లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి | Sakshi
Sakshi News home page

Lok Sabha Election Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌

Published Tue, Jun 4 2024 6:33 AM

Lok Sabha Election Results 2024 Live Updates

Live Updates...

  • వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఘన విజయం.. 1.52  లక్షల మెజారిటీ సాధించిన మోదీ
  • ఇండోర్‌ బీజేపీ అభ్యర్థికి రికార్డ్‌ మెజార్టీ.. 10.08 లక్షల ఓట్లతో శంకర్‌ లాల్వానీ అఖండ విజయం
  • మధ్య ప్రదేశ్‌ విదిశలో మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గెలుపు
  • రెండు చోట్లా రాహుల్‌ గాంధీ గెలుపు. వయనాడ్‌, రాయబరేలీ స్థానాలలో ఘన విజయం
  • అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి. కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ శర్మ విజయ కేతనం

ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. 

  • ఎన్డీయే కూటమి 290 స్థానాల్లో ముందంజ
  • ఇండియా కూటమి 234 స్థానాల్లో ముందంజ. 

మారుతున్న సమీకరణాలు..

  • లక్నో లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముందంజ. 17వేల ఆధిక్యం.
  • యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటంతో పార్టీ కార్యకర్తల సంబురాలు.
  • జార్ఖండ్‌లో కాంగ్రెస్‌, జేఎంఎం కార్యకర్తల సంబురాలు. కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అర్జున్‌ ముండా వెనుకంజ.
  • మధ్యప్రదేశ్‌లో వింత పరిస్థితి..
  • ఇండోర్‌ లోక్‌సభ ‍స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్‌ లాల్వానీకి 7లక్షల 89వేల ఆధిక్యం. 
  • అక్కడ నోటాకు లక్షా69వేల ఓట్లు.(రెండో స్థానంలో నోటా)
  • మూడో స్థానంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్‌

     

     

👉ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడికి భారీ ఆధిక్యం..

  • 51వేల ఓట్ల ఆధిక్యంలో ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌సింగ్‌ ఖల్సా
    మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌ సింగ్‌ కుమారుడే సరబ్‌జీత్‌ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు.
    పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
     

 

  • 👉సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెనుకంజ
    ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతాదళ్‌ మధ్య గట్టి పోటీ
    కాంటాబంజిలో సీఎం నవీన్‌ పట్నాయక్‌ 1158 ఓట్ల వెనుకంజ
    పోటీ చేస్తున్న రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌

     

  • 👉లోక్‌సభ ఎన్నికల్లో అమిత్‌ షా ఘన విజయం
    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.

 

👉ప్రస్తుత ట్రెండ్స్‌ ఇలా..

ఫలితాల్లో ఎన్డీయే కూటమి-294 ముందంజ
ఇండియా కూటమి-239 ముందంజ
 

యూపీలో ఇండియా ​కూటమి-40
ఎన్డీయే-38
ఇతరులు-2

హర్యానాలో ఇండియా ‍కూటమి-6
బీజేపీ-4

తమిళనాడులో ఇండియా కూటమి-37
ఎన్డీయే-1

కర్ణాటకలో ఇండియా కూటమ10
ఎన్డీయే- 18

రాజస్థాన్‌లో బీజేపీ-13
ఇండియా కూటమి-12

బెంగాల్‌లో టీఎంసీ-31
బీజేపీ-10
కాంగ్రెస్‌-1
మధ్యప్రదేశ్‌లో బీజేపీ-29
కాంగ్రెస్‌-0

అసోంలో ఎన్డీయే-10
ఇండియ కూటమి-4

జార్ఖండ్‌లో ఎన్డీయే-9
ఇండియా కూటమి-5

బీహార్‌లో ఎన్డీయే- 32
ఇండియా కూటమి- 8

మహారాష్ట్రలో ఇండియా కూటమి-28
ఎన్డీయే-19

పంజాబ్‌లో కాంగ్రెస్‌-7
ఆప్‌-2

ఒడిషాలో బీజేపీ-16
బీజేడీ-4
ఇండియా కూటమి-1

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-10
కాంగ్రెస్‌-1

కేరళలో యూడీఎఫ్‌-17
ఎన్డీయే-2
ఎల్‌డీఎఫ్‌-1
 

👉కాంగ్రెస్‌ 100 దాటితే కూటమిదే అధికారం: సంజయ్‌ రౌత్‌
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఒకవేళ కాంగ్రెస్‌ 100 స్థానాల్లో విజయం సాధిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అవుతారు. దేశ ప్రజలు కోరుకుంటే రాహుల్‌ గాంధే పీఎం.

 

👉 ఇ‍ప్పటి వరకు సమీకరణాలు ఇలా..

బెంగాల్‌లో దూసుకెళ్తున్న అధికార టీఎంసీ
దాదాపు 31 స్థానాల్లో టీఎంసీ ముందంజ.
బీజేపీ 10 స్థానాల్లో ముందంజ. 
కాంగ్రెస్‌-1

మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌.. 29 స్థానాల్లో ముందంజ
తమిళనాడులో ఇండియా కూటమి 36 స్థానాల్లో ముందంజ
ఎన్డీయే-1
ఏడీఎంకే-2
ఒడిషాలో బీజేపీ-18
బీజేడీ-2
ఇండియా కూటమి-1
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-9
కాంగ్రెస్‌-2

కర్ణాటకలో ఎన్డీయే-20
కాంగ్రెస్‌-8
కేరళలో యూడీఎఫ్‌-17
ఎన్డీయే-2
ఎల్‌డీఎఫ్‌-1

 

అమేఠీలో స్మృతి ఇరానీ వెనుకంజ

  • యూపీలోని అమేఠీలో సిట్టింగ్‌ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకబడ్డారు
    ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ దాదాపు 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


హాసనలో ప్రజ్వల్‌ రేవణ్ణకు ఆధిక్యం

  • కర్ణాటకలోని హాసనలో జేడీఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఆధిక్యం
    కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ ఎం. పాటిల్‌పై 2369 ఓట్లతో ముందంజ


వారణాసిలో 600 ఓట్ల ఆధిక్యంలో మోదీ

  • ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీ
    ఇక్కడ మళ్లీ ముందంజలోకి వచ్చిన మోదీ
    ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ
     

 

లీడ్‌ ఇలా...

  • బీహార్‌లో 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. 
    పశ్చిమ బెంగాల్‌లో 21 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ 
    అమేథీలో స్మృతీ ఇరానీ వెనుకంజ. 
    కర్ణాటకలో​ 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. 
    ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడింగ్‌. 
    యూపీలో ఇండియా కూటమి లీడ్‌. 
    వారణాసిలో మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ.
    మణిపూర్‌లో ఆధిక్యంలో బీజేపీ.

     

👉 తాజా సమీకరణాల ప్రకారం..

  • ఎన్డీయే-294
  • ఇండియా కూటమి-223
  • ఇతరులు-19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

 

👉 ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం ఒడిషా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 13 స్థానాల్లో ముందంజ, బీజేడీ ఆరు స్థానాలు, ఇండియా కూటమి ఒక్క స్థానంలో ముందంజ. 

 

 

👉ఇప్పటి వరకు వీరు లీడ్‌లో..
వారణాసిలో మోదీ వెనుకంజ. ఆరు వేల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి
రాజస్థాన్‌లో 20 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌. 
మాండ్యాలో హెచ్‌డీ కుమారస్వామి లీడింగ్‌. 
మధురలో బీజేపీ నేత హేమామాళిని ముందంజ 
కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై వెనుకంజ
కురుక్షేత్రలో బీజేపీ నేత నవీన్‌ జిందాల్‌ వెనుకంజ. 
 

👉వయనాడ్‌, రాయబరేలీ స్థానాల్లో రాహుల్‌ గాంధీ ముందంజ. 

 

 

👉లీడింగ్‌లో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజుజు, 
 

 

 

👉 ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లీడ్‌ ఇలా..

  • యూపీలో ఎన్డీయే కూటమి 53 స్థానాల్లో, ఇండియా కూటమి 24 స్థానాలు.
  • మహారాష్ట్రాలో ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో ఇండియా కూటమి 21 స్థానాలు.
  • పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఐదు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో
  • మధ్యప్రదేశ్‌లో బీజేపీ 25, కాంగ్రెస్‌ 2
  • రాజస్థాన్‌ బీజేపీ 20, ఇండియా కూటమి 4
  • కేరళలో ​యూడీఎఫ్‌ 14, ఎల్డీఎఫ్‌ 6, ఎన్డీయే-0
  • కర్ణాటకలో ఎన్డీయే 22, కాంగ్రెస్‌-6
  • అసోం ఎన్డీయే 9,  ఇండియా-3
  • బీహార్‌ ఎన్డీయే 26, ఇండియా-9

 

👉ఎన్డీయే కూటమి 300 స్థానాల్లో ఆధిక్యం

👉ఇండియా 170 స్థానాల్లో ఆధిక్యం. 

ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం ఇలా.. 

 

 

 

👉ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 253, 135 స్థానాల్లో ముందుంజ.

👉ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 8 స్థానాల్లో ముందంజ, బీజేపీ 6 ‍స్థానాల్లో ముందంజ.

👉మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ ఆధిక్యం

 

 

 

👉తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ వెనుకంజ
👉గునాలో బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా ముందంజ
 

👉ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో ముందంజ
👉ఇండియా కూటమి 123 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 
👉ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 
 

👉పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీ

  • ఇప్పటి వరకు 180  స్థానాల్లో బీజేపీ ముందుంజ
  • ఇండియా కూటమి 90 స్థానాల్లో ముందంజ
  • ఇతరులు 10 స్థానాల్లో ముందంజ 

 

👉ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు

👉100పైగా స్థానాల్లో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. 

 

 

 

 

👉పోస్టల్‌ బ్యాలెట్‌లో అమేథీలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ముందుంజ.
👉వయనాడ్‌లో ఆధిక్యంలో రాహుల్‌ గాంధీ. 

👉రాయబరేలీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. 

 

 

👉పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వెలువడుతున్నాయి..
 

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ముందంజ
ఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజ
ఇతరులు 10 స్థానాల్లో ముందుంజ. 

 

👉 కౌంటింగ్‌ ప్రారంభం

 

 

 

 

👉దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. 542 పార్లమెంట్‌ స్థానాల్లో మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ‍ప్రారంభమైంది. ఏపీలో, ఒడిషాలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం. 

 

 

👉గోరఖ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి రవికిషన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఇది చారిత్రాత్మకం. రామరాజ్యం కొనసాగుతుంది. మోదీపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీ గెలుపు ఖాయం. 

 

 

👉ఢిల్లీ పార్లమెంట్‌ స్థానం బీజేపీ అభ్య‍ర్థి, సుష్మా స్వరాజ్‌ కూతురు భన్సూరి స్వరాజ్‌ మాట్లాడుతూ.. బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీని కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అవడం ఖాయం. 
 

 

👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్‌ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌ ధన్గర్‌ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

 

 

👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్‌ రూమ్స్‌
 

 

 

👉మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్‌ వద్ద పార్టీల ఏజెంట్స్‌, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 

 

 

👉కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. 

 

 

👉కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మనీష్‌ తివారీ కామెంట్స్‌.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్‌ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి.

 

 

👉దేశంలో 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 

 

👉బరిలో 53 మంది మంత్రులు 
53 మంది సిటింగ్‌ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 
 

👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్‌ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. 

 

 
 

👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంపు..  హర్యానా, గుజరాత్‌, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు

 

 

 

 

 

 

👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 

👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 

👉ఏకగ్రీవమైన సూరత్‌ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement