న్యూఢిల్లీ:తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో విమర్శలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాను అమెరికా వెళ్లడంపై రాహుల్ సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యల పట్ల జైశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు.
ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.రాహుల్ గాంధీ చెప్పేదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.
తన అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని సెక్రటరీ,ఎన్‌ఎస్‌ఏను కలిసేందుకు అక్కడి వెళ్లానని జైశంకర్ తెలిపారు.ప్రధాని మోదీకి ఆహ్వానం కోసం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు’అని జైశంకర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment