చెన్నై : పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు.
శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్ అధికారులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment