. అక్రమ వలసదారుల్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వారి దేశాలకు విమానాల ద్వారా తరలిస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, తొలివిడతలో 104 మంది భారతీయులను సీ-17 విమానంలో అమృత్‌సర్‌కు తరలించింది. తరలించే సమయంలో భారత వలసదారుల చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసలతో బంధించింది. ఇలా బంధించి తరలించడంపై రాజకీయ వివాదం తలతెత్తింది.అయితే, భారత వలసదారుల తరలింపు వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం.కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం. తరలించే సమయంలో అవసరాల్ని చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసుల్ని తొలగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. Speaking in Rajya Sabha on Indian citizens deported from the US, EAM S Jaishankar says, "...It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad..." pic.twitter.com/6tnkvqbuQJ— ANI (@ANI) February 6, 2025జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వలసదారులకు అమెరికా ఉగ్రవాదులకు వేసినట్లు సంకెళ్లు వేయడం ఎంత వరకు కరెక్టో జయశంకర్ చెప్పాలి. భారతీయుల ఆత్మాభిమానం కాపాడటంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలస దారుల తరలింపుపై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ విభాగం చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్ 24 సెకన్ల వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అక్రమ వలస దారుల్ని విజయవంతంగా భారత్‌కు తిరిగి పంపించాం. ఈ మిషన్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025 -
రాహుల్‌గాంధీకి జైశంకర్ కౌంటర్
న్యూఢిల్లీ:తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో విమర్శలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాను అమెరికా వెళ్లడంపై రాహుల్ సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యల పట్ల జైశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.రాహుల్ గాంధీ చెప్పేదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.తన అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని సెక్రటరీ,ఎన్ఎస్ఏను కలిసేందుకు అక్కడి వెళ్లానని జైశంకర్ తెలిపారు.ప్రధాని మోదీకి ఆహ్వానం కోసం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు’అని జైశంకర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు. -
‘ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
వాషింగ్టన్: అక్రమ వలస దారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలస దారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు. #FPLIVE: External Affairs Minister (EAM) S. Jaishankar, has clarified India's stance, saying that New Delhi is open to the "legitimate return" of Indian nationals living 'illegally' abroad, including in the US. https://t.co/JWyTTCKgXV— Firstpost (@firstpost) January 23, 2025 కాగా, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే సమయంలో ట్రంప్‌నకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను జై శంకర్‌ను ట్రంప్‌కు అందించారు. -
ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
జైశంకర్ ఇంటర్వ్యూ.. మీడియా సంస్థపై కెనడా నిషేధం
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌లతో కలిసి ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. ఈ ఇంటర్వ్యూ విషయంలో కెనడా మరోసారి దూకుడుగా వ్యవహరించింది. ఇంటర్య్వూ ప్రసారం చేసిన.. ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ , ఆస్ట్రేలియన్ న్యూస్ అవుట్లెట్ పేజీలు బ్లాక్ చేసింది. అక్కడితో ఆగకుండా కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థపై కెనడా నిషేధం విధించింది. దీంతో కెనడా వ్యహరించిన తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు వాక్ స్వాతంత్రాన్ని కెనడా వంచిస్తోందని మండిపడింది. కెనడాలో ఆస్ట్రేలియా టుడే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయటంపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ‘‘ఆస్ట్రేలియా టుడే మీడియా అవుట్లెట్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు బ్లాక్ చేయబడ్డాయి. కెనడాలోని వీక్షకులకు అవి అందుబాటులో లేవు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్.. పెన్నీ వాంగ్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కొన్ని గంటల తర్వాత జరిగింది. కెనడా తీరుపై మేం ఆశ్చర్యపోయాం. చాలా వింతగా అనిపించింది. అయితే, ఇవి కెనడా కపటత్వాన్ని మరోసారి ఎత్తి చూపే చర్యలు. ..వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి విదేశాంగ మంత్రి మూడు విషయాల గురించి మాట్లాడారు. కెనడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. భారత దౌత్యవేత్తలపై నిఘా కెనాడా నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. కెనడాలో వేర్పాటువాదులకు రాజకీయంగా చోటు ఇస్తోంది. భారతదేశ అంశాలు మాట్లాడితే.. ఆస్ట్రేలియా టుడే ఛానెల్‌ను కెనడా ఎందుకు బ్లాక్ చేసింది’’ అని అన్నారు.చదవండి: ‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’ -
అమెరికా ‘ఫలితాలు’ ఎలా ఉన్నా భారత్‌తో వీడని బంధం
కాన్బెర్రా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన ఐదుగురు అధ్యక్షుల పాలనాకాలంలో భారత్.. అమెరికాతో సంబంధాల విషయంలో స్థిరమైన పురోగతిని చూసిందని అన్నారు.ప్రస్తుత అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ యుఎస్ఏతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో భారత విదేశాంగ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్లో సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్‌తో సహా క్వాడ్ దేశాలతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయన్నారు.రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడంపై ఏమైనా ఆందోళన ఉందా? దీనికారణంగా క్వాడ్‌పై ఏ మేరకు ప్రభావం ఉండబోతుందని విలేకరులు అడగగా జైశంకర్ సమాధానమిస్తూ గత ఐదుగురు అధ్యక్షుల పదవీకాలంలో యూఎస్‌తో భారత్ సంబంధాలలో స్థిరమైన పురోగతిని చూశాం. దీనిలో డోనల్ట్ ట్రంప్ అధ్యక్షుని పదవీకాలం కూడా ఉన్నదన్నారు. అందుకే అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా భారత్‌తో సంబంధాలు బలంగా ఉంటాయని నమ్ముతున్నామన్నారు.ఇక క్వాడ్ విషయానికొస్తే 2017లో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్వాడ్ పునరుద్ధరణ జరిగిందన్నారు. అప్పుడు అది శాశ్వత కార్యదర్శి స్థాయి నుండి మంత్రి స్థాయికి బదిలీ అయ్యిందన్నారు. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలు 2017లో ఇండో-పసిఫిక్ భూ భాగంలో చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇది కూడా చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..! -
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.ఈనేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..ఈ మేరకు యూఎస్ వాషింగ్టన్‌లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అది ఎంతో ముఖమన్న జై శంకర్.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లుఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. -
రాబోయే ఐదేళ్లు భారత్‌కు ఎంతో క్లిషమైంది: జైశంకర్
ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అంటూ కామెంట్స్ చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. అన్నారు. ప్రస్తుతం భారత్ ఇబ్బందికర(కఠిన) పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో అమెరికా ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, జైశంకర్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్ల కాలం భారత్‌కు ఎంతో క్లిషమైనది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?. ఆగ్నేయాసియా.. తూర్పు ఆసియా.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. యుద్ధాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.ప్రస్తుతం ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఒక దేశం వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరోకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉన్నాయి. మరోవైపు.. కోవిడ్ సమస్య కూడా ఇంకా తీరలేదు. పలు దేశాలపై కోవిడ్ ప్రభావం ఇంకా ఉంది. ఇక, వాతావరణ మార్పులపై కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి విపత్తుల కారణంగా ఎన్నో దారుణ పరిస్థితులు జరుగుతున్నాయన్నారు. ఇక, ఏది ఏమైనప్పటికీ తాను మాత్రం ఆవకాశవాదిని అని చెప్పుకొచ్చారు. సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు.మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించకూడదు. ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదు. అందుకే ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోలేను. కానీ, గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా... భారత్ వారితో కలిసి పని చేస్తుందన్నారు. -
భారత్ దెబ్బ అదుర్స్.. మాల్దీవుల ముయిజ్జు కొత్త రాగం
ప్రధాని మోదీ, భారత్‌పై మాల్దీవుల రాజకీయ నేతల అనుచిత వ్యాఖ్యల కారణంగా రెండు దేశాల మధ్య రాజకీయంగా పెను దుమారమే చెలరేగింది. దీంతో, మాల్లీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల పర్యటనలో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో, భారత్ దెబ్బకు ముయిజ్జు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, జైశంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ముయిజ్జుతో భేటీ కావడం ఆనందగా ఉంది. భారత ప్రధాని మోదీ తరఫున మాల్దీవుల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అయితే, చివరిసారిగా 2023 జనవరిలో జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే.ఇక, వీరి భేటీ అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ భారత్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులకు భారత్ ఎల్లప్పుడూ మిత్ర దేశమేనని చెప్పుకొచ్చారు. మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఆర్థికంగా భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. అలాగే, తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయం చేయడంతో భారత్ ముందు ఉంటుందని పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే సమయంలో భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ దేశం పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. It was a pleasure to meet @DrSJaishankar today and join him in the official handover of water and sewerage projects in 28 islands of the Maldives. I thank the Government of India, especially Prime Minister @narendramodi for always supporting the Maldives. Our enduring partnership… pic.twitter.com/fYtFb5QI6Q— Dr Mohamed Muizzu (@MMuizzu) August 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లక్షద్వీవుల్లో పర్యటించిన అనంతరం భారత్, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దీంతో, భారతీయులు ఎవరూ మాల్దీవులకు వెళ్లవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మాల్దీవుల పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. భారత్‌లో మైత్రికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్‌లో పర్యటించారు. -
‘షాంఘై’ సదస్సుకు ప్రధాని దూరం
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో వచ్చే నెలలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ సదస్సుకు ప్రధాని స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు. జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం(జూన్28) మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్సీవో సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్‌గా సదస్సును నిర్వహించారు. -
భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?
ఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మూసా జమీర్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్‌కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది. -
‘కచ్చతీవు రచ్చ’: జైశంకర్‌కు చిదంబరం కౌంటర్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నమలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మనదేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఎవరు ఏం చేశారో కాదు.. ఎవరు ఏం దాచారో తెలుసు ఈ నివేదికపై విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ సైతం.. కాంగ్రెస్, డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని జయ శంకర్ అన్నారు. దెబ్బకు దెబ్బ వర్సెస్ ట్వీట్ ఫర్ ట్వీట్ కచ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు. ఎక్స్ వేదికగా జయ్శంకర్ ఊసరవెల్లిల్లా రంగుల్లు మార్చొద్దని అన్నారు. ‘టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్ ఫర్ ట్వీట్ అనేది ట్వీట్ కొత్త ఆయుధం’ అని పేర్కొన్నారు. చరిత్రలో జై శంకర్ అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్ శంకర్‌ను ఉద్దేశిస్తూ.. ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్ఎస్ఎస్- బీజేపీ మౌత్ పీస్ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు బీజేపీలో హయాంలోనూ జరిగింది మరో ట్వీట్లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. ‘గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చతీవు భారత్ తిరిగి తీసుకోవాల్సిందే ఇలా ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. -
కచ్ఛాతీవు రగడ.. భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. దేశ భద్రత ఏమాతం పట్టించుకోకుండా, స్పృహలేకుండా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దీంతో మరోసారి కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం తెరమీదికి వచ్చింది. తాజాగా కచ్ఛాతీవు ద్వీపం విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహార్‌లాల్ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విమర్శలు చేశారు.కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ మీడియాతో మాట్లాడారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించి 1974లో పార్లమెంట్లో మాజీ కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి స్వరణ్ సింగ్ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘స్వేచ్ఛ, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో ఇరుదేశాల మధ్య మత్స్యకారుల వేట, నేవిగేషన్ హక్కులను పొందినట్లుగానే భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సమానంగా పొందుతాయి’అని అప్పటి కేంద్రమంత్రి చెప్పినట్లు జైశంకర్ మీడియాకు వివరించారు. ఇలా జరిగిన రెండు ఏళ్లలో అప్పటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీలకం సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య 1974 ఈ ఒప్పందం జరిగితే.. 1976లో అమల్లోకి వచ్చిందన్నారు. అప్పుడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6184 భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారు. 1175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్ చేశారని జైశంకర్ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదేవిషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాదానం ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదని.. ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక.. కచ్ఛాతీవు ద్వీపం ఒప్పందానికి సంబంధించిన వివరాల కోసం తమిళాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ పిటిషన్ వేయటంతో దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ కాంగ్రెస్ విమర్శలు చేయటంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి విమర్శలుపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకొని 111ప్రాంతాలు బంగ్లాకు,55 ప్రాంతాలు భారత్‌త్ పరస్పరం బదిలీ చేసుకున్న విషయం మర్చి పోయాయా? 1974లో జరిగింది కూడా అచ్చం అలాంటి ఒప్పందమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎమిటీ కచ్ఛాతీవు కథాకమామిషు? కచ్ఛాతీవు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఉన్న 163 ఎకరాల అతి చిన్న ద్వీపం. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా ఆధీనంలో ఉండేది. బ్రిటిష్‌వారి రాకతో శ్రీలంక, భారత్ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్రం పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగటంతో అది తమదంటే తమదని శ్రీలంక, భారత్ ప్రకటించుకున్నాయి. చదవండి: కచ్ఛాతీవు ద్వీపం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు -
అమెరికా ఎన్నికల వేళ ట్రంప్‌పై జై శంకర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్- అమెరికా సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017-2021 మధ్య కాలంలో అమెరికాతో భారత్ మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంత బలోపేతమయ్యాయన్నారు. ఢిల్లీలో జరిగిన కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్, కో ఆపరేట్, క్రియేట్ సదస్సలో జై శంకర్ ప్రసంగించారు. 2020లో ట్రంప్ భారత పర్యటనకు వచ్చారని, మోదీ కూడా పలుమార్లు అమెరికా వెళ్లారని జై శంకర్ గుర్తు చేశారు. ఒక్క ట్రంపే కాదని, బిల్ క్లింటన్ తర్వాత వచ్చిన ప్రతి అమెరికా అధ్యకక్షుని హయాంలో ఆ దేశంతో అమెరికా సంబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఇప్పటికే జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే ప్రైమరీల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సౌత్ కరోలినాలో తన ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ట్రంప్ ఈసారి మళ్లీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఇప్పటికే వెల్లడిస్తున్న కొన్ని పోల్స్ ఫలితాల్లో ఈసారి బైడెన్ కంటే ట్రంప్‌నకే ఎక్కువ అవకాశాలున్నయని వెల్లడవడం విశేషం. ఇదీ చదవండి.. ఢిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు -
'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు. భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్‌కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..? -
Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్
అమెరికాలోని స్వామినారాయణ్ మందిర్ గోడలపై విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదుల ఆగడాలకు ఎట్టిపరిస్థితుల్లో చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్.. ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూఎస్ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తాను చూసినట్లు జైశంకర్ మీడియాకు తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే.. తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఈ ఘటన భారతీయుల మనోభావలను కించపరిచింది. వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యూఎస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. #WATCH | On Swami Narayan temple in Newark, US defaced with pro-Khalistani slogans, EAM Dr S Jaishankar says, "I have seen it. Extremists, separatists and such forces should not be given space. Our Consulate there complained to the government and the police and an inquiry is… pic.twitter.com/dfEzsfeeT8 — ANI (@ANI) December 23, 2023 స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది విద్వేశాలు రెచ్చగొట్టే చర్యల కిందకి వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ ట్వీటర్లో కోరింది. చదవండి: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్‌కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్‌కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు! The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening. Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations. 🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d — UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 -
రాజకీయ సౌలభ్యం కోసం...ఉగ్రవాదంపై మెతక వైఖరా?
ఐక్యరాజ్యసమితి: ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో మెతకగా వ్యవహరిస్తున్న కెనడాకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ చురకలంటించింది. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసల విషయంలో కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మెతక వైఖరి అవలంబించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవకాశవాద ధోరణులకు దూరంగా ఉండాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. మంగళవారం ఐరాస 78వ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ మేరకు కుండ బద్దలు కొట్టారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న కొద్ది బుద్ధులను కూడా ఏకిపారేశారు. ‘ప్రాదేశిక సమగ్రత, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టరాదన్నవి కనీస మర్యాదలు. అంతే తప్ప ఇలాంటి విషయాల్లో తమ రాజకీయ స్వార్థాలకు, అవసరాలకు అనుగుణంగా ఇష్టానికి వైఖరులు మార్చుకునే తీరు సరి కాదు‘ అంటూ పాక్ తో పాటు పరోక్షంగా అమెరికా తీరును కూడా దుయ్యబట్టారు. ఐరాస వేదికగా పాక్ తాత్కాలిక ప్రధాని ఇటీవల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు, దౌత్య సంక్షోభానికి దారి తీసింది. హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో మంటలు రాజుకున్నాయి. ఖలిస్తానీ అనుకూల పార్టీ మద్దతుతో అధికారాన్ని కాపాడుకుంటున్న ట్రూడో వారిని మంచి చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పార్టీ ఎంపీలే విమర్శిస్తుండటం తెలిసిందే. అంతేగాక నిజ్జర్ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని కెనడాతో అమెరికా పంచుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్, అమెరికా తీరును పరోక్షంగా దుయ్యబడుతూ ఐరాస వేదికపై జై శంకర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద దేశాలూ, కొద్ది బుద్ధులు! పెద్ద దేశాల పెత్తందారీ, ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల గొంతుకను ఐరాస వేదికపై జై శంకర్ ఈ సందర్భంగా గట్టిగా వినిపించారు. కొన్ని పెద్ద దేశాలే తమ అవసరాలకు అనుగుణంగా అజెండాను నిర్దేశించి, మిగతా దేశాలన్నీ తమను అనుసరించాలని కట్టడి చేసే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. ‘ఈ పోకడలు ఎల్లకాలమూ చెల్లవు. వాటినెవరూ సవాలే చేయరని అనుకోవద్దు. వ్యాక్సిన్ల విషయంలో వర్ణ వివక్షను ఇంకెప్పుడూ అనుమతించరాదు. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడంలో పెద్ద దేశాలు తమ బాధ్యతలను తప్పించుకోరాదు. నిరుపేద దేశాలకు అందాల్సిన ఆహార, ఇంధన నిల్వలను పెద్ద దేశాలు తమ మార్కెట్ బలాన్ని ఉపయోగించి చెరబట్టరాదు‘ అంటూ శషభిషలకు తావు లేకుండా స్పష్టం చేశారు. అభివృద్ధిలోనూ, అన్నింట్లోనూ అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం కల్పించే నూతన ప్రజాస్వామిక వాతావరణం నెలకొని తీరుతుందని మంత్రి ధీమా వెలిబుచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అన్ని రకాల నిబంధనలు అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలకూ సమానంగా వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలీనోద్యమానికి మద్దతిచ్చిన రోజుల నుంచి విశ్వ మిత్ర (ప్రపంచ నేస్తం) స్థాయి దాకా భారత్ ఎదిగింది. మిగతా దేశాలన్నీ తమ జాతీయ ప్రయోజనాలే చూసుకుంటాయి. భారత్ మాత్రం విశ్వ శ్రేయస్సునే తన మేలుగా భావిస్తుంది‘ అని స్పష్టం చేశారు. ఆ గురుతర బాధ్యతను దృష్టిలో ఉంచుకునే జీ20 సారథ్యాన్ని భారత్ స్వీకరించిందని వివరించారు. ‘ఇతర దేశాల వాదనను సానుభూతితో వినడం, వాటి వైఖరిని గౌరవించడం బలహీనత కాదు. పరస్పర సహకారానికి సూచిక. ఐరాస లక్ష్యానికి కొనసాగింపు‘ అంటూ చైనా మితి మీరిన దూకుడుకు కూడా జై శంకర్ చురకలు వేశారు. -
మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే..
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ పరాయి దేశాల్లో భారత ప్రతిష్ట దిగజార్చడం ఆయనకు అలవాటని చేసిన విమర్శలకి గట్టి కౌంటర్ ఇస్తూ.. ఆ ట్రెండ్ మొదలు పెట్టింది ఎవరో తెలుసుకుని మాట్లాడమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు. ముందు తెలుసుకో.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కాస్త ఘాటుగానే స్పదించారు. భారత దేశ రాజకీయ వ్యవహారాల గురించి ప్రపంచ వేదికల మీద మాట్లాడింది నీకు మంత్రి పదవినిచ్చిన పెద్దమనిషే. ఆ విషయం నీకు తెలిసినా కూడా ధైర్యంగా ఒప్పుకోలేవని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. మీరేం చేసినా అధికారం మాదే.. రాహుల్ గాంధీ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దేశ రాజకీయాల గురించి ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచమంతా మనవైపు చూస్తున్నప్పుడు వారేమి చూస్తున్నారనేది ముఖ్యం? ఎలక్షన్లు జరుగుతాయి, ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యం లేకుంటే అటువంటి మార్పు జరగదు. 2024లో కూడా ఫలితమేమీ మారదు. దేశంలో ఆయన ఏమైనా చేయనీయండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. దేశ అంతర్గత వ్యవహారాలను దేశాంతరాలకు తీసుకెళ్లడాన్ని ప్రజలు సహించరని అన్నారు. The man who started the practice of taking national politics outside the country is none other than the man who gave you your ministerial position. You know it but you cannot acknowledge it Dr. Minister. https://t.co/FE6nZAujM1 — Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2023 ఇది కూడా చదవండి: మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా.. -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
సూడాన్ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్ కావేరి
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం సూడాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. సూడాన్ నౌకాశ్రయంలో భారతీయులు -
భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే
న్యూఢిల్లీ: భారత్‌లో పని చేసే సంస్థలన్నీ ఇక్కడి చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనని బ్రిటన్‌కు కేంద్రం స్పష్టం చేసింది. రెండు రోజుల జీ–20 మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ బుధవారం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. బీబీసీపై పన్ను ఎగవేత ఆరోపణలు, ఢిల్లీ, ముంబైల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సర్వే ఉదంతాన్ని ఈ సందర్భంగా క్లెవర్లీ ప్రస్తావించారు. ఏ సంస్థలైనా ఇక్కడి పూర్తిగా చట్టాలకు లోబడి పని చేయాలని జై శంకర్ గట్టిగా బదులిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు అంతర్జాతీయ పరిణామాలపైనా తామిద్దరం లోతుగా చర్చలు జరిపామంటూ అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు. -
ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహం
ఐక్యరాజ్యసమితి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి భారత్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని బహూకరించింది. డిసెంబర్ 14వ తేదీన భద్రతా మండలి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్లో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని డిజైన్ చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మక నార్త్‌లాన్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత్ 1982లో ఇచ్చిన ఏకైక కానుక 11వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య విగ్రహం, జర్మనీ అందజేసిన బెర్లిన్ గోడలో ఒక భాగం, దక్షిణాఫ్రికా బహూకరించిన నెల్సన్ మండేలా కాంస్య విగ్రహం, పాబ్లో పికాసో వేసిన గుయెర్నికా చిత్రం తదితరాలున్నాయి. -
ఎవర్నీ ఫూల్ చేయాలనుకుంటున్నారు!.. విదేశాంగ మంత్రి ఫైర్
వాషింగ్టన్: పాక్ అమెరికాల బంధం అంత తేలిగ్గా ముగిసిపోయేది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చమత్కరించారు. పాక్‌కి అమెరికా సేవలందించడం లేదా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ సేవలు అందించడం వంటి విడదీయరాని బంధం అని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు జై శంకర్ వాషింగ్టన్‌లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కి అమెరికా 450 మిలయన్ డాలర్ల వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు తెలియజేశారు కూడా. ఐతే అమెరికా మాత్రం అది విక్రయమే తప్ప భద్రతా సాయం కాదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఇలాంటి మాటలతో ఎవర్నీ మోసం చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే పాక్ ప్రభుత్వంతో ఈ ఎఫ్ 16 జెట్ విమానాల విక్రయాలతో అమెరికాకు ఒనగగురే ప్రయోజనం ఏమిటో తనకు తెలుసునని అన్నారు. అదీగాక ఎఫ్ 16 జెట్ విమానం ఎంత సామర్థ్యం గలవో వాటి ఉపయోగం ఏమిటో మనందరికి తెలుసునని నొక్కి చెప్పారు. (చదవండి: విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో అమెరికా) -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
ఆ మంత్రి కొడుకుతో యూఎస్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....
భారత్ జారి చేసే కోవిడ్ సర్టిఫికెట్లకి యూఎస్ జారీ చేసిన కోవిడ్ సర్టిఫికెట్లకి ఎంత తేడా ఉందో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చక్కగా వివరించారు. ఈ మేరకు ఆయన తన కొడుతో కలిసి యూఎస్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన సంఘటన గురించి చెప్పారు. కరోన ఆంక్షల తదనంతరం 2021లో అమెరికా వెళ్లినప్పుడూ జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు జై శంకర్. జై శంకర్ తన కొడుకుతో కలిసి అమెరికాలోని ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ... "అక్కడ ఆ రెస్టారెంట్ వాళ్లు కోవిడ్ సర్టిఫికెట్లు చూపించమని అడిగారు. నేను నా మొబైల్లొ సర్టిఫికెట్‌ని చూపిస్తే, నా కొడుకు పర్సులోంచి ఒక సర్టిఫికెట్‌ని తీసి చూపించాడు. అప్పుడు అనిపించింది ఓహో నా దేశానికి ఇక్కడకి ఎంత వ్యత్యాసం ఉంది." అని నవ్వుతూ చెప్పారు. ఈ మేరకు ఆయన కోవిడ్ సర్టిఫికేట్ జారీ విషయంలో భారత్ అభివృద్ధిని తేటతెల్లం చేసిందన్నారు. అంతేకాదు జై శంకర్ నాటి సంఘటనకు వివరిస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియోని అరుణ్ పుదూర్ అనే వ్యక్తి "విదేశాంగ మంత్రి జై శంకర్ తన కొడుకుతో అమెరికాలోని రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే" అని ఒక క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇప్పుడూ ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Dr S Jaishankar, Min of External Affairs India went to a Restaurant with his son in the US and what happened next is hilarious 😂 pic.twitter.com/Cqfcw2ZowF — Arun Pudur 🇮🇳 (@arunpudur) August 13, 2022 (చదవండి: వీడియో: ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ.. ఎలా ఏర్పడిందంటే..) -
భారత్‌పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: భారత్‌పై మరోసారి ప్రశంసలు జల్లు కురిపించాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వస్తున్న విమర్శలను ఖండిస్తూ... పాక్ మాజీ ప్రధాని భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు లాహోర్‌లోని భారీ సభను ఉద్దేశిస్తూ... భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్‌లో జూన్ 3న మాట్లాడిన వీడియో క్లిప్‌ని ప్లే చేశాడు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్‌పై ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్ కొంటాం అని స్పష్టం చేశారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడానిన భారత్ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్య్రాన్ని పొందాయి. కానీ తమ ప్రజలకు అనుగుణంగా భారత్ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ప్రశంసించారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ పై వస్తున్న విమర్శలను ఖండించడమే కాకుండా న్యూఢిల్లీ అమెరికా ఒత్తిడికి తలవొంచకుండా తీసుకున్న దృఢమైన వైఖరిని ఎంతగానో మెచ్చుకున్నారు. పైగా భారత్ అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని కూడా అన్నారు. కానీ పాక్.. భారత్‌లా చెప్పలేదు. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. పైగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వివరణ ఇచ్చుకోలేక పోయింది. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ మరో విషయం గురించి ప్రస్తావిస్తూ... కేవలం భారత్ చౌకగా రష్యా చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తే మరీ యూరప్ దేశాలు కూడా రష్య చమురు కొనుగోలు చేస్తున్నాయి కదా మరీ అవి కూడా యుద్ధానికి నిధులు సమకూర్చినట్లేనా! ఒక్కసారి ఆలోచించండి అని భారత్‌కి మద్ధతుగా మాట్లాడారు. ( చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్) -
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత వైద్యవిద్యార్థులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చిందని తెలిపింది. శాంతి, అహింసే భారత విధానమని మరోసారి స్పష్టంచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ వ్యతిరేకమని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ నొక్కిచెప్పారు. ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తే.. అది శాంతి పక్షమేనని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని చెప్పారు. బుచా మారణకాండ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇది తీవ్రమైన అంశమని.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న వాదనకు మద్దతు పలుకుతున్నామని తెలిపారు. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టడం ద్వారా.. ఏ సమస్యకు పరిష్కారం దొరకదని పార్లమెంట్ వేదికగా ఉక్రెయిన్, రష్యాలకు సూచించారు. చదవండి: (ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన పథకమిదే..) ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవితవ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు జైశంకర్. విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారత విద్యార్థులను అకామిడేట్ చేయడానికి.. హంగరీ, పొలాండ్, చెక్ రిపబ్లిక్ సహా పలు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వివరించారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి కేంద్రప్రభుత్వం భారతీయులను తరలించింది. ఆపరేషన్ గంగ ద్వారా దాదాపు 25వేల మంది భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే మెడికల్ స్టూడెంట్స్ చదువు అర్థాంతరంగా ఆగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో అకామిడేట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు పార్లమెంట్లో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా) -
బుచా ఘటనపై స్పందించిన భారత్... స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు
India has chosen side of peace: ఉక్రెయిన్ పై రష్యా ప్రస్తుతం భయంకరంగా విరుచుకుపడటమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా బుచా నగరాన్ని శ్మశానంగా మార్చేసింది. ఈ నేపథ్యంతో భారత్ కూడా త్రీవ స్థాయిలో స్పందించింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోసం మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తుందని, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని ఉద్ఘాటించారు. ఇది ఒక రకంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్కి ఇచ్చిన సందేశం. అంతేకాదు సాధారణ పౌరులు ఎలాంటి సమస్యలకు గురికాకుండా చూడటానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అనేక దేశాలు భారత్‌తో నిమగ్నమై ఉన్నాయని, ఒకే అభిప్రాయాన్ని పంచుకున్నమని అన్నారు. ఈ విధంగా కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని జై శంకర్ పేర్కొన్నారు. అంతేగాదు యూఎన్భద్రతా మండలి సమావేశంలో కూడా ఈ విషయమై భారత్ ఖండించడమే కాకుండా స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... “యుద్ధంలో భద్రతా పరిస్థితి క్షీణించింది, అలాగే మానవతా విలువలు కూడా క్షీణించాయి. ఇటీవల బుచాలో పౌర హత్యలకు సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మేము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తు పిలుపుకు మద్దతు ఇస్తున్నాము. అని అన్నారు. ( చదవండి: రష్యా ‘బుచా’ నరమేధం!.. భారత్ స్పందన ఇది) -
దిగజారిన పరిస్థితి.. ఏకంగా 10 గంటల పవర్ కట్! భారత్ ఏమంటోంది..
ప్రజల కనీస అవసరాలు తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక అల్లాడిపోతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం విలవిల్లాడుతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. పెట్రోల్ నుంచి కూరగాయల వరకూ అన్నీంటికీ కొరతే. డీజిల్ లేక బంకులు మూతపడ్డాయి. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అత్యవసరాలతోపాటు నిత్యావసరాలూ లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండగా.. దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటలపాటు పవర్ కట్ ఉంటుంది. విద్యుత్ కోతలు పెరగడంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్ వెలుతురులో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు లంక దీనస్థితిపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ట్విట్టర్లో స్పందించారు. ఈ విషయంలో భారత్ ఎలా సహకరించగలదో తెలుసుకోమని మన దేశ రాయబారిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టు భారత్ ఇప్పటికే ప్రకటించింది. (చదవండి: రష్యా దురాక్రమణ.. ఆఫీస్‌కు లేటయి బతికిపోయాడు!) -
పాలస్తీనా భారత రాయబారి ముకుల్ హఠాన్మరణం!
పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య ఆకస్మిక మరణం చెందారు. రమల్లహ్ భవనంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ముకుల్ మరణానికి గల కారణాల గురించి ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వంగానీ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇరు దేశాలు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి, సంతాపాన్ని ప్రకటించారు విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి. Mukul Arya మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని సైతం దర్యాప్తు విభాగాలను ఆదేశించారు. Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya. He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones. Om Shanti. — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022 ముకుల్ నేపథ్యం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన ముకుల్ ఆర్య.. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఢిల్లీ విదేశాంగ విభాగాల్లోపని చేసిన ఆర్య.. యునెస్కో(పారిస్)లో శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. అంతేకాదు కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. -
చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరం!
మెల్బోర్న్: చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘించిన కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మోహరించడం, వారి అత్యుత్సహం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. శనివారం క్వాడ్ సమావేశంలో భాగంగా భారత్, చైనా మధ్య లడఖ్ ప్రతిష్టంభన గురించి చర్చ జరిగిందా అని విలేఖరులు ప్రశ్నించారు. దీనికి జయశంకర్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య చర్చ జరిగిందని తెలిపారు. సరిహద్దు దేశాల మధ్య సమస్యలపై వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. 2020 ఏప్రిల్ లో చైనా నిబంధనలను ఉల్లంఘించి భారత భూ భాగంలోకి చొరబడిన కారణంగానే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదం గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నాయని దీని గురించి బహుపాక్షిక వేదికల్లో ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి తమ భాగస్వామ్యం ఉంటుందని సూచించారు. దేశాల సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రతను ప్రోత్సహించడం కోసం క్వాడ్ పనిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు జైశంకర్ చెప్పారు. ఈ సమావేశంలో సభ్య దేశాలు(భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్) రక్షణ, భద్రతా సహకారంలో పురోగతిపై క్లుప్తంగా చర్చించాయి. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
మెల్బోర్న్: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్‌ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు. రష్యా దూకుడుకు భారీ మూల్యమే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ అయ్యారు. విఫల ప్రయోగం: చైనా క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
అఫ్గాన్‌కు తక్షణ మానవతా సాయం
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని భారత్, ఐదు సెంట్రల్ ఆసియా దేశాలు నిర్ణయించాయి. అదేసమయంలో, అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరా దని ఆదివారం న్యూఢిల్లీలోని జరిగిన మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు పేర్కొంది. సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మం త్రులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ సాయం అందజేయడం కొనసాగించాలని తీర్మానించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉం డాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి జై శంకర్ చెప్పారు. -
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ
-
అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ విషయంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం మంగళవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను పూర్తిగా వీడిన నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: జమ్ము కశ్మీర్లో అఫ్గాన్ యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు బృంద సభ్యులుగా కేంద్రమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను నియమించారు. అఫ్గాన్ నుంచి భారతీయులు, మైనారిటీలను తీసుకురావడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించనుంది. చదవండి: Afghanistan: రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్ డాలర్ల పరికరాలు -
తూర్పు లద్దాఖ్‌లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్(ఎస్సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్ వాంగ్ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయన్నారు . రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్ ప్రస్తావించారు. ‘తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యం ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్ అన్నారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు. -
400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్ సీన్‌ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్ మర్డర్ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి... రాణి కేతేవాన్ కథ ఏంటంటే.. సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. గోవాలో రాణి కేతేవాన్ అవశేషాలు ఈ క్రమంలో రాణి కేతేవాన్ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్ గోవా సెయింట్ అగస్టీనియస్ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 22 వేల డీఎన్ఏలతో పోల్చారు తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు తెలిపారు. -
అమెరికాతో మైత్రీబంధం
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అయిదు రోజుల పర్యటన కోసం సోమవారం అమెరికా చేరుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరు దేశాలమధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడిం దన్న అభిప్రాయం కలిగిన ప్రతిసారీ ఆయన భారత్ గురించో, ప్రధాని నరేంద్ర మోదీ గురించో ఏదో రకమైన దుర్వా్యఖ్య చేసి అయోమయం మిగిల్చేవారు. కేవలం మన విషయంలోనే కాదు...ప్రపంచ దేశాలన్నిటి పట్లా ఆయన ధోరణి అలాగే వుండేది. భారత్, అమెరికాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలతో ఇండో–పసిఫిక్ ప్రత్యేక కూటమి ఉండాలని అమెరికా ప్రతిపా దించి చాన్నాళ్లయింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడే ఈ ఆలోచన అమెరికాలో మొగ్గతొడిగింది. అది ట్రంప్ హయాంలో ఇంకాస్త విస్తృతమైంది. మొదట్లో ఎన్నో అవరోధాలు ఏర్పడి, దాదాపు మూలనబడిందనుకున్న ఆ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రూపం సంతరించుకుంటోంది. ట్రంప్ తీరుతెన్నులెలావున్నా, ఆ విషయంలో ఎంత అసంతృప్తివున్నా చైనా దూకుడు చూసి...దానితో పడుతున్న సమస్యలు నానాటికీ పెరగడం గమనించి మనతో పాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా ఇండో–పసిఫిక్ కూటమిపై ఆసక్తి ప్రదర్శించాయి. దక్షిణ కొరియా సైతం దీనిలో భాగస్వామిగా మారేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ కూటమి గురించి పాటుపడుతూనే ట్రంప్ అప్పుడప్పుడు అంతర్జాతీయ కూటములపై నిరాసక్తత కనబరి చేవారు. ఏనాటినుంచో వున్న నాటో కూటమిపైనే ఆయన ఎన్నో షరతులు విధించడం మొదలె ట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర దేశాల్లో ఒకరకమైన అనిశ్చితి ఆవహించడంలో వింతేమీ లేదు. కానీ జో బైడెన్ అధికారంలోకొచ్చాక ఇంటా, బయటా ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే జైశంకర్ అయిదు రోజుల విస్తృత పర్యటన సాధ్య మైంది. ట్రంప్ వల్ల ఎన్ని సమస్యలొచ్చినా ఆయనైతేనే ఇరుదేశాల సంబంధాలూ సవ్యంగా సాగుతాయన్న అభిప్రాయం మోదీతో సహా అందరికీ వుంది. అయితే బైడెన్ రావడం కూడా మంచి పరిణామమేనని ఇప్పుడు ప్రభుత్వంలోని వారంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన టీంలో వున్నవారిలో మెజారిటీ సభ్యులు గతంలో మనదేశంతో మంచి సంబంధాలున్న వారు. అందువల్లే కావొచ్చు... బైడెన్ వచ్చిన వెంటనే భారత్‌తో మరింత మైత్రీబంధం ఏర్పడ టానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ద్వైపాక్షిక రంగంలోనే కాక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయడానికి ఏమేం చేయాలో ఖరారు చేసుకున్నారు. జైశంకర్ చర్చించబోయే అంశాల్లో కేవలం ఇండో–పసిఫిక్ కూటమి ఒక్కటే కాదు...చాలా వున్నాయి. అందులో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడానికి అవసరమైన సహకారం ఒకటి. రెండో దశ కరోనా విరుచుకుపడిన మొదట్లో అమెరికా కొంత నిర్లిప్త ధోరణి ప్రదర్శిం చింది. అమెరికాలో వున్న ట్రంప్ అనుకూల భారత సంతతి పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిపడటంతో వెనువెంటనే సరిదిద్దుకుంది. ఈమధ్య మన దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఎదురై అనేకమంది మృత్యువాతపడినప్పుడు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి అవసర మైన ఉపకరణాలనూ, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లనూ అందజేసింది. జైశంకర్ తన పర్యటన సంద ర్భంగా కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ లతో కూడా మాట్లాడతారు. ఈ వ్యాక్సిన్లు మన దేశానికి అందించడానికి పాటించదల్చుకున్న విధివిధానాలేమిటో ఆయన ప్రభుత్వంతో కూడా చర్చిస్తారు. తన దగ్గరున్న 8 కోట్ల డోసుల వ్యాక్సిన్లను అవసరమైన దేశాలకు అందజేస్తామని ఈమధ్యే అమెరికా ప్రకటించింది. మన దేశం రెండో దశ కరోనాలో భారీ జన నష్టాన్ని చవిచూసినందువల్ల ఆ వ్యాక్సిన్లను భారత్‌లోనే తయారుచేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా జైశంకర్ చర్చిస్తారు. వ్యాక్సిన్ తయారీ విధానంపై వున్న పేటెంట్ హక్కుల్ని తాత్కాలికంగా సడలించి, వెనకబడిన దేశాలు సైతం వాటిని స్వేచ్ఛగా ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో గత అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతోపాటు మన దేశం కోరినప్పుడు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభా మొత్తం సాధ్యమైనంత త్వరగా కరోనా నియంత్రణ టీకాలు వేసుకుంటేనే అన్ని దేశాలూ సురక్షితంగా వుండగలవని, ఈ విషయంలో ఎవరు వెనకబడినా అందరికీ ప్రమాదమేనని మన దేశం వాదించింది. ఈ అంశాలన్నీ మరోసారి చర్చల్లోకొస్తాయి. పేటెంట్ల సడలింపులో యూరప్ దేశాలను ఒప్పించమని జైశంకర్ కోరే అవకాశం వుంది. ట్రంప్ ఏలుబడిలో అమెరికా నిరాసక్తత వల్ల బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ తప్పదన్న అభిప్రాయం కలగడంతో మన దేశం యూరప్ దేశాల చొరవకు అనుకూలంగా స్పందించింది. అలాగే చైనాతో సంబంధాలు పెంచుకోవటానికి, రష్యాతో వున్న మైత్రీబంధాన్ని మరింత విస్తరించుకోవటానికి ప్రయత్నించింది. కానీ జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తి మార్చిన తర్వాత చైనా మన దేశం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించటం, దానికి ముందూ తర్వాత కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించటం వగైరా పరిణామాలు...ఈలోగా బైడెన్ ఆగమనం తర్వాత అమెరికా మళ్లీ అంతర్జాతీయంగా చురుకైన పాత్ర పోషించటం మొదలుపెట్టడంతో ఇరు దేశాలూ దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న జైశంకర్ తాజా పర్యటనతో ఈ బంధం మరింత చిక్కబడుతుందని భావించాలి. -
లండన్‌లో బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ
లండన్/వాషింగ్టన్: భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం లండన్‌లో సమావేశమయ్యారు. భారత్‌లో కోవిడ్ పరిస్థితితోపాటు వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంతం, వివిధ అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ కోవిడ్‌పై పోరులో అందిస్తున్న సహకారానికి బ్లింకెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌పై పోరులో భారత్‌కు సాధ్యమైనంత మేర సాయం అందిస్తామని బ్లింకెన్ తెలిపినట్లు జైశంకర్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపైనా వారు చర్చించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. వైద్యసామగ్రి, ఔషధాలతో మరో దఫా సాయం భారత్‌కు త్వరలోనే అందనుందని అమెరికా విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. భద్రతామండలి, వాతావరణ మార్పులు, మయన్మార్‌లో పరిణామాలపైనా బ్లింకెన్‌తో చర్చించినట్లు అనంతరం జై శంకర్ ట్విట్టర్లో తెలిపారు. జీ7 విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు జై శంకర్ లండన్ వెళ్లారు. -
తెలుగు వాళ్లు ప్రతిభావంతులు: కేంద్ర మంత్రి
సాక్షి, అమరావతి: తెలుగు వాళ్లలో ప్రతిభావంతులు ఉన్నారని, తాను ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లని కలుస్తానని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఆయన శనివారం ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా నియంత్రణ అదుపులో ఉందని, కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పురోగాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో కరోన విస్తరించినప్పుడు ఎటువంటి సేవలు అందుబాటులో లేవని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు దేశంలో వాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలను విస్తరించామని, కరోనా వ్యాప్తి తరువాత దేశంలో పరిశ్రమ రంగం కుదేలయిందని, లాక్డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయామన్నారు. కరోన తరువాత 11 శాతం వృద్ధి దేశంలో ఉందని, కేంద్ర మంత్రి బడ్జెట్‌ను 6 స్థంబాలుగా విభజించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. బడ్జెట్లో అనేక రంగాలకు పెద్దపీట వేసి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 1600 కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో రూ.2లక్షల కోట్లతో ఉత్పత్తి రంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దేశంలో 5 మెట్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డీబీటీల ద్వారా పేదలను అదుకున్నామని, ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఏపీలో త్వరలో మూడు క్లస్టర్స్ ఏర్పాటు కాబోతున్నాయని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం ఆర్ధికంగా స్థిరపడుతుందన్నారు. బడ్జెట్‌పై చాలామంది విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రాల వారిగా బడ్జెట్‌ను చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రాల విమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, ఆయా రాష్ట్రాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందించామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం బడ్జెట్‌పై విమర్శలు చూస్తున్నారని, ఏపీలో గ్లోబల్ ఇంపాక్ట్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. చైనా సరిహద్దుల వెంబడి జరుగుతున్న వివాదంపై కేంద్రం చర్యలు చేపడుతోందని, కేంద్ర రక్షణా శాఖ మంత్రి ఇప్పటికే సరిహద్దుల వెంబడి పర్యటించి పరిస్థితులు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రక్షణా రంగానికి అధికంగా నిధులు కూడా కేటాయించారని, కేంద్ర మంత్రుల బృందం ఈ అంశంపై భేటీ అవుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం నా పరిధిలోకి రాదన్నారు. సంబంధిత శాఖ మంత్రులు ఈ అంశం పై స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రధానితో అన్ని దేశాల అధ్యక్షులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. -
అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: అమెరికాలోని షికాగో నగరంలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో పాతబస్తీ సంతోష్‌నగర్ మోయిన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్(43) గాయపడ్డారు. షికాగోలోని సౌత్ మిచిగాన్ ఎవెన్యూ 11300 బ్లాక్ వద్ద ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) ముజీబుద్దీన్ కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి అడ్డగించారు. ముజీబుద్దీన్ పర్సు లాక్కుని కారు కూడా ఇవ్వాలని బెదిరించారు. ముజీబుద్దీన్ వారించగా అతనితో కాసేపు పెనుగులాడారు. ఈ క్రమంలో ముజీబుద్దీన్‌పై కాల్పులు జరపడంతోపాటు తలపై తుపాకీతో కొట్టి కారుతో దొంగలు ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. స్థానికులు ముజీబ్‌ను యూనివర్సిటీ ఆఫ్ షికాగో హాస్పిటల్‌కు తరలించారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు తెలిపారు. ముజీబ్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోతుండగా కొందరు స్థానికులు ఫొటోలు తీశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన షికాగో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ దారుణం గురించి ముజీబుద్దిన్ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్త రూమ్‌లో ఉండే వ్యక్తి జరిగిన ప్రమాదం గురించి మాకు తెలియజేశాడు. దారుణం గురించి తెలిసి కుప్పకూలిపోయాం. ప్రస్తుతం నా భర్త ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. తనను చూసుకోవడానికి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మాకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాను. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్లని సంప్రదించి నా భర్తకు తగిన వైద్య సాయం అందేవిధంగా చూడాలని కోరాను’ అన్నారు. ఈ ఉదంతాన్ని పాతబస్తీకి చెందిన ఎంబీటీ నేత అంజద్ఉల్లాఖాన్ షికాగోలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. (చదవండి: అమెరికాలో శవమై తేలిన యువతి) కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ముజీబుద్దీన్ 2015లో అమెరికాలోని షికాగో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ప్రముఖ స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య అఫ్రోజ్ కౌసర్‌తోపాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన కుమారుడు కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ముజీబ్ తల్లి షహనాజ్ తయ్యబా చెప్పింది. ముజీబ్ద్దీన్కు వీసా పత్రాల విషయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పటివరకు స్వదేశానికి రాలేని పరిస్థితి నెలకొందని, ఈ ఏడాది జూన్‌లో అతని తండ్రి ముంతజీబ్ మరణించినా ఈ సమస్య కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఈ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తను రాసిన ‘ది ఇండియా వే’పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత్–చైనా సరిహద్దు సమస్య చాలా కష్టమైందీ, క్లిష్టమైంది అంటూ ఆయన.. గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను చారిత్రక కోణంలో ఆవిష్కరించారు. వాణిజ్యం, పర్యాటకం, ఇతర కార్యక్రమాల ద్వారా 1980ల నుంచి ఈ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగితే ఆ ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా ఉంటుందని, ఏం జరుగనుందో చూడాలని అన్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారత్, చైనాలు..తమ మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధిస్తాయనేదే పెద్దప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌కు ముందే రాశాననీ, అప్పటికి తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు మొదలుకాలేదని ఆయన అన్నారు. -
చైనా ముప్పు; భారత్- జపాన్ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ, ఇతర కీలక అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి భారత్, జపాన్ల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. అలాగే, ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్(ఐపీఓఐ)’కు నాయకత్వం వహించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగిల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయించారు. సురక్షిత, స్వేచ్ఛాయుత ఇండో– పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా భారత్ చొరవతో ఈ ఐపీఓఐ ఏర్పడింది. ఈ ప్రాంతంలో చైనా మిలటరీ మౌలిక వసతులు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండో– జపాన్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలు ఫలప్రదంగా సాగాయని జైశంకర్ ట్వీట్ చేశారు. తీర ప్రాంత రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఐరాసలో సంస్కరణలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఇరువురు నేతలు చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. దృఢమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించుకునే దిశగా రెండు దేశాల మధ్య సైబర్ సెక్యూరిటీ ఒప్పందం కుదిరిందని పేర్కొంది. (చదవండి: ‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు) -
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
'మలేషియాలో చిక్కుకున్న వారిని రప్పిస్తాం'
ఢిల్లీ : మలేషియాలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్ర విదేశాంగశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మలేషియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు కౌలలంపూర్ నుంచి విశాఖ, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు ఏర్పాటు చేస్తామన్నారు. మలేషియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని జైశంకర్ తెలిపారు. (‘నెల్లూరు కరోనా బాధితుడు కోలుకుంటున్నాడు’) అంతకుముందు మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. మలేషియాలో చిక్కుకున్నవారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి, ఢిల్లీ ఏపీ భవన్ అధికారులు, విదేశాంగశాఖతో సీఎంఓ అధికారులతో సమన్వయమయ్యారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలపాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను కోరారు. -
అమెరికాకు నచ్చజెబుతున్నాం
న్యూఢిల్లీ: భారతీయుల నైపుణ్యాన్ని వాడుకోవడం ఇరువురకూ మంచిదని తాము అమెరికాకు నచ్చజెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గురువారం పార్లమెంటుకు తెలిపారు. అమెరికా ఏడు భారతీయ ఐటీ కంపెనీలను హెచ్1బీ వీసాలు పొందేందుకు అనర్హులను చేసిందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అలాంటిదేదీ లేదని, కాకపోతే ఆ కంపెనీలకు జారీ అవుతున్న హెచ్1బీ వీసాల సంఖ్యే తగ్గిందన్నారు. రెండేళ్లుగా వారు దరఖాస్తు చేసుకున్న వీసాల్లో తిరస్కరణలు ఎక్కువగా ఉన్నాయని, మిగిలిన కంపెనీల విషయంలోనూ ఇదే జరుగుతోందని వివరించారు. గత ఏడాది ఈ ఏడు ఐటీ కంపెనీలకు మొత్తం 3828 హెచ్1బీ వీసాలు జారీ కాగా, 15,230 వీసాలను పునరుద్ధరించారని చెప్పారు. భారతీయ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేయడం గురించి మాట్లాడుతూ అమెరికా వీరి కోసం 2015 నుంచి హెచ్4 వీసాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి చెప్పారు. హెచ్1బీ వీసాలనేవి ఒక్క భారతీయ కంపెనీలకు మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని అన్ని కంపెనీలకు సంక్లిష్టంగా మారిపోయాయని, కార్యక్రమంలో చేసిన పరిపాలన పరమైన మార్పుల కారణంగా దరఖాస్తుదారులు మరిన్ని దస్తావేజులను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈఏడాది 1,16031 కొత్త హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్ పూర్తయిందని, వీటిల్లో సుమారు 27, 707 తిరస్కరణకు గురయ్యాయని మంత్రి వివరించారు. -
'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'
సాక్షి, ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖకు విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. బంగ్లాలో చిక్కుకుపోయిన ఆంధ్ర జాలర్లను క్షేమంగా విడిపించేందుకు విదేశాంగశాఖ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ మేరకు వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని లేఖ ద్వారా పేర్కొన్నారు. బంగ్లా జలాల పరిధిలో అక్రమంగా చేపల వేట చేసినందుకు భాగేర్ హట్ అనే పట్టణంలో వారిని నిర్భంధించారని తెలిపారు. చేపల వేట కోసం బంగ్లా జలాల వైపు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్య కారులకు, బోట్ కంపెనీలకు సూచించినట్లు లేఖలో స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో చేపల వేట చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల వేటపై నిషేదం విధించింది. -
భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు
బీజింగ్/ఇస్లామాబాద్: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న జై శంకర్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్ చైనాను సందర్శించడం గమనార్హం. వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్‌లో సోమవారం జరిగిన భారత్–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్ చెప్పారు. -
విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా పర్యటన
న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. గత వారం భారత్ జమ్ము కశ్మీర్‌ను రెండుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేశీ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, విదేశాంగ మంత్రిగా జైశంకర్ తొలి చైనా పర్యటన ఇది. ఆదివారం చైనా బయల్దేరిన జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అవుతారు. కశ్మీర్ విభజన, ద్వైపాక్షిక వాణిజ్యం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం పర్యవసానాలు వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనను కూడా ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం సోమవారం సాయంత్రం రెండు దేశాల విదేశాంగ మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొంటారు. -
విదేశాంగ కార్యదర్శి జైశంకర్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా–చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు. జైశంకర్ స్థానంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో పాటు సీషెల్స్‌కు చెందిన ఓ దీవిలో మిలటరీ సౌకర్యాల అభివృద్ధికి చేసే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంలో జైశంకర్ కీలకపాత్ర పోషించారు. 1977 ఐఎఫ్ఎస్ అధికారి అయిన జైశంకర్ నాలుగున్నరేళ్ల పాటు చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. 2013లో అమెరికాలో భారత రాయబారిగా ఎం పికైన తర్వాత ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే ఉదంతంపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేశారు. -
జైశంకర్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ కొత్త కార్యదర్శిగా ఎస్.జైశంకర్ గురువారం ఢిల్లీలో సౌత్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను నిర్వహించాల్సింది చాలా పెద్ద బాధ్యత అని, దీన్ని తనకు అప్పగించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముందుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది: సుష్మా సుజాతాసింగ్‌ను పదవి నుంచి ఆకస్మికంగా, అర్థాంతరంగా తొలగించటాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సమర్థించారు. జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉందని, ఆ తేదీకన్నా ముందుగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ తాము ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందన్నారు. సుజాతాసింగ్ తొలగింపులో రాజకీయ ఉద్దేశమేమీ లేదన్నారు. -
కీచక పర్వంపైప్రజాగ్రహం
కేంబ్రిడ్జి పాఠశాల ఎదుట ఆందోళనలు భారీ బందోబస్తు ఏర్పాటు నిందితుడు జైశంకర్ అరెస్ట్ సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. విబ్‌గయార్, ఆర్కిడ్ సంఘటనలు మరచిపోకముందే కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో జైశంకర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో శుక్రవారం వెల్లడించారు. మరోవైపు నిందితుడు జైశంకర్‌ను బెంగళూరు న్యాయస్థానంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతి మేరకు వారంరోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తు మల్లేశ్వరం ఉపవిభాగం ఏసీపీ సారాఫాతిమా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజా ఘటనల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనిఖీ రోజే ఆకృత్యం... కేంబ్రిడ్జ్ పాఠశాల బెంగళూరు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తుంది. పాఠశాలలో భద్రతా చర్యల కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్పై ఈనెల 28న బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఈఓ) రమేష్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నిందితుడు చిన్నారిని మొదటి అంతస్తులోని బాలుర శౌచాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల పరిశీలనలో తేలింది. తర్వాతి రోజు (అక్టోబర్ 29న) కూడా ఇదే విధంగా చిన్నారిపై జైశంకర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి తన జననేంద్రియాల వద్ద సమస్యగా ఉందంటూ తల్లికి చెప్పడంతో ఆమె బాలికను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షల్లో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. తర్వాత వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక జీవన్‌భీమా నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విచారణలో శంకర్ ఇంటి వద్ద హిందీ ట్యూషన్లు చెప్పేవాడని తేలింది. ఆ సమయంలో బాధిత విద్యార్థిని తల్లి హిందీ నేర్చుకోవడం కోసం జై శంకర్ వద్దకు గతంలో ట్యూషన్‌కు వెళ్లేవారిని సమాచారం. ఇదిలా ఉంటే నిందితుడి కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండటం గమనార్హం. అగ్నిగోళంగా మారిన ప్రజాగళం... చిన్నారిపై అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. పాఠశాల వద్దకు చేరుకుని నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అదేవిధంగా 11 గంటల సమయంలో సీ.వీ రామన్‌నగర్ శాసనసభ్యుడు (బీజేపీ) రఘు నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెంగళూరులో ప్రతి రోజూ ఏదోఒక చోట పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి కే.జేజార్జ్తోపాటు సీఎం సిద్ధరామయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రఘు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పాఠశాల యాజమాన్యానికి చెందిన ఒక్కరు కూడా అటు విద్యాశాఖకు కానీ ఇటు పోలీసుశాఖకు కానీ అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం పాఠశాల పునఃప్రారంభం! పాఠశాల విద్యార్థినిపై అత్యాచార విషయం గురువారం రాత్రి వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం శుక్రవారం స్కూల్‌కు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సంఘటన పట్ల చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా చర్యలు సరిగా లేవ ంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడేంతవరకూ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తేల్చిచెప్పారు. చివరికి అందరూ కలిసి పాఠశాలను బుధవారం పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. నిర్లక్ష్యపు సమాధానాలు! కేంబ్రిడ్జ్ పాఠశాల ఉదంతం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కే.జే. జార్జ్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక వేత్తలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలు ప్రజలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత : పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లో జరిగే అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆయా పాఠశాలల యాజమాన్యానిదే బాధ్యత. అయితే అకృత్యానికి పాల్పడినవారు ఎవరైనా చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తాం. - సీఎం తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత: పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల రక్షణ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తే ‘కేంబ్రిడ్’్జ వంటి ఘటనలు పునరావృతం కావు. ప్రతి చోటుకూ వెళ్లి పోలీసులు రక్షణ కల్పించడానికి వీలుకాదుకదా? - హోంశాఖ మంత్రి -
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. వివిధ ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సం ఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖులు పాల్గొని జయశంకర్‌కు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. సీమాంధ్రులకు పూర్తి రక్షణ సరూర్‌నగర్: భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్య్ర హక్కులు కల్పించిందని... ఈ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల కు అన్ని విధాలా రక్షణ ఉంటుందని తెల ంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు లు, అధ్యాపక బృందం మంగళవారం జయశంకర్ జయంతి నిర్వహించారు. ఇందులో కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన తొలి వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే కుషాయిగూడ: రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని బీజేపీ జాతీయ నాయకులు సి.హెచ్.విద్యాసాగర్‌రావు చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టిఫ్) నిర్వహించిన ‘సద్భావనా సభ’ లో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... గిర్గ్లానీ కమిషన్ సిఫార్సులు, 610 జీఓ ప్రకారం నగరంలో అక్రమంగా ఉద్యోగాల్లో ఉన్న 1.50 లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఈటెల రాజేందర్, ‘టిఫ్’ అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీపీఐ ఫ్లోర్‌లీడర్ గుండా మల్లేష్, పీఓడ బ్ల్యు అధ్యక్షురాలు వి.సంధ్య, బీజేపీ నాయకులు ఎన్న్వీస్ ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ సేవలను కొనియాడారు. జీహెచ్ఎంసీలో... సిటీబ్యూరో: తెలంగాణ మునిసిపల్ ఉ ద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పిం చారు. జీహెచ్ఎంసీలోని జీ హెచ్ఎంఈయూల ఆధ్వర్యంలో గన్‌పా ర్క్, జీహెచ్ఎంసీలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మునిసిపల్ జేఏసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఎస్టీ, ఎస్టీ విభాగం అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు.