కాంగ్రెస్ పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తాము తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదని, ప్రతి దానికి అడ్డు చెబుతున్నారని మండిపడ్డారు. ఆదివారం వరంగల్ లో భద్రకాళీ అమ్మవారికి స్వర్ణకిరీటాన్ని బహూకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ అన్నారు. ఏడాది కిందటే సీఎస్తో ప్రత్యేక కమిటీని వేశామని చెప్పారు.కాంగ్రెస్ నేతలు జిల్లాల విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. జిల్లాల నిర్ణయం అనూహ్యంగా తీసుకుంది కాదని, కమిటీని వేయడం ప్రజాభిప్రాయం తీసుకోవడంలాంటి ఘట్టాలు దాటాకే తుది నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసలు ఏకాభిప్రాయం లేదని, ఒకరు ఒక జిల్లా అంటే మరొకరు మరో జిల్లా అన్నారని, వారిద్దరికి కావాల్సిన జిల్లాలు ఏర్పాటుచేస్తే గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సన్నాసులకు నచ్చడం లేదని, కాంగ్రెస్ నాయకులకు అహంకారం అని మండిపడ్డారు.
Published Sun, Oct 9 2016 2:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement