National Politics
-
కళ్లెదుటి ఫలితాలకు కారణమేంటి?
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్‌దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒకరు.ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!రాజ్‌దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్‌డౌన్‌తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్‌దీప్. బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ. ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్‌దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలుగతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్‌దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ. వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్ఆర్) సంస్థ గణాంకాలను రాజ్‌దీప్ ఉటంకిస్తారు. రాజ్‌దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది. మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్‌దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన. అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.ఫలిస్తున్న ‘ప్రచారయావ’ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్‌దీప్ వివరి స్తారు. గుజరాత్లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట. ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.‘గోదీ మీడియా’ ప్రస్తావనఅమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది. తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్‌దీప్‌కు బాగా అక్కరకొచ్చాయి. ‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్‌ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది. ‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్‌లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి
Live Updates...వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఘన విజయం.. 1.52 లక్షల మెజారిటీ సాధించిన మోదీఇండోర్ బీజేపీ అభ్యర్థికి రికార్డ్ మెజార్టీ.. 10.08 లక్షల ఓట్లతో శంకర్ లాల్వానీ అఖండ విజయంమధ్య ప్రదేశ్ విదిశలో మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపురెండు చోట్లా రాహుల్ గాంధీ గెలుపు. వయనాడ్, రాయబరేలీ స్థానాలలో ఘన విజయంఅమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి. కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ విజయ కేతనంఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీయే కూటమి 290 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 234 స్థానాల్లో ముందంజ. మారుతున్న సమీకరణాలు..లక్నో లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్ ముందంజ. 17వేల ఆధిక్యం.యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటంతో పార్టీ కార్యకర్తల సంబురాలు.జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం కార్యకర్తల సంబురాలు. కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా వెనుకంజ.మధ్యప్రదేశ్‌లో వింత పరిస్థితి..ఇండోర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి 7లక్షల 89వేల ఆధిక్యం. అక్కడ నోటాకు లక్షా69వేల ఓట్లు.(రెండో స్థానంలో నోటా)మూడో స్థానంలో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్ Madhya Pradesh: BJP candidate from Indore Lok Sabha seat Shankar Lalwani leading with a margin of 7,89,625 NOTA (None of the Above) is currently on the second position with 1,69,228 votes pic.twitter.com/BWGsCrruxZ— ANI (@ANI) June 4, 2024 👉ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడికి భారీ ఆధిక్యం..51వేల ఓట్ల ఆధిక్యంలో ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌సింగ్ ఖల్సామాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జీత్ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు.పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 👉సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతాదళ్ మధ్య గట్టి పోటీకాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ 1158 ఓట్ల వెనుకంజపోటీ చేస్తున్న రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ 👉లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ షా ఘన విజయంగుజరాత్లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 👉ప్రస్తుత ట్రెండ్స్ ఇలా..ఫలితాల్లో ఎన్డీయే కూటమి-294 ముందంజఇండియా కూటమి-239 ముందంజ యూపీలో ఇండియా కూటమి-40ఎన్డీయే-38ఇతరులు-2హర్యానాలో ఇండియా కూటమి-6బీజేపీ-4తమిళనాడులో ఇండియా కూటమి-37ఎన్డీయే-1కర్ణాటకలో ఇండియా కూటమ10ఎన్డీయే- 18రాజస్థాన్‌లో బీజేపీ-13ఇండియా కూటమి-12బెంగాల్లో టీఎంసీ-31బీజేపీ-10కాంగ్రెస్-1మధ్యప్రదేశ్‌లో బీజేపీ-29కాంగ్రెస్-0అసోంలో ఎన్డీయే-10ఇండియ కూటమి-4జార్ఖండ్‌లో ఎన్డీయే-9ఇండియా కూటమి-5బీహార్‌లో ఎన్డీయే- 32ఇండియా కూటమి- 8మహారాష్ట్రలో ఇండియా కూటమి-28ఎన్డీయే-19పంజాబ్‌లో కాంగ్రెస్-7ఆప్-2ఒడిషాలో బీజేపీ-16బీజేడీ-4ఇండియా కూటమి-1ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-10కాంగ్రెస్-1కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 👉కాంగ్రెస్ 100 దాటితే కూటమిదే అధికారం: సంజయ్ రౌత్శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఒకవేళ కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అవుతారు. దేశ ప్రజలు కోరుకుంటే రాహుల్ గాంధే పీఎం. 👉 ఇప్పటి వరకు సమీకరణాలు ఇలా..బెంగాల్లో దూసుకెళ్తున్న అధికార టీఎంసీదాదాపు 31 స్థానాల్లో టీఎంసీ ముందంజ.బీజేపీ 10 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్-1మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్.. 29 స్థానాల్లో ముందంజతమిళనాడులో ఇండియా కూటమి 36 స్థానాల్లో ముందంజఎన్డీయే-1ఏడీఎంకే-2ఒడిషాలో బీజేపీ-18బీజేడీ-2ఇండియా కూటమి-1ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-9కాంగ్రెస్-2కర్ణాటకలో ఎన్డీయే-20కాంగ్రెస్-8కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 అమేఠీలో స్మృతి ఇరానీ వెనుకంజయూపీలోని అమేఠీలో సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకబడ్డారుఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ దాదాపు 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.హాసనలో ప్రజ్వల్ రేవణ్ణకు ఆధిక్యంకర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్‌పై 2369 ఓట్లతో ముందంజవారణాసిలో 600 ఓట్ల ఆధిక్యంలో మోదీప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీఇక్కడ మళ్లీ ముందంజలోకి వచ్చిన మోదీప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ లీడ్ ఇలా...బీహార్‌లో 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. పశ్చిమ బెంగాల్లో 21 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ అమేథీలో స్మృతీ ఇరానీ వెనుకంజ. కర్ణాటకలో 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడింగ్. యూపీలో ఇండియా కూటమి లీడ్. వారణాసిలో మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ.మణిపూర్‌లో ఆధిక్యంలో బీజేపీ. 👉 తాజా సమీకరణాల ప్రకారం..ఎన్డీయే-294ఇండియా కూటమి-223ఇతరులు-19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 👉 ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒడిషా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 13 స్థానాల్లో ముందంజ, బీజేడీ ఆరు స్థానాలు, ఇండియా కూటమి ఒక్క స్థానంలో ముందంజ. As per initial trends by ECI, BJP is leading on 13 seats, BJD leading on 6 seats in the Odisha Assembly elections. pic.twitter.com/T25jvjZxoo— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు వీరు లీడ్‌లో..వారణాసిలో మోదీ వెనుకంజ. ఆరు వేల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిరాజస్థాన్లో 20 స్థానాల్లో బీజేపీ లీడింగ్. మాండ్యాలో హెచ్డీ కుమారస్వామి లీడింగ్. మధురలో బీజేపీ నేత హేమామాళిని ముందంజ కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వెనుకంజకురుక్షేత్రలో బీజేపీ నేత నవీన్ జిందాల్ వెనుకంజ. 👉వయనాడ్, రాయబరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ ముందంజ. Congress candidate from Uttar Pradesh's Raebareli Lok Sabha seat Rahul Gandhi leading from the seat with a margin of 2126 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/VdMDwab4jP— ANI (@ANI) June 4, 2024 👉లీడింగ్‌లో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్ రిజుజు, Union Home Minister and BJP candidate from Gujarat's Gandhinagar Lok Sabha seat Amit Shah leading from the seat with a margin of 7311 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/fWF987QsA8— ANI (@ANI) June 4, 2024 As per initial trends by ECI till 9 am, the BJP is leading on 75 seats, Congress leading on 25 seats, Samajwadi Party leading on 8 seats, AAP leading on 5 seats. #LokSabhaElections2024 pic.twitter.com/4CcM5XHaJh— ANI (@ANI) June 4, 2024 👉 ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లీడ్ ఇలా..యూపీలో ఎన్డీయే కూటమి 53 స్థానాల్లో, ఇండియా కూటమి 24 స్థానాలు.మహారాష్ట్రాలో ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో ఇండియా కూటమి 21 స్థానాలు.పంజాబ్‌లో కాంగ్రెస్ ఐదు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లోమధ్యప్రదేశ్లో బీజేపీ 25, కాంగ్రెస్ 2రాజస్థాన్ బీజేపీ 20, ఇండియా కూటమి 4కేరళలో యూడీఎఫ్ 14, ఎల్డీఎఫ్ 6, ఎన్డీయే-0కర్ణాటకలో ఎన్డీయే 22, కాంగ్రెస్-6అసోం ఎన్డీయే 9, ఇండియా-3బీహార్ ఎన్డీయే 26, ఇండియా-9 👉ఎన్డీయే కూటమి 300 స్థానాల్లో ఆధిక్యం👉ఇండియా 170 స్థానాల్లో ఆధిక్యం. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఇలా.. As per initial trends by ECI till 8.47 am, the BJP is leading on 42 seats, Congress leading on 17 seats, AAP leading on 4 seats, Samajwadi Party leading on 2 seats. #LokSabhaElections2024 pic.twitter.com/PqudCi2uZf— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 253, 135 స్థానాల్లో ముందుంజ.👉ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 8 స్థానాల్లో ముందంజ, బీజేపీ 6 స్థానాల్లో ముందంజ.👉మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఆధిక్యం As per initial trends by ECI, the BJP is leading on 17 seats, Congress leading on one seat.#LokSabhaElections2024 pic.twitter.com/7651efxe82— ANI (@ANI) June 4, 2024 👉తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ వెనుకంజ👉గునాలో బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా ముందంజ 👉ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో ముందంజ👉ఇండియా కూటమి 123 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 👉ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీఇప్పటి వరకు 180 స్థానాల్లో బీజేపీ ముందుంజఇండియా కూటమి 90 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందంజ 👉ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు👉100పైగా స్థానాల్లో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. #WATCH | Uttarakhand | Counting of postal ballots started amid tight security in Haridwar. Visuals from a counting centre here.#LokSabhaElections2024 pic.twitter.com/zdeAuRkEYC— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్లో అమేథీలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ముందుంజ.👉వయనాడ్‌లో ఆధిక్యంలో రాహుల్ గాంధీ. 👉రాయబరేలీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. #WATCH | Uttar Pradesh: Counting of postal ballots underway at a counting centre in Raebareli Parliamentary constituency. #LokSabhaElections2024 pic.twitter.com/Gm9abdEyzd— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందుంజ. 👉 కౌంటింగ్ ప్రారంభం Counting of votes for the #LokSabhaElections2024 begins.The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. BJP won the Surat seat unopposed. pic.twitter.com/qfuRFSn4xi— ANI (@ANI) June 4, 2024 #WATCH | Punjab: Counting of votes for the #LokSabhaElections2024 begins. (Visuals from a counting centre in Amritsar) pic.twitter.com/uqZUzcvbCK— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 542 పార్లమెంట్ స్థానాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏపీలో, ఒడిషాలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం. Counting of votes for the #LokSabhaElections2024 begins. The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. Postal ballot counting to begin first.Counting is also being done for Andhra Pradesh and Odisha Assembly elections as well as… pic.twitter.com/3tu7Opjasf— ANI (@ANI) June 4, 2024 👉గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఇది చారిత్రాత్మకం. రామరాజ్యం కొనసాగుతుంది. మోదీపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీ గెలుపు ఖాయం. #WATCH | BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan says, "This is historic, Ram Rajya will continue. The biggest leader of the world is going to be the Prime Minister for the third time...People of the country have made the country win and placed their trust in PM Modi..."… pic.twitter.com/5z2B7NAb6G— ANI (@ANI) June 4, 2024 👉ఢిల్లీ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కూతురు భన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీని కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అవడం ఖాయం. #WATCH | BJP candidate from New Delhi Lok Sabha seat, Bansuri Swaraj says, "...I am completely confident that today the people of India will choose the public welfare policies of BJP, will choose the development policies of our Prime Minister Narendra Modi...I know Teesri Baar… pic.twitter.com/8VgHIrxDXj— ANI (@ANI) June 4, 2024 👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. #WATCH | Uttar Pradesh: Congress candidate from Mathura, Mukesh Dhangar says, "...INDIA Alliance will form a government. There is no doubt about it...This victory (Dhangar's victory) will be of the people of Brij. This will 1000% be the victory of Banke Bihari and Maa Yamuna."… pic.twitter.com/IP6Def2u81— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్ రూమ్స్ #WATCH | Karnataka: Strong room being opened in Bengaluru district ahead of the counting of votes for the #LokSabhaElections2024The counting of votes will begin at 8 am. pic.twitter.com/ACGhbarIbx— ANI (@ANI) June 4, 2024 👉మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ వద్ద పార్టీల ఏజెంట్స్, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. #WATCH | Madhya Pradesh: Strong room being opened in Indore district ahead of the counting of votes for the #loksabhaelections2024phase5 Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. (Source: Madya Pradesh I&PR) pic.twitter.com/ntfmwhTEPC— ANI (@ANI) June 4, 2024 👉కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. #WATCH | Tamil Nadu: Congress candidate from Sivaganga Lok Sabha seat Karti Chidambaram arrives at a counting centre in Karaikudi, Sivaganga districtVote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/fKLk5uJf3u— ANI (@ANI) June 4, 2024 👉కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనీష్ తివారీ కామెంట్స్.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. #WATCH | Congress MP and party candidate from Chandigarh Manish Tewari says, "..It is Tuesday, Hanuman's day. People have expressed their opinions. The opinions are locked in the EVMs. The EVMs will open and the opinion will come out. Whatever the people's decision will be,… pic.twitter.com/yptpWNkKN4— ANI (@ANI) June 4, 2024 👉దేశంలో 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 👉బరిలో 53 మంది మంత్రులు 53 మంది సిటింగ్ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. #WATCH | Delhi: Congress worker Jagdish Sharma says, "I have already said 6 days ago that the election has been looted, it (counting of vote) is just a formality because the people of the country believe in the Constitution system. All Congress party leaders will come but I will… pic.twitter.com/vzkn3YrKT4— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంపు.. హర్యానా, గుజరాత్, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు #WATCH | Security heightened at a counting centre in Jind, Haryana. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/YXFo7YXRhU— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Raebareli, Uttar Pradesh. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/iq06WWob5Q— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Bhubaneswar, Odisha. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/NhoU4qURN0— ANI (@ANI) June 4, 2024#WATCH | Security heightened at a counting centre in Purba Medinipur, West Bengal. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/bgdJ3KPgou— ANI (@ANI) June 4, 2024 👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 👉ఏకగ్రీవమైన సూరత్ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. -
బొటాబొటిగా జాతీయం!
చండీగఢ్ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్ (25), గుజరాత్ (26), హిమాచల్ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ (29)లో 28, ఛత్తీస్‌గఢ్ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న జాట్ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ చేసుకున్న ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్ చేస్తున్న ‘వికసిత భారత్’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్ లేబర్ శాంపుల్ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్ డౌన్ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్‌లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై?
చిత్తూరు, సాక్షి: ఏపీలో రాజకీయాలు ఊహించిన దానికంటే శరవేగంగా మారుతున్నాయి.. ఒక్క పొత్తులో సీట్ల పంపకం విషయంలో తప్ప!. తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేయడానికే జంకుతున్నారనే చర్చ నడుమ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పూర్తిగా దూరం అవుతారనే టాక్ ఒకటి నడుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. టీడీపీకి, చంద్రబాబు నాయుడికి కంచుకోటలా ఉంటూ వస్తోంది. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు నెగ్గుతూ వచ్చారు. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఆయనలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కుప్పంలో ఓడిపోతానని భయం ఆయనకు పట్టుకుంది. అందుకు కారణం.. సీఎం జగన్ ఈ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించడం. దీంతో.. ఆయన మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే పెనమలూరు స్థానం. కృష్ణా జిల్లా పెనమలూరు స్థానంలో 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ నెగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సాగిన జన ప్రభంజనంతో వైఎస్సార్సీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు.. మిగతా నియోజకవర్గాల్లో మాదిరే ఇక్కడా టీడీపీలో వర్గపోరు ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్‌కే టికెట్ కేటాయిస్తారంటూ తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. నాయుడుగారూ.. ఇంకెన్నిరోజులు?: ఢిల్లీ అధిష్టానం! పొలిటికల్ సర్కిల్స్ సమాచారం మేరకు.. బీజేపీతో పొత్తుల చర్చల కోసం టీడీపీ అధినేత మొన్నామధ్య ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడి అధిష్టానం ఆయన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఏపీలో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు. మీ వయసు డెబ్భై ఏళ్లు దాటింది. ఇంకెంత కాలం కష్టపడుతారు. పైగా అవినీతి కేసులు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో వయసురిత్యా రాష్ట్ర రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరం జరగండి. కావాలంటే జాతీయ రాజకీయాల వైపు రండి’’ ఆయనకు ఢిల్లీ పెద్దలు సూచించారట. శరద్ పవార్, దేవగౌడ.. ఇలా వయసు మళ్లిన కొందరు నేతల పేర్లను సైతం ఉదాహరించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే కుప్పం నుంచి ప్యాకప్ చేసుకోవడంతో పాటు పూర్తిగా.. ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతటి అవమానం కంటే ముందు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారట!. పెనమలూరులో పోటీ కోసం చంద్రబాబు నాయుడు తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో టీడీపీ అభిమానులు ఎక్కువే. పైగా పెనమలూరు సెగ్మెంట్లో కమ్మ వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం కూడా చంద్రబాబు ఆసక్తికి మరో కారణంగా స్పష్టమవుతోంది. కానీ, ఆ విషయాన్ని బయటపడనివ్వలేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. వర్గ పోరు మరీ ఎక్కువగా ఉంది. అందుకే బోడే ప్రసాద్‌ను ఆ వరుసలో ముందు నిల్చోబెట్టారు. చివరకు ఐవీఆర్ఎస్ సర్వేలో వ్యతిరేక ఫలితం వచ్చిందని చెబుతూ బోడేను పక్కన పెట్టేశారు. ఇక్కడా చంద్రబాబు తన వెన్నుపోటు బుద్ధిని ప్రదర్శించారు. స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో.. బోడే తనకు సంఘీభావంగా దీక్ష సైతం చేపట్టిన సంగతిని సైతం చంద్రబాబు విస్మరించారు. -
PM Modi: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా??
డబ్బులు ఊరికే రావు.... తళతళా మెరిసే గుండుతో టీవిలో కనబడినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంటాడు ఓ పెద్దాయన... వాస్తవమే కదా మరి.. దీన్నే రాజకీయ భాషలో చెప్పాల్సి వస్తే... అధికార పీఠం కూడా ఊరికే దక్కదు.. దశాబ్ద కాలంగా దేశాన్నిఏలుతున్న ఎన్డీయే కూటమికి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు. మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం అవలీలగానే దక్కబోతోంది కాబట్టి! విపక్షాల బలహీనతే ఎన్డీయే కు ఇప్పుడు పెద్ద బలం. అదే అధికారాన్ని మరోమారు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించబోతోంది. 2014 కు ముందు పదేళ్లు నిరాటంకంగా పాలించిన యూపీఏ కూటమి స్వయంకృత చేష్టలు ఆ పార్టీని అప్పట్లో అధికారానికి దూరం చేశాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువు తీరింది.. ఆనాటి నుంచీ నానాటికీ బలపడుతూ.. విపక్ష పార్టీలకు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. . రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా మరోమారు హస్తినలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే కూటమికి ఈసారి విజయం నల్లేరుపై నడకే కావొచ్చు కానీ... తన ప్రాబల్యాన్ని ఈమేరకు పెంచుకుంటుంది అన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాను పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో, 400 పైచిలుకు సీట్లు 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులతో తరచూ అంటూ ఉండేవారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే... ఈసారి ఎన్నికల్లో ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మధ్య ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చేపట్టిన ఒక సర్వే ప్రకారం 61 శాతం ప్రజానీకం మళ్ళీ మోదీ నే ప్రధానిగా చూడాలి అనుకుంటున్నామని చెప్పగా.. రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపింది మాత్రం కేవలం 21 శాతం మందే కావడం గమనార్హం. . బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్‘ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ వెలువరిస్తూ.. కేంద్రంలో ఉన్నబలహీన ప్రతిపక్షమే ప్రస్తుత అధికార పక్షాన్ని హ్యాట్రిక్ దిశగా నడిపించడం ఖాయమని అంచనా వేసింది. తదనుగుణంగానే ఇటీవలి రెండు సంఘటనలు ఈ అంచనాల్ని మరింత పెంచాయి.అందులో ఒకటి అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కాగా... రెండోది మిత్రునిగా మారిన ’ప్రియమైన శత్రువు’ నితీష్ కుమార్ ఎన్డీయే తీర్థం పుచ్చుకోవడం. మోదీ హవా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ రాష్ట్రం భూకంపం తాకిడికి అతలాకుతలమై ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉంది. దీని తాలూకు దుష్పరిణామాల నుంచి ఆ రాష్ట్రాన్ని కేవలం మూడేళ్ళలో బయట పడేయడమే కాదు.. గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్ది దేశ విదేశాల్లో ఆ రాష్ట్ర కీర్తి ఇనుమడిల్లేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, వేళ్లూనుకున్న అవినీతి, నిరుద్యోగ భూతం, మౌలిక వసతుల లేమి, ఉగ్రవాదం, జాతీయ భద్రతా సవాళ్లు, ఆర్ధిక తిరోగమనం, కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు దిగ్బంధం చేసిన ఆ తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లతో 335 సీట్లు చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం చరిత్ర చెబుతున్న సత్యమే. బలాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ సహకరించినట్లుగా తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ ఇప్పటికీ తగిన పట్టు మాత్రం సంపాదించలేక పోతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ప్రమాదకర సంకేతాలేవీ లేనప్పటికీ ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెడితే ఇక ఇప్పట్లో మోదీ టీం కు తిరుగే ఉండదు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరి మోగించడం ద్వారా ముచ్చటగా మూడోమారూ అధికార దండాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ప్రగతికి దోహదం చేసిన పరిణామాలు, సంస్కరించాల్సిన అంశాలను పరిశీలిద్దాం. అయోధ్య రామాలయం: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 లో బీజం పడింది. కోట్లాది హిందూ ఓటర్ల మనసులు గెలుచుకునేలా ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వచ్చిన బీజేపీ... తాజా ఎన్నికల వేళకు తనదైన శైలిలో అడుగులు వేయగలిగింది. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మొన్న జనవరి లో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కృతకృత్యమైంది. ఓటు బ్యాంకును పెంచే వాటిలో ఇదొక తాజా పరిణామం. పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు: ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య రంగాలతో పాటు విదేశీ పొర్టుఫోలియో మదుపర్లపై విధిస్తున్న సర్ చార్జీని రద్దు చేయడం వంటి విదేశీ విధానాల్లోనూ అనుసరించిన విప్లవాత్మక విధానాలు మోదీ సర్కారు కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాల్లో ఇనుమడింప జేశాయి. కేంద్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడిందన్న భరోసా, మోదీ పై ఉన్న అచంచల విశ్వాసం.. విదేశీ మదుపరులకు స్థైర్యాన్నిచ్చాయి. దీంతో పెట్టుబడుల వరద మొదలైంది. మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మధ్యలో కొవిడ్ పరిణామాలు వెనక్కి లాగినా.. అవన్నీ తాత్కాలికమేనని నిరూపిస్తూ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరిట దేశాన్ని గ్లోబల్ డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడం. శిశు మరణాలను తగ్గించేందుకు, లింగ వివక్షని రూపు మాపేందుకు భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం. యువతలో నైపుణ్యాలను వెలికితీసే స్కిల్ ఇండియా, ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా డిజిటల్ ఇండియాలపై దృష్టి. మురికివాడల సంస్కృతికి చర్మ గీతం పాడే రీతిలో అర్హులైన పేద ప్రజానీకానికి ఇల్లు దక్కేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. యువ భారతంలో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ధేందుకు దోహదం చేసేలా అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించడం. తద్వారా నైపుణ్యాలకు కొదువ లేక నిధుల లేమితో సతమతమయ్యే ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడం. నల్లధనంపై పోరాటం లో భాగంగా డీమోనిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల ఉపసంహరణ ముస్లిం మహిళలకు షాదీ షాగున్ యోజనతో పాటు సౌభాగ్య, ప్రధాన మంత్రి ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధాన మంత్రి యువ యోజన, సంకల్ప్ సే సిద్ది, ఉడాన్, ఈశ్రమ పోర్టల్ ఆవిష్కరణ వంటి పథకాలు. ఆరోగ్య రంగంలో పేదలకు ఉపకరించేలా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యా విధానాన్ని 2026 నాటికి దేశమంతటా అందుబాటులోకి తెచ్చేలా చేయడం. గత దశాబ్ద కాలంలో వివిధ ఎక్సప్రెస్ వే ల నిర్మాణం, రవాణా సదుపాయాలకు దూరంగా ఉండే గ్రామాలకు సైతం రైల్వే సదుపాయాలను కల్పించడం, వందే భారత్ రైళ్లు, చిన్నపట్టణాలు, నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం. విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలకు కరెంట్ సదుపాయాలూ అందించడం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ఖాతాల్లో నేరుగా సొమ్ములను బదిలీ చేసే జన్ ధన్ యోజన పథకం. చిన్న వర్తకులు, వ్యాపారస్థులకు ప్రయోజనం చేకూరేలా డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుడుతూ యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం. సమస్యలూ ఉన్నాయి.. అవినీతి నల్లధనం: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం వేళ్ళూనుకుపోయాయి. ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కానే కాదు. అవినీతి, కుంభకోణాలకు ఆమడదూరం ఉంటామని చెప్పే పార్టీ లో వాటితో నేరుగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న కొందరు రాజకీయ వేత్తలు ఉండటం ఓ పెద్ద మచ్చ. నల్ల ధనం నిరోధం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉంది. బ్లాక్ మనీ నిరోధం దిశగా పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వేసిన అడుగులు నామమాత్రమే. ధరలు రైతులు: ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందంటూ రిజర్వు బ్యాంకు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్యుడి నడ్డి విరుగుతూనే ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనలోనూ చర్యలు నామమాత్రమే. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో లబోదిబో మంటూ నిరసనలకు దిగుతున్నా వారి సమస్యల పరిష్కారం దిశగా సరైన అడుగులు పడటం లేదు. ►డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారం కాని విషయాలు చాలానే ఉన్నాయి. చెల్లింపులు చేసినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. ►వందే భారత్ రైళ్లు ఓ గొప్ప విజయమని చెప్పుకునే దేశంలో.. ఇప్పటికీ గబ్బుకొట్టే రైళ్లు, అక్కరకు రాని స్టేషన్లు, సరైన పహారా వ్యవస్థ లేని రైల్వే క్రాసింగ్ లు వంటి సమస్యలతో రైల్వే రంగం కొట్టుమిట్టాడుతోంది. ►జనాభా విస్తరణతో నగరాలుగా మారుతున్న పట్టణాలు, పట్టణాలుగా రూపు సంతరించుకుంటున్న మండల స్థాయి గ్రామాల్లో మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ నగరాల నిర్మాణం ఎప్పటికి, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాలకులు మారొచ్చు గాక.. ప్రభుత్వాలు కొత్త రూపు సంతరించుకోవచ్చు గాక.. కాలానుగుణ మార్పుల్లో భాగంగా కొత్త విధానాలతో ప్రజలకు ఉపయుక్తమయ్యే రీతిలో కార్యాచరణ ఉన్నప్పడే అసలైన అడుగు పడినట్లు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో మూడో స్థానం దిశగా భారతావని అడుగులు వేస్తోందని మోదీ సర్కారు చెబుతోంది. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేననే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. కొలువు దీరబోయే కొత్త ప్రభుత్వం అఖండ భారతంలో వెలుగులు విరబూయించాలంటే ప్రజల తలరాతలు మార్చగలగాలి. లేకుంటే అంకెలన్నీ హంగూ ఆర్భాటాలతో కాగితాలపై కనిపించే మెరుపు తీగలు గానే మిగిలిపోతాయి. అలా జరగదనే భావిద్దాం. ఈసారి బృహత్తర లక్ష్యాలతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగాలని, స్వర్ణ భారతం ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. ✍️బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు -
ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా?
కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా? ఇతర రాష్ట్రాల్లో సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా? తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోని తన పార్టీ, మిత్ర పక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్‌లు నిర్వహించారు. తర్వాత ఏ రాష్ట్రం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ఏఐసీసీ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి. తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ.కాంగ్రెస్‌కు బాధ్యత పెరిగింది. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాలలో ఎన్నికల్లో జరిగితే ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే కీలక విషయాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్‌ను విశ్వాసంలోకి తీసుకుంటోందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూడా టీపీసీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ వాడుతున్న అత్యాధునిక వోల్వో బస్సును కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు సమకూర్చారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను కాపాడటంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ముందుంటోంది. ఇటీవల జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వానికి ఆపద వస్తే..అక్కడి ఎమ్మెల్యేలను కాపాడటంలో టీపీసీసీ అత్యంత చాకచక్యంగా వ్యహరించింది. జార్ఖండ్ నుంచి వచ్చిన 39 మంది ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు శామిర్ పేటలోని ఓ రిసార్ట్‌లో వసతి కల్పించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటును అందించింది. ఇప్పుడు బీహార్ టాస్క్‌ను సైతం టీపీసీసీకే ఏఐసీసీ అప్పగించింది. బీహార్‌లో ఇండియా కూటమి నుంచి జేడీయూనేత నితీష్‌కుమార్ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈనెల 12న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్‌ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నం లోని ఓ రిసార్ట్‌లో వసతి కల్పించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో లో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. అందువల్ల ఎదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలలో కర్ణాటకలో బీజేపీ చాలా బలమైన పార్టీ.. కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ బెటర్ అని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ క్రైసిస్ లో ఉన్నా దాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేస్తుంది ఏఐసీసీ. దీనికి తోడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడంతో హైదరాబాద్ ను క్యాంపు కేంద్రంగా ఏఐసీసీ భావిస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్మును ఏఐసీసీకి దోచి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిస్తున్నాయి. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగిందనేది నిజం. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడమే అందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. -
విజయకాంత్‌ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్ విజయకాంత్ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. ‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్‌ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. PM Modi’s heartfelt condolences to the family and admirers of his dear friend Captain Vijaykanth ❤️#VanakkamModi #Vijayakanth pic.twitter.com/31N8MPYCLx — இந்தா வாயின்கோ - Take That (@indhavaainko) January 2, 2024 తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్‌ను ప్రారంభించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్(71). ‘కెప్టెన్’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన ముద్ర వేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 -
బీజేపీ మాస్టర్ ప్లాన్.. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికలో వ్యూహం ఇదే!
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, వాటి ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో కుల సమీకరణాలకు పెద్దపీట వేసిన తీరు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తెర తీసింది. ఈ విషయంలో బీజేపీ ఆచితూచి, అన్ని అంశాలనూ లోతుగా వడపోసి మరీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం ఏకంగా వారం రోజులకు పైగా మేధోమథనం చేయడం విశేషం! దాని ఫలితాలు సీఎంల ఎంపికలో కొట్టొచి్చనట్టుగానే కనిపించాయి. గిరిజన ప్రాబల్య ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన నేతను, ఓబీసీలు గణనీయంగా ఉన్న మధ్యప్రదేశ్‌లో అదే సామాజిక వర్గ నాయకున్ని ఎంపిక చేసి చతురత ప్రదర్శించింది. రాజస్తాన్‌లో బ్రాహ్మణ నేతకు అవకాశమిచ్చింది. సీఎంల ఎంపిక కసరత్తు పూర్తిగా రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్టుగా స్పష్టమవుతోంది. అగ్రవర్ణ పారీ్టగా తనకున్న ముద్రను చెరిపేసుకునే క్రమంలో రాష్ట్రపతిగా ఎస్సీని, అనంతరం ఎస్టీని ఎంపిక చేసిన కమలం పార్టీ, సీఎంల ఎంపికలోనూ అదే పోకడ కనబరిచింది. ఆ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో దిగ్గజాల వంటి నేతలను కూడా ఎలాంటి శషభిషలూ లేకుండా పక్కన పెట్టడం విశేషం!. మధ్యప్రదేశ్‌లో సీఎంగా పార్టీని విజయ తీరాలకు చేర్చిన శివరాజ్‌సింగ్ చౌహాన్ అంతటి సీనియర్ మోస్ట్ నాయకునికి మరో చాన్సివ్వలేదు. రాజస్తాన్, ఛత్తీస్ల్లో పలుమార్లు సీఎంలుగా చేసిన వసుంధరా రాజె సింధియా, రమణ్‌సింగ్ పేర్లనైతే పరిశీలించనే లేదని తేటతెల్లమైంది. అగ్రవర్ణ ముద్రను వదిలించుకుని అందరి పార్టీగా మారే దిశగా కొన్నేళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎంల ఎంపిక మరోసారి అద్దం పట్టిందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్త కులగణనను ప్రధానాంశంగా చేసుకునేందుకు కాంగ్రెస్, జేడీ(యూ) వంటి విపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి గట్టిగా చెక్ పెట్టే దిశగా కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజా నిర్ణయాల్లో ప్రతిఫలించాయి. మధ్యప్రదేశ్‌లో ‘బీసీ’ రూటు.. మధ్యప్రదేశ్‌లో సీఎంగా పూర్తి ఆరెస్సెస్ నేపథ్యమున్న ఓబీసీ నేత మోహన్ యాదవ్ ఎంపిక కూడా బీజేపీ ప్రాథమ్యాలకే అద్దం పట్టింది. ఇది సరిహద్దు రాష్ట్రమైన యూపీతో పాటు బిహార్‌లోనూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. అక్కడి ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ, ఆర్జేడీల సారథ్యం యాదవ్‌ల చేతుల్లోనే ఉండటం తెలిసిందే. పైగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో మరోసారి క్లీన్‌స్వీప్ చేయడం, 40 సీట్లు బిహార్‌లోనూ భారీగా సీట్లు నెగ్గడం బీజేపీకి చాలా కీలకం. ఈ నేపథ్యంలో అక్కడ సంఖ్యాధికులైన యాదవులను ఆకట్టుకునేందుకు కూడా ఓబీసీ సీఎం ఎంపిక ఉపయోగపడుతుందన్నది బీజేపీ అంచనా. ఎందుకంటే ఏకంగా 120 లోక్‌సభ స్థానాలున్న యూపీ, బిహార్లలో ఓబీసీల ఓట్లు అతి కీలకం. వారిలోనూ యాదవులు యూపీలో దాదాపుగా 10 శాతం, బిహార్‌లో ఏకంగా 14 శాతమున్నారు. ఇక దళితుడైన జగదీశ్ దేవ్డా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర శుక్లాలను ఉప ముఖ్యమంత్రులను చేయడం యూపీలోనూ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఉత్తరాది అంతటా రాజకీయంగా గట్టి ప్రభావం చూపే రాజ్‌పుత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని నరేంద్రసింగ్ తోమర్‌ను స్పీకర్‌గా ఎంచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ‘గిరిజన’ జపం.. గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారి ప్రాబల్యం సహజంగానే ఎక్కువ. ఇక్కడ గిరిజన జనాభా ఏకంగా 32 శాతం! దాంతో గిరిజన ఎమ్మెల్యే విష్ణుదేవ్ సాయ్‌ని ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంచుకుంది. ఓబీసీ నేతకు చాన్సివ్వాలన్న ప్రతిపాదన కూడా ఒక దశలో తెరపైకి వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాబల్య ప్రాంతాలైన సర్గుజా, బస్తర్ఱ గుండుగుత్తగా బీజేపీకే జైకొట్టిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గంవైపే మొగ్గినట్టు సమాచారం. ఆ ప్రాంతాల్లోని 26 ఎస్టీ ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ ఏకంగా 22 సీట్లు నెగ్గింది. ఈ నేపథ్యంలో సాయ్ ఎంపిక దేశవ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కలిసొస్తుందని భావిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 22 శాతం, జార్ఖండ్‌లో 26 శాతం గిరిజన జనాభా ఉండటం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వరాష్ట్రమైన ఒడిశాలోనూ 23 శాతం గిరిజనులున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 20 ఎస్టీ లోక్‌సభ స్థానాలున్నాయి. మరో 10 స్థానాల్లోనూ గిరిజన ఓట్లు కీలకంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సాయ్ ఎంపిక జరిగినట్టు కనిపిస్తోంది. రాజస్తాన్‌లో కుల సమతౌల్యం.. రాజస్తాన్‌లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మకు సీఎంగా జాక్‌పాట్ దక్కడం కూడా బీజేపీ కుల సమీకరణల వ్యూహంలో భాగమేనంటున్నారు. నిజానికి రాజస్తాన్‌లో 7 శాతం దాకా ఉన్న బ్రాహ్మణ జనాభా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయదు. కానీ శర్మ ఎంపిక వెనక ఆంతర్యం రాజస్తాన్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హరియాణాల్లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ వర్గాలను ఆకట్టుకోవడంగా కనిపిస్తోంది. బ్రాహ్మణులు హరియాణాలో 12 శాతం, యూపీలో 10 శాతానికి పైగా ఉంటారు. అదే సమయంలో మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుంటూ రాచ కుటుంబీకురాలైన దియాకుమారి, దళిత నేత ప్రేమ్‌చంద్ బైర్వాలను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. రాష్ట్రంలో శర్మ, మధ్యప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా శుక్లా ఎంపిక ఉత్తరాది అంతటా బీజేపీకి పెట్టన కోటగా నిలుస్తూ వస్తున్న అగ్ర వర్ణ ఓటర్లను మరింత ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా కన్పిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్. -
ఢిల్లీ లీడర్స్ రాకతో.. కేడర్‌లో జోష్
కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. 12 సీట్ల నుంచి ఒక్క సీటుకు.. ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది. కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి 1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది. 1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు. బండి సంజయ్ మార్పుతో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్‌లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. మోదీ సభలతో నయా జోష్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ విజయం ఇలా.. 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది. -
ఎన్సీపీలో కీలక పరిణామం.. రాజీనామా వెనక్కి తీసుకున్న శరద్ పవార్..
ముంబై: ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అధ్యక్ష పదివికి రాజీనామా చేసిన శరద్‌పవార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని తెలిపారు. అందుకే వాళ్ల ఇష్టం మేరకు రాజీనామా ఉససంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడైనా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతో ఉంటున్నారని చెప్పారు. వాళ్ల సెంటిమెంట్‌ను కాదనలేనన్నారు. మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ రాజీనామా విషయాన్ని ప్రకటించారు శరద్‌పవార్. ఆ వెంటనే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాగా.. మంగళవారం రాజీనామా అనంతరం పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్యం చేశాయి. చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్‌ను బాలాసాహెబ్‌తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్‌కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్.. అనిల్ ఆంటల్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్‌ను వీడటం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రియాక్షన్.. మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?
2022లో కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం పతనమైంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు మూడు మినహా చెప్పుకోదగ్గ రాష్ట్రాల్లో అధికారం లేదు. మూడేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని..మరో రాష్ట్రంలో అధికారం సాధించుకుంది. ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మరింత కుదేలైన హస్తం శ్రేణుల్లో.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాస్త జోష్ నింపింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని.. 2022లోనూ వైఫల్యాలు వెంటాడాయి. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో అయితే ఏడవసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీహార్‌లో బీజేపీ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ కమలానికి టాటా చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో చేరారు. ఆ విధంగా మహారాష్ట్ర చేజారితే.. బీహార్ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పోయే.. ఖర్గే వచ్చే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి అధ్యక్షుడే లేకుండా మూడున్నరేళ్ళ పాటు సాగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోయినా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రక్రియ కొనసాగుతున్న దశలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరోసారి గాంధీయేతర కుటుంబం నుంచి ఓ నేత అధ్యక్షుడయ్యారు. కర్నాటకకు చెందిన 80 ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త నాయకుడు వచ్చినా.. పార్టీ పరిస్థితుల్లో మార్పులేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి అధికారం పోగొట్టుకున్న తెలంగాణ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలే. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, యువనేత పైలట్ వర్గాలు బహిరంగంగా మాటల తూటాలు విసురుకుంటున్నా ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ అల్లాడుతోంది. పార్టీని వెంటాడుతున్న పాపాలు ఓవైపు కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు నేషనల్ హెరాల్ట్ కేసు గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. సోనియాను మూడుసార్లు, రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో.. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉన్న లింకులపై ఆరా తీశారు. గాంధీలు విచారణకు హాజరైన అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, హర్తాళ్లు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో రోడ్డెక్కిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జోడో.. తెచ్చే మార్పు ఎంత? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టున్న కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు..సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. తొమ్మిది రాష్ట్రాలు దాటుకుని..ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసమే భారత్ జోడో అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, కాంగ్రెస్‌ను తిరిగి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ వాటి గురించి సీరియస్‌గా తీసుకోకుండా తన జోడో యాత్ర కొనసాగించడంపై విమర్శలు వినిపించాయి. ముందుంది ముసళ్ల పండగ వరుజ పరాజయాలు..అంతర్గత కుమ్ములాటలతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర కాస్త ఉత్సాహం నింపింది. జనంలో ఉండేందుకు..ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం దక్కింది. అయితే రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లబ్ధి మాత్రం ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2023లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ పాటు ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏమేరకు ఉందో..త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి. కొండ లాంటి బీజేపీ, బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ నుంచి పంజాబ్‌ను చేజిక్కించుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చేశారు. ముందు ముందు ఆప్ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కంగారు పెడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2022 లో భారత రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా చాణక్యంతో బిజెపి అప్రతిహత విజయాలను నమోదు చేస్తోంది. బిజెపి బండిని జోడెద్దుల లాగా ఈ ఇద్దరు నేతలే తమ భుజస్కందాలపై పెట్టుకుని లాగుతున్నారు. దేశంలోని అన్ని పార్టీలకు కంటే అందనంత పై స్థాయిలో బిజెపిని నిలబెట్టగలిగారు. ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తొలుత ప్రధమార్ధంలో మార్చి నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా నాలుగు రాష్ట్రాలలో బిజెపి జెండా ఎగరేసింది. ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలలో వరుసగా రెండోసారి బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా ఢిల్లీ అవతల తన సత్తా చాటింది. ఇక ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రాన్ని బిజెపి తిరిగి నిలబెట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు గెలిచి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని సృష్టించారు. వరుసగా ఏడోసారి బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేరుతో ఉన్న చరిత్రను సమం చేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరేసి పరువు కాపాడుకుంది. అయితే కేవలం 0.9% తేడాతోనే అది బిజెపిపై విజయం సాధించగలిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి చవి చూడడం ఆ పార్టీకి షాక్ కలిగించింది. అయితే దీనికి జేపీ నడ్డా గ్రూపు రాజకీయాలే కారణమని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రోజున జేపీ నడ్డాను ఇంటికి సాగనంపడం ఖాయమని వార్తలు గుప్పుమంటున్నాయి. సునాయసంగా.. ఇక ఈ ఏడాదిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను బిజెపి సజావుగా సునాయాసంగా తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి ప్రతిపక్షాలను చల్లా చెదురు చేయడంలో విజయం సాధించగలిగారు. తొలుత ప్రతిపక్ష క్యాంపులో చేరిన జెడిఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు సైతం తిరిగి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మోదీ కల్పించారు. విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో మోడీ సఫలీకృతులయ్యారు. 60 శాతానికి పైగా ఓటింగ్ సాధించి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి జగదీప్ దంకర్ సునాయాసంగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే దాని వెనుక నరేంద్ర మోడీ రాజకీయ ఎత్తుగడ కనిపించింది. ఏడాదిన్నర పాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని ముట్టడించిన రైతుల అత్యధికమంది జాట్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో రైతులను సంతృప్తి పరచేందుకు ఆ వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందే పశ్చిమబెంగాల్లో జగదీప్ దంకర్ తనదైన స్టైల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతూ నరేంద్ర మోడీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ జగదీష్ ధన్కర్కు కలిసి వచ్చాయి. 16 రాష్ట్రాల్లో అధికారం.. 2022 సంవత్సరం ప్రారంభంలో బిజెపి చేతిలో 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఏడాది ముగిసే సరికి బిజెపి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీహార్ లో బిజెపికి నితీష్ కుమార్ రామ్ రామ్ చెప్పడంతో రాష్ట్రం బిజెపి చేయి జారింది. అయితే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సహకారంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి , బిజెపి తిరిగి ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోగలిగింది. ఒక రాష్ట్రం చేజారినా మరో రాష్ట్రాన్ని దక్కించుకొని తన 17వ రాష్ట్రాన్ని బిజెపి కాపాడుకోగలిగింది. అయితే ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ప్రస్తుతం బిజెపి ఈ ఏడాది ఒక రాష్ట్రాన్ని కోల్పోయి 16 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో బిజెపికి 96 సీట్లు ఉండగా మే నెలలో అది 100 సీట్ల మార్కు దాటింది. కానీ ఆ తర్వాత జూన్‌లో జరిగిన రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో అపార్టీ సంఖ్య 92 కు పడిపోయింది. లోక్‌సభలో బిజెపికి ఉప ఎన్నికల్లో ఒక సీట్ పెరిగింది. మోదీ మాటే వేదం.. బిజెపిలో నరేంద్ర మోదీ మాటే వేదవాక్కుగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోడీ అవతరించడంతో మిగిలిన నాయకులందరూ ఆయన మాట శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తున్నారు. మోడీ కున్న ప్రజాదరణను ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు అమిత్ షా అత్యంత పదునైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. సుశిక్షితులైన బిజెపి కార్యకర్తల యంత్రాంగం , ఆర్ఎస్ఎస్ అండతో ఆ పార్టీ పక్కడ్బందీగా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది . వరుసగా 8 ఏళ్ల నుంచి అధికారంలో బిజెపి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తుంది. దీనికి తోడు కార్పొరేట్ వ్యూహకర్తలు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి పార్టీకి చేరవేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ మిగిలిన పార్టీలకంటే ఒక అడుగు ముందంజలో ఉంటున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడంలోనూ బిజెపి అదే దూకుడును ప్రదర్శిస్తుంది. రకరకాల ఎత్తుగడలతో విపక్షాలను చెల్లాచెదురుచేసి తన ఆధిపత్యాన్ని సృష్టినం చేసుకుంటుంది. కాంగ్రెసే ప్రత్యామ్నాయం.. మొత్తానికి ఏడాది బిజెపి తన ఆధిపత్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి 90% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకుపోతోంది. ఏడాది మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగా ఐదు రాష్ట్రాలను బిజెపి తన ఖాతాలో వేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను, కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్రమైన పోరాటం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ బిజెపిని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికల సన్నాహక సంవత్సరం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్గడ్ లాంటి ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలోనూ బిజెపి కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడుతున్నాయి. అయితే అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలకు మధ్య ఎజెండా వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే లోక్‌సభ ఎన్నికలకు నైతిక బలం, జోష్ ఆయా పార్టీలకు లభిస్తుంది. మరి 2023 ఏ పార్టీ దశను ఎలా తిప్పుతుందనేది ప్రజలే డిసైడ్ చేయాలి. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్.. మాస్టర్ ప్లాన్‌తో కేసీఆర్
సాక్షి ప్రత్యేకం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ ఆవిర్భావం అయితే జరిగింది. మరి మిగతా రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఎప్పుడు?. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం మొదలయ్యేది ఎప్పుడు? ఆ ప్రశ్నలకు ఓ సమాధానం ఇప్పుడు దొరికింది. డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ను అధికారికంగా ప్రకటించి వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. వీలయినంత త్వరలో ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఢిల్లీలో జాతీయ కార్యాలయ ప్రారంభం.. దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి : కేసీఆర్ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతున్నదనే నేపథ్యంలో.. ఆ లోపే బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించి, ఢిల్లీలో వేదికను సిద్దం చేయాలనే తలంపుతో వున్న అతికొద్ది సమయంలోనే ఢిల్లీ టూర్ ను అధినేత కెసిఆర్ చేపట్టారు. అటు ఉత్తరాదినుంచి ఇటు దక్షిణాది నుంచి అఖిలేష్ యాదవ్., కుమార స్వామి వంటి మాజీ సిఎం లు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశ రాజకీయ విమర్శకులు మేథావులు ఆశ్చర్యపోయేలా అత్యద్భుతంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని డిసెంబర్ 14 న అధినేత కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలనుంచి ఢిల్లీ కి చేరుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, రచయితలు, మేథావులు, ప్రముఖులు వందలాదిగా బిఆర్ఎస్ అధినేతకు స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకుని పనిచేయడానికి తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలనుంచి ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు పలు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రంగాలకు చెందిన వృత్తులకు చెందిన మేధావులు, యువతీ యువకులు బిఆర్ఎస్ లో చేరి అధినేత కేసీఆర్ వెంట కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న వర్తమాన పరిస్తితి దేశవ్యాప్తంగా నెలకొన్నది. పలు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్కేఎస్) ప్రారంభం : ‘‘ఎద్దు ఏడ్సిన యవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం ముందట పడదు’’ అనే నానుడి వ్యవసాయాధారిత దేశంలోని ప్రజల నాలుకల మీద వుంటుంది. అటువంటి అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనను అధినేత కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. ఈ తాత్వికతతోనే తెలంగాణ సాధన అనంతరం తక్షణమే వ్యవసాయం సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారు. అనతికాలంలోనే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడంలో సిఎం కెసిఆర్ దార్శనికత అకుంఠిత ధీక్ష ప్రధాన కారణం. నేడు రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులను ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం సాగునీటి రంగాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పటిష్ట పరిచి అన్నం పెట్టే దేశ రైతన్నను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక ధ్యేయంతో మహోన్నత ధ్యేయంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ స్పూర్తితో ముందడుగు వేసిండు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ ఈ నేపథ్యంలో ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్‌లో ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారు. చర్చల అనంతరం ఏర్పాట్లు చేసుకోవడానికి తిరిగి వారి వారి రాష్ట్రాలకు వెలుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్క్రతిక పరిస్తితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాల్నో వారికి సుధీర్ఘంగా అధినేత కేసీఆర్ వివరించి వారిని ఆ దిశగా సమాయత్తం చేసి పంపుతున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి : ఈ నేపథ్యంలో ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ దేశంలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? వాటిని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతున్నది..ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ తన పాత్రను భవిష్యత్తులో ఎట్లా పోశించబోతున్నది ? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవబోతున్నది ? అనే తాత్విక సైద్దాంతిక అంశాలను పలు భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా భావజాల ప్రచారం జరగనున్నది. ఆయా రంగాల వారిగా సాహిత్య సాంస్కృతిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా భావజాల వ్యాప్తి చేయడానికి అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు నెలలనుంచి సాహితీ వేత్తలతో లోతైన విశ్లేషణలు చర్చలు చేపట్టారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది. ఊపందుకోనున్న బీఆర్ఎస్ కార్యాచరణ క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఉదృతి పెరగనున్నది. ఈ మేరకు ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ., దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నది. డిసెంబర్ నెలాఖరున ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ మీడియా లో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. దేశంలో గుణాత్మక రాజకీయాలు వాటితో పాటు కేంద్రంలో గుణాత్మక పాలన రావాలంటే ఏ దిశగా అడుగులు వేయాలో, ఈ దేశ ప్రజల కర్తవ్యం ఏమిటో ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. ‘‘గెలవాల్సింది రాజకీయ నాయకులు పార్టీలు కాదు.. ప్రజలు.. ప్రజా ప్రతినిధులు’’ అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ దేశానికి ప్రత్యామ్న్యాయం అంటే.. కొన్ని పార్టీలతో జతకట్టే రాజకీయ ఫ్రంటులు కాదనీ.. దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోయే రాజనీతిజ్జత కావాలని సిఎం కేసీఆర్ ప్రకటించిన నేఫథ్యంలో బిఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ పై జాతీయ మీడియాలో ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏమిటి ? రాజకీయ సైద్దాంతికత ఏమిటి .? అభివృద్ధి నమూనా ఏమిటి అనే విషయంలో ఇప్పటికే జాతీయ మేధావి వర్గం చర్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘అంధకారబంధురంగా మారిన వర్తమాన రాజకీయ పాలన యవనికమీద వెలుగు దివ్వెను వెలిగిస్తాం..’’..అనే అధినేత సిఎం కెసిఆర్ ప్రకటన దేశవ్యాప్తంగా అటుమీడియా ఇటు రాజకీయ విమర్శకుల లాబీల్లో చర్చనీయాంశంగా మారిన సందర్బంలో...ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారు. -
ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు
ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ ద్వారా జాతీయ నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్‌కు.. అభిమాన గణం ఎక్కువే. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఈ రాజకీయ దిగ్గజం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని యోధుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయంకు ఒక్కగానొక్క కోరిక మాత్రం తీరలేదు. యూపీ రాజకీయాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో చక్రం తిప్పిన ములాయం.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఆ రాజకీయాల్లో ప్రముఖంగా రాణించడం మాత్రం ఎందుకనో ఆయన వల్ల కాలేకపోయింది. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా, రక్షణ మంత్రిగా పేరు దక్కినప్పటికీ.. అంతకు మించి ముందుకు వెళ్లడం ఆయన వల్ల కాలేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు దక్కినప్పటికీ.. అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పార్టీల హవా ముందు ఆయన పాచికలు పారలేకపోయాయి. అంతెందుకు.. మూడో దఫా ముఖ్యమంత్రి అయిన టైంలోనూ.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి మెయిన్‌పురి నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో అధికారం కొనసాగించింది. దీంతో ములాయం, సమాజ్‌వాదీ పార్టీకి కేంద్రంలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు మళ్లి.. యూపీ సీఎంగానే కొనసాగారాయన. 2007 ఎన్నికల్లో బీఎస్పీ చేతిలో ఓటమి పాలయ్యేదాకా ఆయన సీఎంగా కొనసాగారు. ఆపై తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నప్పటికీ.. ఎస్పీ వర్గపోరు, ఆపై అనారోగ్యం తదితర కారణాలతో ఆయన జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ తన తరం రాజకీయ నాయకులలో తన విలువలను చెక్కుచెదరకుండా, తన రాజకీయాలను కార్పొరేట్ పరం కాకుండా కాపాడుకుంటూ వచ్చిన నేతనే చెప్పొచ్చు. -
ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ► ములాయం సింగ్ యాదవ్.. 1939 నవంబర్ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్ సింగ్‌లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం. ► ములాయం సోదరి కమలా దేవి, శివపాల్ సింగ్ యాదవ్, రతన్‌సింగ్ యాదవ్, అభయ్ రామ్ యాదవ్, రాజ్‌పాల్ సింగ్ యాదవ్ సోదరులు. దగ్గరి బంధువు రామ్ గోపాల్‌యాదవ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ► ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్ మూమెంట్లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్‌పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెపారు ములాయం. ► సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్‌కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్ అయిపోయాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్‌పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్ నగర్ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్ అని పిలుస్తుంటారు. రెండు వివాహాలు.. ములాయం సింగ్ యాదవ్‌కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్ యాదవ్ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రాజకీయాలు ఇలా.. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్ మిశ్రా, రామ్ సేవక్ యాదవ్, కర్పూరీ థాకూర్.. ఇలా ఎందరినో కలిశారు. ► 1960లో జనతా దళ్‌లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్‌లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ► 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్‌కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు. ► 1982లో యూపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్ చీలిపోయాక.. చంద్ర శేఖర్, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారాయన. ► 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్ జనతా దల్(సోషలిస్ట్)లో చేరారు ములాయం. కాంగ్రెస్, జనతా దల్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. ► 1991 ఏప్రిల్‌లో.. కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. ► ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ► ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ► అయితే.. 1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్, కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003, సెప్టెంబర్‌లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్‌మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అందుకే సైకిల్ సింబల్! పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్‌తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. ► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా వ్యవహరించారు. ► ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు. వివాదాలు.. ► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. ► 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. ► టిబెట్ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్‌కు అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్‌నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌లు, అమర్ సింగ్‌లు నేతృత్వం వహించారు. ► తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్ 30న ఏకంగా కొడుకు అఖిలేష్, బంధువు రామ్ గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. ► దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్‌గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే.. ఎన్నికల సంఘం కూడా అఖిలేష్ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మీద 2021లో డైరెక్టర్ సువేందు రాజ్ ఘోష్ ‘మెయిన్ ములాయం సింగ్ యాదవ్’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో విజయ్ గుట్టే డైరెక్ట్ చేసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సుభాష్ త్యాగి, ములాయం సింగ్ యాదవ్ పాత్రలో కనిపించారు. -
డిసెంబర్ కల్లా నేషనల్ హైవేపై కేసీఆర్ జాతీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రకటన ముహూర్తాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తిగా కొలిక్కి రాకపోవడం, జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ముందు భావించినట్టు దసరాకు కాకుండా కొంత వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జెండా, ఎజెండాపై లోతుగా చర్చ ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మంతనాలు కొనసాగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు. విపక్షాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి పరిగణనలోకి తీసుకుని లెక్కలు మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హరియాణాలో ఈ నెల 25న జరిగిన సమ్మాన్ దివస్‌కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. కాగా నితీష్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్ సమ్మాన్ దివస్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. బిహార్‌లో బీజేపీతో నితీష్ తెగతెంపులు, సోనియాతో భేటీ, మహారాష్ట్ర శివసేనలో చీలిక వంటి పరిణామాలను పార్టీ అధినేత నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో సయోధ్యతో పనిచేస్తూనే కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కేసీఆర్ విభిన్న కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపైనే ఆసక్తి చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లోగానే ముహూర్తం..! కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న పార్టీలు, నేతలతో వేదిక పంచుకుంటే ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే హరియాణా భేటీకి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోతే ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది డిసెంబర్‌లోగా పార్టీ ముహూర్తాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వారితో జాతీయ అంశాలపై భేటీలు, మంతనాలు కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు పార్టీలో చేరేలా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరు బలమైన నేతలు కొత్త పార్టీలో చేరేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ను ఆహ్వానించడంతో పాటు తాము కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, చిన్నా చితకా పార్టీల విలీనం, వారి నుంచే వచ్చే డిమాండ్లను తట్టుకోవడం తదితరాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దసరా నాటికి కొత్త జాతీయ పార్టీకి తుది రూపునివ్వడం కష్టమనే అభిప్రాయంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూ ర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత ప్రస్తుత దేశ రాజకీయాల్లో తక్షణ అవసరం. కాంగ్రెస్ నాయ కత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీకి ఆ పార్టీ ఎంతమాత్రం ప్రత్యా మ్నాయం కాదనే విషయం తేటతెల్లమైంది. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ రోజురోజు కూ నాపై ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీ మతతత్వ విధా నాలు, మోదీ ప్రజా వ్యతిరేక.. నిరంకుశ వైఖరిపై పోరాడాల్సిందిగా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు కోరు తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి బీజేపీని ఇంటికి పంపాల్సిందిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ కార్యవర్గాలు తీర్మానం చేస్తున్నాయి..’ అని సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి వివరించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో వీరిద్దరూ భేటీ అ య్యారు. ఈ సందర్భంగా ఇటీవల రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను కూడా కేసీఆర్ తెలియజేశారు. మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు తెలిపారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు.. ‘వ్యవసాయంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాలను అధోగతి పాలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పలువురు రైతు సంఘాల నేతలు ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సాగు సంక్షేమ పథకాలను పరిశీలించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ తరహాలోనే రైతు రాజ్యం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయొచ్చు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం ఉంది. వర్తమాన రాజకీయాలు, పాలనలో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేప థ్యంలో కేసీఆర్ వంటి నాయకుడు అత్యవసరం. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. గుణాత్మక మార్పు కోసం స్థాపించే ఆ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాం. తెలంగాణలో రైతుల శ్రేయస్సు లక్ష్యంగా అమలవుతున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పాలన, పథకాలపై కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతు న్నాయి. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ స్థాపించే రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కుమారస్వామి ప్రకటించారు. విభజన కుట్రలను సమష్టిగా తిప్పికొడతాం దేశంలో విచ్ఛిన్నకర పాలనతో ప్రజల నడుమ విభ జన సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలు తిప్పి కొట్టడం సహా పలు అంశాలపై కేసీఆర్, కుమార స్వామి చర్చించారు. దేశం విచ్ఛిన్నం అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవాలని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సమష్టి కృషి చేయాలని నిర్ణయించారు. భేటీలో ప్రస్తావనకు వచ్చిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ దేశ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే దేశంలో రాజకీయ, పాలన సంక్షోభం తప్పదు. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలుచుకోవాలి. ♦ దేశ రాజకీయాల్లో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాల పట్ల దేశ ప్రజలు విసుగెత్తి పోయారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ పంథాపై ఏకాభిప్రాయం అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను నేతలు పరిశీలించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సాదర స్వాగతం, వీడ్కోలు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు చేరుకున్న కుమార స్వామికి సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూ దనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్‌రెడ్డిని కేసీఆర్ పరిచ యం చేశారు. ప్రగతిభవన్‌లో కుమార స్వామితో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భోజనం చేశారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామికి కేసీఆర్ మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ‘ప్రకాశవంతమైన దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వం, వ్యక్తిత్వం కలిగిన కేటీఆర్‌తో జరిగిన చర్చ అర్థవంతంగా సాగింది. కేటీఆర్ అభిమానం, గౌరవంతో నా హృదయం నిండిపోయింది’ అని కుమారస్వామి ట్వీట్ చేశారు. -
దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేత చరిత్ర సృష్టించారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్ పాలిటిక్స్‌పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. దేశానికి తెలంగాణ మోడల్ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు. -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ -
సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...
నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్‌గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!) కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
నల్లగొండ టూటౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని, దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత వైషమ్యాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. దేశ అభ్యున్నతి కోసం ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యంగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల చూపు సీఎం కేసీఆర్ వైపు ఉందని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అని, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.