21 ఏళ్లకే డోపింగ్‌ చేశా: ఆర్మ్‌స్ట్రాంగ్‌ | Doping At 21 Years Old Says Armstrong | Sakshi
Sakshi News home page

21 ఏళ్లకే డోపింగ్‌ చేశా: ఆర్మ్‌స్ట్రాంగ్‌

May 20 2020 12:03 AM | Updated on May 20 2020 12:03 AM

Doping At 21 Years Old Says Armstrong - Sakshi

పారిస్‌: అమెరికా సూపర్‌ సైక్లిస్ట్‌గా... ప్రతిష్టాత్మక సైకిల్‌ రేసు ‘టూర్‌ డి ఫ్రాన్స్‌’కే మేటి చాంపియన్‌గా వెలుగువెలిగిన లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ 2012లో డోపీగా తేలాక ప్రభ కోల్పోయాడు. దిగ్గజస్థాయి నుంచి దిగజారిపోయి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. డోపింగ్‌ బాగోతాన్ని తన కెరీర్‌ తొలినాళ్ల నుంచే మొదలు పెట్టినట్లు ఆర్మ్‌స్ట్రాంగ్‌ సెలవిచ్చాడు. 21 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్‌ సీజన్‌లో డోపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. విటమిన్‌ ఇంజెక్షన్‌ల ద్వారా, ఇత రత్రా మెడిసిన్‌ల ద్వారా డోపింగ్‌కు పాల్పడినట్లు చెప్పాడు. అతనిపై తీసిన ఓ డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని స్వయంగా తానే వివరించాడు. ‘లాన్స్‌’ పేరిట రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీ మే 24, 31 తేదీల్లో చూడొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement