‘నాగై’ బంద్!
Published Tue, Dec 24 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
సాక్షి, చెన్నై : జాలర్ల అరెస్టుకు నిరసనగా నాగపట్నంలో వాణిజ్య బంద్ విజయవంతం అయింది. దుకాణాలన్నీ మూత బడటంతో జనం తంటాలు పడ్డారు. ఆమరణ దీక్షలోకు పూనుకున్న వారిలో 20 మందికి అస్వస్థతకు లోనై స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలిం చారు. సచివాలయంలో సీఎం జయలలితతో జాలర్ల సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. నాగపట్నం జాలర్లు 200 మందికి పైగా శ్రీలంక చెరలో బందీగా ఉన్న విషయం తెలిసిందే. తమ వాళ్ల విడుదలకు డిమాండ్ చేస్తూ అక్కరై పేట, చీక్కినా కుప్పం తదితర ఎనిమిది గ్రామాల జాలర్ల కుటుంబా లు ఆమరణ దీక్షకు దిగాయి. చేపల వేటను నిషేధించా యి. నాగపట్నం తపాలా కార్యాలయం వద్ద వీరు వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, వర్తక సంఘాలు, లారీ యజమానులు, డ్రైవర్ల సంఘాలు కదిలాయి. వీరి నేతృత్వంలో ఆ జిల్లాలో ఆందోళనలు జరుగుతోన్నాయి.
వాణిజ్య బంద్: సోమవారంతో దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వీరి దీక్షకు మద్దతుగా నాగై జిల్లా వాణిజ్య బంద్‌కు వర్తక సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో జిల్లాలో అన్ని దుకాణాలు మూత బడ్డాయి. పూంబుహార్, తరంగంబాడి, వేదారణ్యం, నాగుర్ తది తర ప్రాంతాల్లో జాలర్లకు మద్దతుగా ఆందోళనలు జరి గాయి. ప్రజా సంఘాలు, పార్టీలు జాలర్లకు మద్దతు ప్రకటించాయి. దీక్ష చేస్తున్న వారిలో 20 మంది మహిళలు ఉదయం అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నట్టుండి స్పృహ తప్పడంతో దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తంజావూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
సీఎంతో భేటీ: తమ మీద జరుగుతున్న దాడుల్ని ఏకరువు పెట్టేందుకు, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ జాలర్ల సంఘాల ప్రతినిధులు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం జయతో భేటీ అయ్యారు.
నాగపట్నం, పుదుకోట్టై, రామనాధపురం జిల్లాలకు చెందిన జాలర్ల సంఘాల ప్రతినిధులు వీరముత్తు, సెల్వన్, శివజ్ఞానం, వడి వేలు, విజయ్ తదితరులు సీఎంతో అరగంట పాటుగా సమావేశం అయ్యారు. శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో బందీలుగా ఉన్న జాలర్లను విడిపించాలని, పడవల్ని తిరిగి స్వాధీనం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటూ సీఎం జయలలిత చెప్పారు. నాగైలో సాగుతున్న దీక్షను విరమింప చేయాలని, జాలర్లకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. దీంతో జాలర్ల సంఘాలన్నీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు ప్రకటించారు.
Advertisement