
చెన్నై: జాతీయ విద్యా విధానంలో మూడు భాషల నిబంధనపై తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ పోరాటం కూడా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin)ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అయితే దీనికి స్టాలిన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.
#TwoLanguagePolicy, #FairDelimitation కోసం తమిళనాడు న్యాయంగా పోరాడుతోంది. ఆ స్వరం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. అందుకే బీజేపీ ఉలిక్కిపడుతోంది.కావాలంటే ఆ పార్టీ నేతల ఇంటర్వ్యూలు చూడండి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వేషం గురించి మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇదేం వ్యంగ్యం కాదు.. ఇది రాజకీయంగా ‘బ్లాక్ కామెడీ’లా అనిపిస్తోంది.
.. తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించడం లేదు. బలవంతం భాషను మాపై రుద్దడాన్ని.. భాషా దురభిమానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది. మాదేం ఓట్ల కోసం అల్లర్లు జరిపించే రాజకీయం కాదు. మాది న్యాయ పోరాటం.. అంతకు మించి ఆత్మ గౌరవ పోరాటం అని యోగి ఇంటర్వ్యూ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ చురకలు అంటించారు.
Tamil Nadu’s fair and firm voice on #TwoLanguagePolicy and #FairDelimitation is echoing nationwide—and the BJP is clearly rattled. Just watch their leaders’ interviews.
And now Hon’ble Yogi Adityanath wants to lecture us on hate? Spare us. This isn’t irony—it’s political black… https://t.co/NzWD7ja4M8— M.K.Stalin (@mkstalin) March 27, 2025
యోగి ఏమన్నారంటే..
ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి మాట్లాడుతూ.. కొందరు దేశాన్ని ఏకం చేయాలన్న ప్రయత్నాలు చేయకుండా.. భాష, ప్రాంతం పేరుతో విబేధాలు సృష్టించాలని చూస్తున్నారు. అలాంటి రాజకీయాలు దేశాన్ని బలహీనపరుస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన మీద స్టాలిన్ చేస్తున్న ఉద్యమం కేవలం రాజకీయ ఎజెండాతోనే. ఆయన ఓటు బ్యాంకు ప్రమాదం అంచున ఉంది. అందుకే ఇలాంటి విభజన రాజకీయం తెర మీదకు తెచ్చారు.
ఈ దేశం ఏ భాష, ప్రాంతం ఆధారంగా విభజించబడింది కాదు. వారణాసిలో కాశీ-తమిళ సంగమం మూడో తరం నిర్వహిస్తున్నందుకు ప్రధాని మోదీ(PM Modi)కి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేశంలో తమిళం పురాతన భాష. భారత వారసత్వ సంపద ఇప్పటికీ ఆ భాషలో సజీవంగా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అసలు హిందీని ద్వేషించాల్సిన అవసరం ఏముంది? అని యోగి ప్రశ్నించారు.