సాక్షి, ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖకు విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. బంగ్లాలో చిక్కుకుపోయిన ఆంధ్ర జాలర్లను క్షేమంగా విడిపించేందుకు విదేశాంగశాఖ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ మేరకు వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని లేఖ ద్వారా పేర్కొన్నారు. బంగ్లా జలాల పరిధిలో అక్రమంగా చేపల వేట చేసినందుకు భాగేర్ హట్ అనే పట్టణంలో వారిని నిర్భంధించారని తెలిపారు. చేపల వేట కోసం బంగ్లా జలాల వైపు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్య కారులకు, బోట్ కంపెనీలకు సూచించినట్లు లేఖలో స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో చేపల వేట చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల వేటపై నిషేదం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment