తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య | BSP Tamil Nadu Chief Hacked To Deceased In Chennai, See Details Inside | Sakshi
Sakshi News home page

తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య

Published Sat, Jul 6 2024 7:01 AM | Last Updated on Sat, Jul 6 2024 10:12 AM

BSP Tamil Nadu chief hacked to deceased in Chennai

చెన్నై: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్‌ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్‌ గాంధీ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా..  అప్పటికే ఆయన మృతి చెందినట్లు  డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.

దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్‌ పోలీసులు తెలిపారు. ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్‌ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్‌ చేశారు.  హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. 

ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యను ఖండించిన బీఎస్పీ  చీఫ్‌ మాయావతి
కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పందించారు.  ‘ఆర్మ్‌స్ట్రాంగ్‌  హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని  దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా  అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్‌’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement