న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ ఎన్నికలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు.
తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది.
సీఎం రేవంత్‌రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో స్థానంలో నిలిచాం. బీఆర్‌ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment