కేంద్ర రాజకీయాలపై రోజుకో ప్రకటన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. వివిధ రంగాల ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట విడత రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు వుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.