Armstrong
-
రాత్రి అరెస్టు.. ఉదయాన్నే ఎన్కౌంటర్!
సాక్షి, చైన్నె: చైన్నె కమిషనరేట్ పరిధిలో రెండున్నర నెలలవ్యవధిలో మూడో ఎన్కౌంటర్ సోమవారం జరిగింది. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అరెస్టయిన చైన్నె తాంబరంకు చెందిన ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజా సోమవారం ఉదయాన్నే జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వివరాలు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో రౌడీల గుండెలకు పోలీసులు ముచ్చెమటలు పటిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని జల్లెడ పట్టి మరీ అరెస్టు చేస్తున్నారు. అదే సమయంలో చైన్నె పోలీసు కమిషనర్‌గా అరుణ్ బాధ్యతలు స్వీకరించగానే ఈ కేసులో నిందితుడైన తిరువెంగడంను ఎన్కౌంటర్లో హతమార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ కాకా తోపు బాలాజీని మట్టుబెట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ కేసులో నిందితుల వేట ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో 29వ నిందితుడిగా ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజాను ఆదివారం రాత్రి ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఓ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చి పారిశ్రామిక వేత్తకు బెదిరింపు ఇచ్చిన కేసు విచారణ నిమిత్తం వేళచ్చేరి స్టేషన్ పోలీసుకు అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయుధాలను దాచిపెట్టిన అక్కరై ప్రాంతానికి వేళచ్చేరి స్టేషన్ ఇన్స్పెక్టర్ విమల్ తన సిబ్బందితో సీ సింగ్ రాజాను తీసుకెళ్లారు. సీసింగ్ రాజాకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసిందే. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తాము కూడా ఆయన భార్యలంటూ తెరమీదకు వచ్చారు. వీరిలో ఎవరికి మృతదేహం అప్పగించాలో అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు.ఎదురుకాల్పుల్లో..ఆయుధాలను చూపిస్తానని పేర్కొని బకింగ్ హాం కాలువ తీరంలోని ఓ ప్రాంతానికి సీసింగ్ రాజ వెళ్లా డు. ఆయుధాలను చూపిస్తున్నట్టుగా పేర్కొంటూనే అక్కడున్న ఓ నాటు తుపాకీ ద్వారా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ విమల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పొట్ట, ఛాతి భాగంలో తూటాలు దిగడంతో ఘటనా స్థలంలో సీ సింగ్ రాజా కుప్పకూలాడు. ఎన్కౌంటర్ సమాచారంతో గ్రేటర్ చైన్నె దక్షిణ జోన్ అదనపు కమిషనర్ శిబిరాజ్ నేతృత్వంలోని అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే సీ సింగ్ రాజాను ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో తాము విచారించలేదని, పారిశ్రామిక వేత్తకు బెదిరింపులు ఇచ్చిన కేసులో ఆయుధాల కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని శిబిరాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు బయలుదేరాయి. రౌడీల ఎన్కౌంటర్ పర్వం కొనసాగుతుండటంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ సైతం అనుమానం వ్యక్తం చేశారు.వాహనాల సీజ్ నుంచి ఏ వన్ రౌడీగా..తాంబరం రామకృష్ణపురం సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన రాజ అలియాస్ సీసింగ్ రాజా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. తొలుత ఫైనాన్సియర్ ఒకరి వద్ద పనిచేశారు. ఎవరైనా కంతులు చెల్లించని పక్షంలో వారి వాహనాలను బలవంతంగా సీజ్ చేసి తీసుకెళ్లి ఫైనాన్సియర్‌కు అప్పగించే వాడు. మరమలై నగర్, ఇరుంగాట్టు కోట్టైలో రెండు పరిశ్రమల ఏర్పాటుతో తన దృష్టికి వాటి మీద పెట్టాడు. ఇక్కడి నుంచి వెలువడే ముడి ఇనుము, ఇతర పరికరాలను కొనుగో లు చేసి విక్రయించే క్రమంలో రౌడీ అవతారం ఎత్తాడు. అనుచరులను ఏకం చేసి, కిరాయి ముఠా నాయకుడిగా మారాడు. చైన్నెలో ప్రముఖ రౌడీలుగా ఉన్న ఆర్కాడు సురేష్ (ఇతడి హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగింది)కు అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో అజ్ఞాతంలో ఉన్న రౌడీ శంభో శంకర్‌కు మి త్రుడయ్యాడు. దీంతో ఏ వన్ రౌడీగా రాజ్య మేలు తూ వచ్చిన సీ సింగ్ రాజపై ఆరు హత్య కేసులతో పాటు 39 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో నాన్ బె యిల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇతడికి జానకీ, జాన్సీ అనే ఇద్దరు భార్యలు, ధనప్రియ, ధనుష్, యోగేష్ అనే కుమార్తె, కుమారులు ఉన్నారు. జాన్సీ ఆంధ్రాకు చెందిన మహిళ కావడంతో ఆర్మ్ స్ట్రాంగ్ హత్య అనంతరం కడపకు వెళ్లి తలదాచుకున్నాడు. చివరకు పోలీసులు అరెస్టు చేసి ఎన్కౌంటర్లో మట్టు బెట్టారు.మరో ఐదుగురు రౌడీల అరెస్టురౌడీల వేటలో భాగంగా చైన్నెలో సోమవారం నలుగురు, తిరుచ్చిలో ఓ ప్రముఖ రౌడీని అరెస్టు చేశారు. ఒట్టేరి, పులియాంతోపునకు చెందిన సుందర మూర్తి, కమల్, వెట్రి, భరత్ అనే ఈ నలుగురి రౌడీలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి మీద అనేక పాత కేసులు ఉన్నాయి. అలాగే తిరుచ్చిలో వృద్ధులను టార్గెట్‌చేసి, కంతు వడ్డి చెల్లించని వారిని గురి పెట్టి, ఆస్తుల పత్రాలు, ఆస్తులను కబ్జా చేస్తూ వచ్చిన రౌడీ, ఓ పార్టీకి చెందిన పట్టరై సురేష్‌ను అరెస్టుచేశారు. అతడి ఇంట్లో ఉన్న 60 మంది బాధితులకు సంబంధించిన దస్తావేజులు పోలీసులు సీజ్ చేశారు. అలాగే తిరుచ్చిలో పరారీలో ఉన్న రౌడీ జంబుకేశ్వరన్ను పోలీసులు పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. సాయంత్రం జరిగిన ఈ కాల్పులలో రౌడీ కాలికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. -
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, చెన్నై: బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో మంగళవారం మరో మలుపు చోటు చేసుకుంది. సినీ రంగానికి చెందిన దర్శకుడు నెల్సన్, ఆయన సతీమణి మోనీషాను పోలీసులు ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. బీఎస్పీ నేత ఆమ్ర్స్టాంగ్ చెన్నైలో గత నెల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఓ నిందితుడైన తిరువెంగడం పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు చోటు చేసుకంటూ వస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీ స్థానిక నాయకులు, కీలక రౌడీలను కేసులో అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో కేసు సినీ రంగం వైపుగా మరలడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో ప్రముఖ రౌడీ శంభోశంకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన గుండు కృష్ణన్ కోసం కూడా వేట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు లభించిన ఆధారాలు, పట్టుబడ్డ వారు ఇచ్చిన వివరాలు, సెల్ నెంబర్లు, కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గుండు కృష్ణన్‌తో జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ సతీమణి మోనీషా పలుమార్లు మాట్లాడినట్టు విచారణలో తేలింది. దీంతో ఆమెను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. మంగళవారం పోలీసులు ఆమె వద్ద తీవ్రంగా విచారణ చేపట్టారు. అలాగే నెల్సన్ ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. దీని ఈ జంట స్పందించాల్సి ఉంది. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్‌స్ట్రాంగ్ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు. హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను డిమాండ్ చేశారు.#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9— ANI (@ANI) July 7, 2024 ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును గమనిస్తే.. తమిళనాడులో అసలు శాంతి భద్రతలు లేవనిపిస్తోందని అన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
తమిళనాడు BSP చీఫ్ దారుణ హత్య
-
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
21 ఏళ్లకే డోపింగ్ చేశా: ఆర్మ్‌స్ట్రాంగ్
పారిస్: అమెరికా సూపర్ సైక్లిస్ట్‌గా... ప్రతిష్టాత్మక సైకిల్ రేసు ‘టూర్ డి ఫ్రాన్స్’కే మేటి చాంపియన్‌గా వెలుగువెలిగిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 2012లో డోపీగా తేలాక ప్రభ కోల్పోయాడు. దిగ్గజస్థాయి నుంచి దిగజారిపోయి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ బాగోతాన్ని తన కెరీర్ తొలినాళ్ల నుంచే మొదలు పెట్టినట్లు ఆర్మ్‌స్ట్రాంగ్ సెలవిచ్చాడు. 21 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ సీజన్లో డోపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. విటమిన్ ఇంజెక్షన్ల ద్వారా, ఇత రత్రా మెడిసిన్ల ద్వారా డోపింగ్‌కు పాల్పడినట్లు చెప్పాడు. అతనిపై తీసిన ఓ డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని స్వయంగా తానే వివరించాడు. ‘లాన్స్’ పేరిట రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీ మే 24, 31 తేదీల్లో చూడొచ్చు. -
50 లక్షల డాలర్లు చెల్లిస్తా
లాస్ఏంజెల్స్: సైక్లింగ్ రేస్ టూర్ డి ఫ్రాన్స్ దిగ్గజం లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో 50 లక్షల డాలర్ల (రూ. 33 కోట్లు) జరిమానా చెల్లించేందుకు కోర్టులో అంగీకరించాడు. అమెరికా పోస్టల్ సర్వీస్ తరఫున రేసుల్లో పాల్గొంటున్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ డోప్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీంతో ఆర్మ్‌స్ట్రాంగ్ తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని ఆరోపిస్తూ పోస్టల్ సర్వీస్ సంస్థ, మాజీ సహచరుడు ఫ్లాయిడ్ ల్యాండిస్లు అతడిపై 10 కోట్ల డాలర్లకు (రూ. 661 కోట్లు) కేసు వేశారు. దీనికి సంబంధించి వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే... ఆర్మ్‌స్ట్రాంగ్ లాయర్ల అభ్యర్థన మేరకు పరిహారంపై ఒప్పందానికి రావాల్సిందిగా యూఎస్ న్యాయ విభాగం సూచించింది. దీంతో ఈ దిగ్గజ సైక్లిస్ట్ ఉపశమనం పొందినప్పటికీ... ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణమైన ల్యాండిస్ న్యాయ ఖర్చులకు మరో 10 లక్షల 65 వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డోపింగ్‌తో కెరీర్ కోల్పోయిన ఆర్మ్‌స్ట్రాంగ్... కేసుల కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లోని తన ఇంటిని 75 లక్షల డాలర్లకు అమ్మకానికి పెట్టడమే దీనికి ఉదాహరణ. -
మరోసారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్!
కొత్త పుస్తకం (నేడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జయంతి) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గురించి గతంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఏదైనా పుస్తకం వచ్చినా, కొత్తగా ఆయన గురించి తెలుసుకునేదేముంది? అనుకోవడానికి లేదు. తెలిసిన విషయాలు చదివినా, తెలియని విషయాలు చదివినా ఆయన వ్యక్తిత్వం, కార్యాచరణ నుంచి ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందవచ్చు. ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్- ఏ లైఫ్ విత్ ఫ్లైట్’ పేరుతో ఇటీవల నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితకథ వచ్చింది. జర్నలిస్ట్ జె బార్బ్రీ ఈ పుస్తకాన్ని రాశారు. ఎన్బిసి న్యూస్రిపోర్టర్గా ప్రసిద్ధిగాంచిన జె అమెరికాకు సంబంధించిన అంతరిక్ష కార్యక్రమాలను ఎన్నో కవర్ చేశారు. అయిదు దశాబ్దాల... ఇంటర్వ్యూలు, నోట్స్, జ్ఞాపకాలు, సమావేశాలు... వీటి ఆధారంగా జె ఈ పుస్తకం రాశారు. రచయితకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సన్నిహితుడు కావడం కూడా పుస్తకం విలువను పెంచింది. ఎందరో ఉండగా, చంద్రుడిపై పాదం మోపడానికి అగ్రదేశం అమెరికా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎందుకు ఎంచుకుంది? ఆయనలోని ప్రత్యేకతలు ఏమిటి? జె మాటల్లో చెప్పాలంటే... ‘అసాధారణ మేధా, నిర్వహణ నైపుణ్యం, ఎంత ఒత్తిడికైనా లొంగని మనసు, స్పష్టమైన ఆలోచన తీరు’ ఇవి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అందరి దృష్టి తన మీదే ఉండాలని, తన గురించే మాట్లాడుకోవాలని ఆయన ఎప్పుడూ ఆలోచించేవారు కాదని అంటారు జె. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి వచ్చిన అన్ని పుస్తకాల్లోలాగే ‘మూన్ ల్యాండింగ్ మూమెంట్’ గురించి ఈ పుస్తకంలో ఉన్నప్పటికీ, దానికంటే కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యక్తిత్వ పరిచయం పాఠకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూడు వందల యాభై పేజీల ఈ పుస్తకంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు సంబంధించిన విలువైన ఉటంకింపులు ఉన్నాయి. ‘గొప్ప వ్యక్తుల గురించి వందసార్లు మాట్లాడుకున్నా... ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుంది’ అంటుంటారు. ఈ నేపథ్యంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి బాగా తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు కూడా చదవదగిన పుస్తకం ఇది.