
మాయవతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్.. పార్టీలోకి వస్తూ పోతూ రావడం చాలా సందర్భాల్లోనే జరిగింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం, ఆపై మళ్లీ రావడం పరిపాటిగా మారిపోయింది. గత నెలలో మేనల్లుడి చర్యలపై కోపాద్రిక్తురాలైన మాయావతి.. అన్ని బాధ్యతల్ని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆకాశ్ ఆనంద్ తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ అత్త మాయావతిని వేడుకుంటున్నాడు. తనను క్షమించాలని, ఇక నుంచి బాధించే పనులు ఏమీ చేయనని కాళ్ల బేరానికి వచ్చారు.
‘నేను చేసిన అన్ని తప్పులను క్షమించి తిరిగి నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి. పార్టీలోకి నన్ను తీసుకోండి. నేను పార్టీకి, మా అత్త మాయావతికి రుణపడి ఉంటాను.ఇక తిరిగి ఎప్పుడూ ఎటువంటి తప్పిదాలు చేయను.పార్టీకి నష్టం చేసే పనులు అస్సలు చేయను’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు ఆకాశ్ ఆనంద్
అత్త మాయవతిని బాధించే పని చేయను..
తాను ఇక నుంచి మాయవతి చెప్పినట్లే నడుచుకుంటానని, ఎవర్నుంచి ఏ విధమైన తప్పుడు సలహాలు తీసుకోనని పేర్కొన్నాడు. బీఎస్పీలో ఉన్న సీనియర్ల నుంచి ఏమైనా మంచి విషయాలు ఉంటే నేర్చుకుంటానని స్పష్టం చేశాడు.
గత నెలలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి.. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది కూడా ఆకాష్ ఆనంద్ పై వేటు పడింది. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలోమరోసారి బాధ్యతల నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.
1. बी.एस.पी की राष्ट्रीय अध्यक्ष, यू.पी. की चार बार रही मुख्यमंत्री एवं लोकसभा व राज्यसभा की भी कई बार रही सांसद आदरणीया बहन कु. मायावती जी को मैं अपना दिल से एकमात्र राजनीतिक गुरू व आदर्श मानता हूं। आज मैं यह प्रण लेता हूं कि बहुजन समाज पार्टी के हित के लिए मैं अपने रिश्ते-नातों…
— Akash Anand (@AnandAkash_BSP) April 13, 2025
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించగా, మరొకసారి బహిష్కరణకు గురయ్యాడు ఆకాశ్ ఆనంద్. ఇలా పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం, మళ్లీ తిరిగి పార్టీలోకి రావడం ఆకాశ్ ఆనంద్ కు అలవాటే.