తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలో సరికొత్త పరిపాలనా ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా... యాదాద్రి జిల్లాను నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. మిగిలిన 19 జిల్లాలను శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, మంత్రులు ప్రారంభించారు. దీంతో 31 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లతోపాటు జిల్లా ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.