Fishermen arrested
-
శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. -
ముఖ్యమంత్రి చొరవతో విముక్తి
-
బంగ్లాదేశ్ జైలు నుంచి మత్స్యకారుల విడుదల
సాక్షి, అమరావతి/ పూసపాటిరేగ/ డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డులకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు గతేడాది సెప్టెంబర్ 27న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. సముద్రంలోబోటు మరమ్మతులకు గురికావడం, భారీ గాలుల కారణంగా అక్టోబర్ 2న భారత్ బోర్డర్ దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కి నాలుగు నెలలు జైలు జీవితం గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుల కృషితో బుధవారం ఉదయం 10 గంటలకు బంగ్లాదేశ్‌లో భగీరహట్ జైలు నుంచి మత్స్యకారులు మారుపల్లి పోలయ్య(43), ఆర్.అప్పన్న (38), వాసుపల్లి అప్పన్న (24), మారుపల్లి నరసింహ (45), వాసుపల్లి దానయ్య(51), వాసుపల్లి అప్పన్న (41), ఆర్.రాములు (24), బి.రాము (31) విడుదలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది జాలర్లు ఇటీవలే పాక్ జైలు నుంచి విడిపించి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ జాలర్ల కుటుంబాలు నాలుగు నెలలుగా అర్థాకలితో అలమటిస్తున్నాయి. వాసుపల్లి దానయ్య భార్య మంచం పట్టి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బర్రి రాము కుమార్తెకు నాన్న మీద బెంగతో జ్వరం పట్టుకుంది. వాసుపల్లి దానయ్య కుమారుడు రెండు నెలలుగా స్కూల్‌కి వెళ్లడం లేదు. ఈ కుటుంబాలన్నీ గత నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నాన్న కోసం పిల్లలు సముద్రం వైపే చూస్తున్నారు.. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. పిల్లలకు క్యారేజ్ కట్టడానికి కూడా డబ్బుల్లేవ్. ఇంటి పనులు చేసుకుంటూ సాయంత్రం ఇంటి యజమాని ఇచ్చే ఆహారాన్ని పిల్లలకి పెడుతున్నా. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా.. అంటూ పిల్లలు నిత్యం సముద్రం వైపే చూస్తున్నారు. జగనన్న సహకారంతో నా భర్త తిరిగి వస్తున్నట్టు సమాచారం అందింది. ఆనందానికి అవధుల్లేవ్.. – బర్రి ఎర్రమ్మ, బర్రి రాము భార్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషితోనే.. బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన మత్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో ఆ దేశం విడుదల చేసింది. రెండు మూడు రోజుల్లో వీరంతా స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి చొరవతో ఇప్పటికే పాకిస్థాన్ నుంచి మత్స్యకారులు విడుదల కాగా.. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా విడుదలవుతున్నారు. మత్స్యకారులపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. – మోపిదేవి వెంకటరమణారావు, మత్స్యశాఖ మంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం.. ఈ జీవితం ఉన్నంత వరకు సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం. నాలుగు నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త రాములు బందీ అయ్యాడు. పాకిస్తాన్లో బందీలుగా చిక్కిన మత్స్యకారులను విడిపించడంతో మాలో ఆశలు చిగురించాయి. అనుకున్నట్టుగానే నా భర్తను విడిపించారు. జగనన్నకు కృతజ్ఞతలు. – రాయితి దానయ్యమ్మ(రాములు భార్య), తిప్పలవలస -
'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'
సాక్షి, ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖకు విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. బంగ్లాలో చిక్కుకుపోయిన ఆంధ్ర జాలర్లను క్షేమంగా విడిపించేందుకు విదేశాంగశాఖ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ మేరకు వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని లేఖ ద్వారా పేర్కొన్నారు. బంగ్లా జలాల పరిధిలో అక్రమంగా చేపల వేట చేసినందుకు భాగేర్ హట్ అనే పట్టణంలో వారిని నిర్భంధించారని తెలిపారు. చేపల వేట కోసం బంగ్లా జలాల వైపు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్య కారులకు, బోట్ కంపెనీలకు సూచించినట్లు లేఖలో స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో చేపల వేట చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల వేటపై నిషేదం విధించింది. -
లంకలో ఏడుగురు తమిళ జాలర్ల అరెస్ట్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఏడుగురు జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పదుకొట్టాయ్ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శేఖర్ వెల్లడించారు. పదుకొట్టాయ్ జిల్లా జగదపట్టణానికి చెందిన ఏడుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లగా తమ సముద్రజలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ లంక అధికారులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రెండు పడవలను సీజ్ చేశారు. గత మూడు రోజుల కిందట 10 మేషిన్ బోట్లతో తమిళ జాలర్లు అక్రమంగా తమ పరిధిలోని నెడుంతురయ్ సమీపంలోకి చేపలవేటకు వచ్చారని, అధికారులు ఫొటోలు కూడా తీశారని లంక నేవీ ఆరోపించింది. ఐదుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకుపోగా తమ అధికారులే భారత జాలర్లను రక్షించినట్లు లంక తమకు సమాచారం అందించిందని అధికారి శేఖర్ వివరించారు. -
ఆగని దాడులు
జాలర్లపై శ్రీలంక సేనల దాడులు ఆగలేదు. చర్చలు జరిగి వారం రోజులైనా కాలేదు, మళ్లీ తమిళ జాలర్లపై కడలిలో దాడి జరిగింది. గురువారం శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి 38 మందిని పట్టుకెళ్లింది. ఈ సమాచారం రామేశ్వరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. జాలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై దాడులకు, అరెస్టులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 27న రెండు దేశాల జాలర్లతో చెన్నైలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో దాడులు, అరెస్టులపై కీలక నిర్ణయా లు తీసుకున్నారు. ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలు అమలయ్యే వరకు సరిహద్దులు దాటొద్దని శ్రీలంక జాలర్లు, రాష్ట్ర జాలర్లకు సూచించారు. దాడులు, అరెస్టులు జరగకుండా తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే, ఈ చర్చలు జరిగి వారం రోజులైనా కాక ముందే మళ్లీ దాడి జరగడం కలకలం రేపుతోందన్నారు. చర్చల ఫలితంగా శ్రీలంక చెరలో ఉన్న 69 మంది తమిళ జాలర్లు బుధవారం రాష్ట్రానికి వచ్చారు. వీరి రాకతో రామేశ్వరం జాలర్లు సమ్మె వీడి సముద్రం బాట పట్టారు. విడుదలైన వాళ్లు ఇలా వచ్చారో లేదో వేటకు వెళ్లిన వారు మళ్లీ బంధీ కావడంతో రామేశ్వరం, మండపం, పంబన్‌లలో ఉద్రిక్తత నెలకొంది. వేకవజామున పంజా: తమ వాళ్ల విడుదల సమాచారంతో ఐదు రోజుల తర్వాత చేపల వేటకు రామేశ్వరం, పంబన్, మండపం జాలర్లు బుధవారం రాత్రి కడలిలోకి వెళ్లారు. ఎడిషన్, నిషా, విన్నరసు, సహాయంతో పాటుగా పది మందికి చెందిన పడవలు కచ్చదీవుల సమీపంలో చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వేకువ జామున అటువైపుగా వచ్చిన శ్రీలంక నావికాదళం పంజా విసిరింది. తాము సరిహద్దులు దాటలేదంటూ జాలర్లు పేర్కొంటున్నా, కచ్చ దీవుల వైపు ఎందుకొచ్చారంటూ వీరంగం సృష్టించారు. తమ బోట్లను, జాలర్ల పడవలకు గుద్దుతూ, వలల్ని తెంచి పడేస్తూ, దుడ్డు కర్రలతో దాడులు చేశారు. దీంతో ఒడ్డుకు జాలర్లు తిరుగు పయనమయ్యారు. అయినా, వారిని వెంటాడి మరీ చితక బాదారు. నాలుగు పడవలు తప్పించుకోగా, ఆరు పడవల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో ఉన్న 38 మంది జాలర్లను తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరిని కాంగేషన్ హార్బర్లో ఉంచారు. అనంతరం అక్కడి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈసమాచారంతో రామేశ్వరం తీర గ్రామాల్లో జాలర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జాలర్లను బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పట్టుకెళ్లిన వారిని విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘నాగై’ బంద్!
సాక్షి, చెన్నై : జాలర్ల అరెస్టుకు నిరసనగా నాగపట్నంలో వాణిజ్య బంద్ విజయవంతం అయింది. దుకాణాలన్నీ మూత బడటంతో జనం తంటాలు పడ్డారు. ఆమరణ దీక్షలోకు పూనుకున్న వారిలో 20 మందికి అస్వస్థతకు లోనై స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలిం చారు. సచివాలయంలో సీఎం జయలలితతో జాలర్ల సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. నాగపట్నం జాలర్లు 200 మందికి పైగా శ్రీలంక చెరలో బందీగా ఉన్న విషయం తెలిసిందే. తమ వాళ్ల విడుదలకు డిమాండ్ చేస్తూ అక్కరై పేట, చీక్కినా కుప్పం తదితర ఎనిమిది గ్రామాల జాలర్ల కుటుంబా లు ఆమరణ దీక్షకు దిగాయి. చేపల వేటను నిషేధించా యి. నాగపట్నం తపాలా కార్యాలయం వద్ద వీరు వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, వర్తక సంఘాలు, లారీ యజమానులు, డ్రైవర్ల సంఘాలు కదిలాయి. వీరి నేతృత్వంలో ఆ జిల్లాలో ఆందోళనలు జరుగుతోన్నాయి. వాణిజ్య బంద్: సోమవారంతో దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వీరి దీక్షకు మద్దతుగా నాగై జిల్లా వాణిజ్య బంద్‌కు వర్తక సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో జిల్లాలో అన్ని దుకాణాలు మూత బడ్డాయి. పూంబుహార్, తరంగంబాడి, వేదారణ్యం, నాగుర్ తది తర ప్రాంతాల్లో జాలర్లకు మద్దతుగా ఆందోళనలు జరి గాయి. ప్రజా సంఘాలు, పార్టీలు జాలర్లకు మద్దతు ప్రకటించాయి. దీక్ష చేస్తున్న వారిలో 20 మంది మహిళలు ఉదయం అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నట్టుండి స్పృహ తప్పడంతో దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తంజావూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సీఎంతో భేటీ: తమ మీద జరుగుతున్న దాడుల్ని ఏకరువు పెట్టేందుకు, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ జాలర్ల సంఘాల ప్రతినిధులు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం జయతో భేటీ అయ్యారు. నాగపట్నం, పుదుకోట్టై, రామనాధపురం జిల్లాలకు చెందిన జాలర్ల సంఘాల ప్రతినిధులు వీరముత్తు, సెల్వన్, శివజ్ఞానం, వడి వేలు, విజయ్ తదితరులు సీఎంతో అరగంట పాటుగా సమావేశం అయ్యారు. శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో బందీలుగా ఉన్న జాలర్లను విడిపించాలని, పడవల్ని తిరిగి స్వాధీనం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటూ సీఎం జయలలిత చెప్పారు. నాగైలో సాగుతున్న దీక్షను విరమింప చేయాలని, జాలర్లకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. దీంతో జాలర్ల సంఘాలన్నీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు ప్రకటించారు.