general election results
-
పోలింగ్ అనంతర దాడులపై పూర్తి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలే లక్ష్యంగా జరుగుతున్న లక్షిత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిర్దిష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిపై మరో రాజకీయ పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్దిష్ట విధానం ఉందిగా అని ప్రశ్నించింది. అయినా కూడా కేసులు నమోదు చేయడం లేదన్నారు. దాడులపై రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఎంపీ ఫిర్యాదు చేశారని, అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. హింస, దాడులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశాలివ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది. -
నేనే మంత్రి
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో జయకేతనం ఎగరేసింది. ఇప్పుడు కేబినెట్లో స్థానం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కొందరు ఆశావహులు రేసులో ఉన్నారు. మంత్రివర్గం ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ స్థానాలపై కూటమిలో పార్టీల ప్రాతినిధ్యాలపై నేతలు చర్చించుకుంటున్నారు. సామాజిక వర్గాలతో పాటు, సీనియార్టీ ప్రకారం చూసినా ‘అమాత్యయోగం’ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారి జాబితా అధికంగానే ఉంది. ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ఉమ్మడి కృష్ణాలోని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు.సాక్షి, విజయవాడ ప్రతినిధి, అవనిగడ్డ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏపీలో ‘ఎన్టీఏ కూటమి’ ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుంది. అయితే రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చేవారు. గతంలో వారికి ఇచ్చిన హామీలు, సామాజిక కోటాల పేరుతో మంత్రి పదవులు దక్కేవి. ఎన్డీఏ కూటమిలో టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు ఉన్నారు. బీసీ కోటాలో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్ర చంద్రబాబు మంత్రి వర్గంలో, పార్థసారథి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ సీపీ నుంచి పార్థసారథి టీడీపీలో చేరారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన రవీంద్రకు మంత్రి పదవి వరించే అవకాశముంది. ఎస్సీ, మహిళా కోటాలో.. నందిగామ నుంచి విజయం సాధించిన తంగిరాల సౌమ్య ఎస్సీ, మహిళా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రెండోసారి గెలుపొందిన ఆమెకు మంత్రిగా అవకాశం రావచ్చని తెలుస్తోంది. మారిన కోటాలో.. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీలో ఉన్న వీరిద్దరూ పారీ్టలు మారడం.. ఆ నియోజకవర్గాల నుంచి గెలుపొందడంతో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం కలిసొచ్చే అంశం. పోటా పోటీ.. ఉమ్మడి కృష్ణాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గెలుపొందిన సుజనాచౌదరికి చంద్రబాబు ఆశీస్సులు ఉండటంతో మంత్రి వర్గం రేసులో ముందున్నారని తెలుస్తోంది. కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి ఏకైక అభ్యరి్థగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవి రేసులో ముందున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేయడం, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం కాపు సామాజిక వర్గం కావడంతో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.పోటీలో గద్దె, బొండా, శ్రీరాంవిజయవాడ తూర్పు నుంచి గెలుపొందిన గద్దె రామ్మోహనరావు సీనియర్ కోటాలో, సెంట్రల్ నుంచి బొండా ఉమా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, జగ్గయ్యపేట నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన శ్రీరాం తాతయ్య వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నానిపై గెలుపొందిన వెనిగండ్ల రాము మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో నూతన మంత్రి వర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే. -
అమాత్య పదవిపై ఆశలు!
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడే అమాత్య పదవిపై ఆశలు మొదలయ్యాయి. ఫలితాలు వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఎవరికి వారు తమకే మంత్రి పదవి దక్కుతుందంటూ అంచనాలేసుకుంటున్నారు. వారితో పాటు వారి ప్రధాన అనుచరులు కూడా ఊహల పల్లకీలో విహరిస్తున్నారు. సీనియారిటీ, సామాజిక సమీకరణలు, కూటమి పెద్దలతో ఉన్న పరపతి, పరిచయాలు, అనుబంధాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా వారు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 13 మంది ఎమ్మెల్యేలు కూటమి తరఫున ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి, మిగిలిన ఎనిమిది మంది టీడీపీ నుంచి గెలుపొందారు.👉 విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు ఈ దఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు, విశాఖ ఎంపీగా ఎన్నికై న శ్రీభరత్‌తో సత్సంబంధాలున్నాయి. ఇవన్నీ తమ నాయకుడు వెలగపూడికి మంత్రి పదవి దక్కేందుకు కలిసొచ్చే అంశాలని ఆయన అనుచరులు చెబుతున్నారు.👉 నాలుగోసారి గెలిచిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవిపై నమ్మకంతో ఉన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మంత్రిగా పనిచేశారు. తన సామాజికవర్గం కోటా కలిసొస్తుందని ఆయన ఆశతో ఉన్నారు.👉 పెందుర్తి నుంచి జనసేన తరఫున ఎన్నికై న పంచకర్ల రమేష్‌బాబుకి ఇది మూడోసారి గెలుపు. దీంతో తన సీనియారిటీ, జనసేన కోటా, సామాజికవర్గం కలిసొచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. అయితే గంటా, పంచకర్లది ఒకే సామాజికవర్గం కావడంతో ఈయనకు మంత్రి పదవి ప్రతిబంధకంగా మారుతుందని అంటున్నారు.👉 నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలుపొందిన అయ్యన్న తనకు మంత్రి పదవి ఖాయమన్న భావనలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కేబినెట్లో స్థానం దక్కడంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.👉 గాజువాక నుంచి టీడీపీ తరఫున రెండోసారి గెలిచిన పల్లా శ్రీనివాసరావు తన సామాజికవర్గ కోటాలో మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఆయన అనుచరులు ఇప్పటికే ఈ ప్రచారం మొదలు పెట్టారు.👉 విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికై న విష్ణుకుమార్‌రాజు తనకు కూటమి బీజేపీ కోటాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఆయనకు పోటీగా ఉన్నారు.👉 పాయకరావుపేట నుంచి రెండో దఫా ఎన్నికై న వంగలపూడి అనిత కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజికవర్గం, మహిళా కోటా తనకు కలిసొస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.👉 జనసేన తరఫున అనకాపల్లి నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణ 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. జనసేనలో సీనియర్ అయిన కొణతాల తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు.👉 ఆఖరి నిమిషంలో మాడుగుల సీటు దక్కించుకుని పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అయ్యన్నది, ఈయనది ఒకే సామాజికవర్గం కావడం అడ్డంకిగా మారుతుందని చెబుతున్నారు. ఇలా ఫలితాలు వెలువడ్డాయో లేదో అలా మంత్రి పదవులపై ఎవరికి వారే అంచనాల్లో మునిగి తేలుతున్నారు. వారి అనుచరులు సైతం బాహాటంగానే చెప్పుకుంటున్నారు. -
దక్షిణాదిన ‘కమల’ హాసం!
కేంద్రంలో వరసగా పదేళ్లు పాలించి మూడోసారి 400 సీట్లతో ఘనమైన హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలనుకున్న ఎన్డీఏను ఉత్తరాదిన నిలువరించటంలో, దాన్ని 300 లోపు మెజారిటీకి పరిమితం చేయటంలో ‘ఇండియా’ కూటమి విజయం సాధించిందని సోమవారం వెల్లడవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ‘జనం మా వైపే మొగ్గు చూపారు. మూడోసారి కూడా పాలించమని ఆశీర్వదించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా జరిగిందేమిటో కనబడుతూనేవుంది. పూర్తి ఫలితాలు వెల్లడికావటానికి ఇంకా సమయంవున్నా దేశానికి ‘కొత్త రోల్ మోడల్’గా బీజేపీ చూపించదల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ సగం సీట్లపైగా కోల్పోవటం ఖాయమని అర్థమవుతోంది. రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్య... ఫైజాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనిదే. అక్కడా, ఇతరచోట్లా బీజేపీకి ఎదురుగాలి వీచటం చిన్నవిషయం కాదు. అయితే ఉత్తరాదిలో ఎన్డీఏకు జరిగిన ఈ నష్టాన్ని భర్తీ చేయటానికి దక్షిణాది సిద్ధపడిందని, తూర్పున ఒడిశా కూడా ముందుకొచ్చిందని ఫలితాలు సూచిస్తున్నాయి. తమిళనాడు ఇందుకు మినహాయింపు. ఆఖరికి ఎప్పుడూ బీజేపీ ఉనికి కనబడని కేరళలో ఆ పార్టీకి ఒక స్థానం రావడం సామాన్యం కాదు. బెంగాల్ మాత్రం బీజేపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఉత్తరాదిన మతతత్వ రాజకీయాలపై మబ్బులు విడిపోతున్న వేళ దక్షిణాది ఆ ప్రభావానికి లోనుకావటం ఏపీలో టీడీపీకి కలిసొచ్చివుండొచ్చని కొందరు చేస్తున్న విశ్లేషణ నిజమే కావొచ్చు. ఎందుకంటే కార్గిల్ ఘర్షణల అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో మెరుగ్గా స్థానాలు వచ్చాక ఎన్డీఏకు ఈ స్థాయిలో ఆదరణ లభించటం ఇదే మొదటిసారి. కర్ణాటక బీజేపీ కొమ్ముకాయడంలో వింతేమీ లేదు. అది బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీదే అక్కడ ఆధిక్యత. తెలంగాణలో సైతం ఈసారి దాదాపు సగం స్థానాలతో బీజేపీ జెండా ఎగరటం, ఆ పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీలు నమోదుకావటం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘ఆరు గ్యారెంటీల’ పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అధికారంలోవున్న కాంగ్రెస్ సతమతమవుతోంది. బీజేపీ బలం పుంజుకోవటానికి అది తోడ్పడింది.కానీ వెనకా ముందూ చూడకుండా ఈ వాగ్దానాలనే కాపీకొట్టి జనం ముందుకొచ్చిన తెలుగుదేశానికి ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించింది. అయిదేళ్లక్రితం ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం పైగా నెరవేర్చి, ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్‌డీఏవైపు జనం మొగ్గుచూపటం వెనక బీజేపీతోపాటు రకరకాల ప్రభావాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. చంద్రబాబు విశ్వసనీయత కలిగిన నాయకుడు కాదు. ఆ సంగతిని ఆయన 2014–19 మధ్య పాలించినప్పుడు సైతం నిరూపించుకున్నారు. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక ఏకంగా మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్నుంచి మాయం చేసిన ఘనుడాయన. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోదు. మేనిఫెస్టో ఆవిష్కరణ రోజున దానిపై ప్రధాని ఛాయాచిత్రం ఉండరాదని బీజేపీ పట్టుబట్టడం, అందుకు అంగీకరించినా దాన్ని చేతితో తాకేందుకు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు సిద్ధపడని వైనం తాజా వాగ్దానాలకు ఏ గతి పడుతుందో తేటతెల్లం చేశాయి. ఆ సంగతలావుంచి ఎన్నికల ప్రచారపర్వంలోగానీ, అంతకుముందుగానీ ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనబడనిచోట అధికారపక్షం ఇంత దారుణంగా ఓడిపోవటం వెనక ఈవీఎంల పాత్ర ఉండొచ్చని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలూ... చాలాచోట్ల వోటింగ్ శాతం అసాధారణంగా పెరగటంలో మతలబుందని పోలింగ్ రోజున మరికొందరు శంకించటం పూర్తిగా కొట్టిపారేయదగినవి కాకపోవచ్చు. సాధారణంగా ఓడిన పక్షం ఈవీఎంలపై నెపం వేయటం గతంలో చాలాసార్లు జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అకాలీదళ్‌లు భిన్న సందర్భాల్లో ఆ పనే చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఇంతవరకూ ఆ మాటనలేదు. కానీ ఆ పార్టీ నేతల స్వరంలో అది అంతర్లీనంగా కనబడుతూనేవుంది. అమెరికాతోసహా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తి బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రమే ఇది ఎందుకు కొనసాగాలని చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎలాగోలా గెలవటం తప్ప నైతిక విలువల గురించి అసలు పట్టింపేలేని బాబు చడీచప్పుడూ లేకుండా వోటింగ్ శాతం పెరగటానికీ, ఈవీఎంలను తనకనుకూలంగా మలుచుకోవటానికీ లోపాయకారీగా ఏమైనా చేసివుంటారన్న సంశయాలు ఇందుకే వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే భూ యజమానులకు తొలిసారిగా హక్కులివ్వటానికి సంకల్పించిన భూహక్కు చట్టం వంటి అత్యుత్తమ చట్టంపై బురదచల్లి, తప్పుడు ప్రచారం నడిపి ప్రజలను భయభ్రాంతుల్ని చేయటంలో బాబు విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. సత్యం మాత్రమే జయిస్తుందన్నది కూడా వాస్తవమే. కానీ గెలిచేదంతా సత్యం కాదు. నిలకడపై అన్ని నిజాలూ వెల్లడవుతాయి. ఎన్నికల నిర్వహణ తీరు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. ఏపీ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. పక్కనున్న తెలంగాణలో వివాదరహితంగా ఎన్నికలు జరగ్గా ఏపీలో బాబు, పవన్‌లు దుర్భాషలతో చెలరేగిపోయారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం చేసిందేమీ లేదు సరిగదా...టీడీపీ అడిగిన తడవే అన్నీ నెరవేర్చింది. పర్యవసానంగా తటస్థతకు తూట్లుపడ్డాయి. మొత్తానికి ఆరు వారాలపాటు పెళ్లివారి నడకను తలపిస్తూ సాగిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా పాలనను స్తంభింపజేసింది. -
భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
-
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి
Live Updates...వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఘన విజయం.. 1.52 లక్షల మెజారిటీ సాధించిన మోదీఇండోర్ బీజేపీ అభ్యర్థికి రికార్డ్ మెజార్టీ.. 10.08 లక్షల ఓట్లతో శంకర్ లాల్వానీ అఖండ విజయంమధ్య ప్రదేశ్ విదిశలో మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపురెండు చోట్లా రాహుల్ గాంధీ గెలుపు. వయనాడ్, రాయబరేలీ స్థానాలలో ఘన విజయంఅమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి. కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ విజయ కేతనంఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీయే కూటమి 290 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 234 స్థానాల్లో ముందంజ. మారుతున్న సమీకరణాలు..లక్నో లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్ ముందంజ. 17వేల ఆధిక్యం.యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటంతో పార్టీ కార్యకర్తల సంబురాలు.జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం కార్యకర్తల సంబురాలు. కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా వెనుకంజ.మధ్యప్రదేశ్‌లో వింత పరిస్థితి..ఇండోర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి 7లక్షల 89వేల ఆధిక్యం. అక్కడ నోటాకు లక్షా69వేల ఓట్లు.(రెండో స్థానంలో నోటా)మూడో స్థానంలో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్ Madhya Pradesh: BJP candidate from Indore Lok Sabha seat Shankar Lalwani leading with a margin of 7,89,625 NOTA (None of the Above) is currently on the second position with 1,69,228 votes pic.twitter.com/BWGsCrruxZ— ANI (@ANI) June 4, 2024 👉ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడికి భారీ ఆధిక్యం..51వేల ఓట్ల ఆధిక్యంలో ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌సింగ్ ఖల్సామాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జీత్ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు.పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 👉సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతాదళ్ మధ్య గట్టి పోటీకాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ 1158 ఓట్ల వెనుకంజపోటీ చేస్తున్న రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ 👉లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ షా ఘన విజయంగుజరాత్లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 👉ప్రస్తుత ట్రెండ్స్ ఇలా..ఫలితాల్లో ఎన్డీయే కూటమి-294 ముందంజఇండియా కూటమి-239 ముందంజ యూపీలో ఇండియా కూటమి-40ఎన్డీయే-38ఇతరులు-2హర్యానాలో ఇండియా కూటమి-6బీజేపీ-4తమిళనాడులో ఇండియా కూటమి-37ఎన్డీయే-1కర్ణాటకలో ఇండియా కూటమ10ఎన్డీయే- 18రాజస్థాన్‌లో బీజేపీ-13ఇండియా కూటమి-12బెంగాల్లో టీఎంసీ-31బీజేపీ-10కాంగ్రెస్-1మధ్యప్రదేశ్‌లో బీజేపీ-29కాంగ్రెస్-0అసోంలో ఎన్డీయే-10ఇండియ కూటమి-4జార్ఖండ్‌లో ఎన్డీయే-9ఇండియా కూటమి-5బీహార్‌లో ఎన్డీయే- 32ఇండియా కూటమి- 8మహారాష్ట్రలో ఇండియా కూటమి-28ఎన్డీయే-19పంజాబ్‌లో కాంగ్రెస్-7ఆప్-2ఒడిషాలో బీజేపీ-16బీజేడీ-4ఇండియా కూటమి-1ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-10కాంగ్రెస్-1కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 👉కాంగ్రెస్ 100 దాటితే కూటమిదే అధికారం: సంజయ్ రౌత్శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఒకవేళ కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అవుతారు. దేశ ప్రజలు కోరుకుంటే రాహుల్ గాంధే పీఎం. 👉 ఇప్పటి వరకు సమీకరణాలు ఇలా..బెంగాల్లో దూసుకెళ్తున్న అధికార టీఎంసీదాదాపు 31 స్థానాల్లో టీఎంసీ ముందంజ.బీజేపీ 10 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్-1మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్.. 29 స్థానాల్లో ముందంజతమిళనాడులో ఇండియా కూటమి 36 స్థానాల్లో ముందంజఎన్డీయే-1ఏడీఎంకే-2ఒడిషాలో బీజేపీ-18బీజేడీ-2ఇండియా కూటమి-1ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-9కాంగ్రెస్-2కర్ణాటకలో ఎన్డీయే-20కాంగ్రెస్-8కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 అమేఠీలో స్మృతి ఇరానీ వెనుకంజయూపీలోని అమేఠీలో సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకబడ్డారుఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ దాదాపు 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.హాసనలో ప్రజ్వల్ రేవణ్ణకు ఆధిక్యంకర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్‌పై 2369 ఓట్లతో ముందంజవారణాసిలో 600 ఓట్ల ఆధిక్యంలో మోదీప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీఇక్కడ మళ్లీ ముందంజలోకి వచ్చిన మోదీప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ లీడ్ ఇలా...బీహార్‌లో 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. పశ్చిమ బెంగాల్లో 21 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ అమేథీలో స్మృతీ ఇరానీ వెనుకంజ. కర్ణాటకలో 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడింగ్. యూపీలో ఇండియా కూటమి లీడ్. వారణాసిలో మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ.మణిపూర్‌లో ఆధిక్యంలో బీజేపీ. 👉 తాజా సమీకరణాల ప్రకారం..ఎన్డీయే-294ఇండియా కూటమి-223ఇతరులు-19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 👉 ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒడిషా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 13 స్థానాల్లో ముందంజ, బీజేడీ ఆరు స్థానాలు, ఇండియా కూటమి ఒక్క స్థానంలో ముందంజ. As per initial trends by ECI, BJP is leading on 13 seats, BJD leading on 6 seats in the Odisha Assembly elections. pic.twitter.com/T25jvjZxoo— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు వీరు లీడ్‌లో..వారణాసిలో మోదీ వెనుకంజ. ఆరు వేల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిరాజస్థాన్లో 20 స్థానాల్లో బీజేపీ లీడింగ్. మాండ్యాలో హెచ్డీ కుమారస్వామి లీడింగ్. మధురలో బీజేపీ నేత హేమామాళిని ముందంజ కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వెనుకంజకురుక్షేత్రలో బీజేపీ నేత నవీన్ జిందాల్ వెనుకంజ. 👉వయనాడ్, రాయబరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ ముందంజ. Congress candidate from Uttar Pradesh's Raebareli Lok Sabha seat Rahul Gandhi leading from the seat with a margin of 2126 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/VdMDwab4jP— ANI (@ANI) June 4, 2024 👉లీడింగ్‌లో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్ రిజుజు, Union Home Minister and BJP candidate from Gujarat's Gandhinagar Lok Sabha seat Amit Shah leading from the seat with a margin of 7311 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/fWF987QsA8— ANI (@ANI) June 4, 2024 As per initial trends by ECI till 9 am, the BJP is leading on 75 seats, Congress leading on 25 seats, Samajwadi Party leading on 8 seats, AAP leading on 5 seats. #LokSabhaElections2024 pic.twitter.com/4CcM5XHaJh— ANI (@ANI) June 4, 2024 👉 ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లీడ్ ఇలా..యూపీలో ఎన్డీయే కూటమి 53 స్థానాల్లో, ఇండియా కూటమి 24 స్థానాలు.మహారాష్ట్రాలో ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో ఇండియా కూటమి 21 స్థానాలు.పంజాబ్‌లో కాంగ్రెస్ ఐదు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లోమధ్యప్రదేశ్లో బీజేపీ 25, కాంగ్రెస్ 2రాజస్థాన్ బీజేపీ 20, ఇండియా కూటమి 4కేరళలో యూడీఎఫ్ 14, ఎల్డీఎఫ్ 6, ఎన్డీయే-0కర్ణాటకలో ఎన్డీయే 22, కాంగ్రెస్-6అసోం ఎన్డీయే 9, ఇండియా-3బీహార్ ఎన్డీయే 26, ఇండియా-9 👉ఎన్డీయే కూటమి 300 స్థానాల్లో ఆధిక్యం👉ఇండియా 170 స్థానాల్లో ఆధిక్యం. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఇలా.. As per initial trends by ECI till 8.47 am, the BJP is leading on 42 seats, Congress leading on 17 seats, AAP leading on 4 seats, Samajwadi Party leading on 2 seats. #LokSabhaElections2024 pic.twitter.com/PqudCi2uZf— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 253, 135 స్థానాల్లో ముందుంజ.👉ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 8 స్థానాల్లో ముందంజ, బీజేపీ 6 స్థానాల్లో ముందంజ.👉మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఆధిక్యం As per initial trends by ECI, the BJP is leading on 17 seats, Congress leading on one seat.#LokSabhaElections2024 pic.twitter.com/7651efxe82— ANI (@ANI) June 4, 2024 👉తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ వెనుకంజ👉గునాలో బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా ముందంజ 👉ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో ముందంజ👉ఇండియా కూటమి 123 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 👉ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీఇప్పటి వరకు 180 స్థానాల్లో బీజేపీ ముందుంజఇండియా కూటమి 90 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందంజ 👉ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు👉100పైగా స్థానాల్లో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. #WATCH | Uttarakhand | Counting of postal ballots started amid tight security in Haridwar. Visuals from a counting centre here.#LokSabhaElections2024 pic.twitter.com/zdeAuRkEYC— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్లో అమేథీలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ముందుంజ.👉వయనాడ్‌లో ఆధిక్యంలో రాహుల్ గాంధీ. 👉రాయబరేలీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. #WATCH | Uttar Pradesh: Counting of postal ballots underway at a counting centre in Raebareli Parliamentary constituency. #LokSabhaElections2024 pic.twitter.com/Gm9abdEyzd— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందుంజ. 👉 కౌంటింగ్ ప్రారంభం Counting of votes for the #LokSabhaElections2024 begins.The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. BJP won the Surat seat unopposed. pic.twitter.com/qfuRFSn4xi— ANI (@ANI) June 4, 2024 #WATCH | Punjab: Counting of votes for the #LokSabhaElections2024 begins. (Visuals from a counting centre in Amritsar) pic.twitter.com/uqZUzcvbCK— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 542 పార్లమెంట్ స్థానాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏపీలో, ఒడిషాలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం. Counting of votes for the #LokSabhaElections2024 begins. The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. Postal ballot counting to begin first.Counting is also being done for Andhra Pradesh and Odisha Assembly elections as well as… pic.twitter.com/3tu7Opjasf— ANI (@ANI) June 4, 2024 👉గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఇది చారిత్రాత్మకం. రామరాజ్యం కొనసాగుతుంది. మోదీపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీ గెలుపు ఖాయం. #WATCH | BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan says, "This is historic, Ram Rajya will continue. The biggest leader of the world is going to be the Prime Minister for the third time...People of the country have made the country win and placed their trust in PM Modi..."… pic.twitter.com/5z2B7NAb6G— ANI (@ANI) June 4, 2024 👉ఢిల్లీ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కూతురు భన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీని కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అవడం ఖాయం. #WATCH | BJP candidate from New Delhi Lok Sabha seat, Bansuri Swaraj says, "...I am completely confident that today the people of India will choose the public welfare policies of BJP, will choose the development policies of our Prime Minister Narendra Modi...I know Teesri Baar… pic.twitter.com/8VgHIrxDXj— ANI (@ANI) June 4, 2024 👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. #WATCH | Uttar Pradesh: Congress candidate from Mathura, Mukesh Dhangar says, "...INDIA Alliance will form a government. There is no doubt about it...This victory (Dhangar's victory) will be of the people of Brij. This will 1000% be the victory of Banke Bihari and Maa Yamuna."… pic.twitter.com/IP6Def2u81— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్ రూమ్స్ #WATCH | Karnataka: Strong room being opened in Bengaluru district ahead of the counting of votes for the #LokSabhaElections2024The counting of votes will begin at 8 am. pic.twitter.com/ACGhbarIbx— ANI (@ANI) June 4, 2024 👉మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ వద్ద పార్టీల ఏజెంట్స్, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. #WATCH | Madhya Pradesh: Strong room being opened in Indore district ahead of the counting of votes for the #loksabhaelections2024phase5 Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. (Source: Madya Pradesh I&PR) pic.twitter.com/ntfmwhTEPC— ANI (@ANI) June 4, 2024 👉కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. #WATCH | Tamil Nadu: Congress candidate from Sivaganga Lok Sabha seat Karti Chidambaram arrives at a counting centre in Karaikudi, Sivaganga districtVote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/fKLk5uJf3u— ANI (@ANI) June 4, 2024 👉కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనీష్ తివారీ కామెంట్స్.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. #WATCH | Congress MP and party candidate from Chandigarh Manish Tewari says, "..It is Tuesday, Hanuman's day. People have expressed their opinions. The opinions are locked in the EVMs. The EVMs will open and the opinion will come out. Whatever the people's decision will be,… pic.twitter.com/yptpWNkKN4— ANI (@ANI) June 4, 2024 👉దేశంలో 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 👉బరిలో 53 మంది మంత్రులు 53 మంది సిటింగ్ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. #WATCH | Delhi: Congress worker Jagdish Sharma says, "I have already said 6 days ago that the election has been looted, it (counting of vote) is just a formality because the people of the country believe in the Constitution system. All Congress party leaders will come but I will… pic.twitter.com/vzkn3YrKT4— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంపు.. హర్యానా, గుజరాత్, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు #WATCH | Security heightened at a counting centre in Jind, Haryana. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/YXFo7YXRhU— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Raebareli, Uttar Pradesh. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/iq06WWob5Q— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Bhubaneswar, Odisha. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/NhoU4qURN0— ANI (@ANI) June 4, 2024#WATCH | Security heightened at a counting centre in Purba Medinipur, West Bengal. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/bgdJ3KPgou— ANI (@ANI) June 4, 2024 👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 👉ఏకగ్రీవమైన సూరత్ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. -
ఎగ్జిట్ పోల్ జోష్.. కుమ్మేసిన బుల్స్
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలతో మార్కెట్ కొత్త శిఖరాలకు పరుగులు తీసింది. ఎన్డీఏ భారీ మెజారిటీని సాధించనుందన్న అంచనా కొనుగోళ్ల జోరుకు దారిచూపింది. ఒక్కసారిగా ఊపందుకున్న పెట్టుబడులతో స్టాక్ బుల్ లాభాలతో కుమ్మేసింది. దీంతో సెన్సెక్స్ 2,507 పాయింట్ల(3.5 శాతం) పోల్‌వాల్ట్ చేసింది. 76,469 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు(3.3 శాతం) ఎగసి 23,264 వద్ద స్థిరపడింది, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. గతంలో 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున జంప్ చేశాయి. అంతక్రితం అంటే 2019 మే 20న సైతం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి రెండోసారి విజయాన్ని అంచనా వేయడంతో మార్కెట్లు 3 శాతానికిపైగా పురోగమించాయి. ఇంట్రాడేలోనూ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి.సంపదే సంపదమార్కెట్లు కదం తొక్కడంతో ఒకే ఒక్క రోజులో స్టాక్ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.78 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 426 లక్షల కోట్లకు చేరింది. వెరసి సరికొత్త రికార్డ్ 5.13 ట్రిలియన్ డాలర్లను తాకింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సైతం 5.09 లక్షల కోట్ల డాలర్ల(రూ. 422.48 లక్షల కోట్లు)కు చేరింది. స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతోపాటు.. గతేడాది(2023–24) దేశ జీడీపీ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం ఇన్వెస్టర్లకు ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషణ.రిలయన్స్ భళా..సెన్సెక్స్ 30 షేర్లలో 25 కౌంటర్లు భారీ లాభాలతో నిలవగా.. కేవలం సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్ నామమాత్రంగా డీలా పడ్డాయి. వీటితోపాటు ఇక నిఫ్టీ 50లో ఐషర్, ఎల్టీఐఎం, బ్రిటానియా స్వల్ప వెనకడుగు వేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియలీ్ట, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఆటో 7–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెవీవెయిట్ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం జంప్‌చేసి మార్కెట్లకు దన్నునిచ్చింది. రూ. 3,021కు చేరడం ద్వారా రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను జమ చేసుకుంది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 20.44 లక్షల కోట్లను దాటింది. షేరు తొలుత రూ. 3,029 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ప్రభుత్వ షేర్ల పరుగుతాజా ర్యాలీలో పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు లాభాల పరుగు తీశాయి. దీంతో ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా 9.5–4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, అ్రల్టాటెక్, ఇండస్ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ త్రయం, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ 7–2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఒక దశలో 52 వారాల గరిష్టాలకు చేరాయి. పీఎస్‌యూగా ఎస్బీఐ తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం!విదేశీ పెట్టుబడుల జోరు బీఎస్ఈ నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లుతాజాగా రూ. 6,851 కోట్ల పెట్టుబడులను పంప్ చేశారు. డీఐఐలు సైతం రూ. 1,914 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. గత వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,613 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. బీఎస్ఈ సూచీలలో మిడ్ క్యాప్ 3.5 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,346 లాభపడితే.. 1,615 మాత్రమే నష్టపోయాయి.అదానీ షేర్ల మెరుపులుప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అంచనాలకుతోడు, జఫరీస్ బ్రోకింగ్ బయ్ రేటింగ్‌తో తాజాగా అదానీ గ్రూప్ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ షేర్లు 4% నుంచి 16% వరకు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా గ్రూప్‌లోని మొ త్తం 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 19.42 లక్షల కోట్లను అధిగమించింది.రూపాయి ర్యాలీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీపై అంచనాలతో స్టాక్ మార్కెట్లతోపాటు దేశీ కరెన్సీ సైతం జోరందుకుంది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. తద్వారా 2023 నవంబర్ 15 తదుపరి(24 పైసలు) ఒకే రోజు రూపాయి అత్యధికంగా పుంజుకుంది. వెరసి రెండు నెలల గరిష్టం 83.14 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 21న 83.13 వద్ద నిలిచింది. ఉత్పత్తిని యథాతథంగా కొనసాగించే ఒపెక్ నిర్ణయంతో చమురు ధరలు బలహీనపడటం సైతం రూపాయికి ప్రోత్సాహాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 83.09 వద్ద హుషారుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82.95 వద్ద గరిష్టాన్ని తాకగా.. 83.17 వద్ద కనిష్టానికీ చేరింది. చివరికి 83.14 వద్ద స్థిరపడింది. వారాంతాన రూపాయి 13 పైసలు నీరసించి 83.42 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు, జీడీపీ, జీఎస్టీ గణాంకాలు సైతం రూపాయికి దన్నునిచి్చనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ఫలితాలపై 4 నుంచి జగన్ సమీక్షలు
హైదరాబాద్: సాధారణ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 4 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి మార్గనిర్ధేశం చేయనున్నారు. నియోజవర్గాలవారీగా ఏర్పాటు చేసే ఈ సమీక్షా సమావేశాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అక్కడి జెడ్పీటీసీ అభ్యర్థులు, మండల పార్టీ కన్వీనర్లతో పాటు నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశాల అనంతరం భవిష్యత్తు కార్యాచరణతో, నేతల్లో ఆత్మస్థయిర్యం నింపి మరింత ఉత్సాహంగా పనిచేయించడమే లక్ష్యంగా జగన్ జిల్లాల్లో పర్యటిస్తారు. మొదటగా జూన్ 4, 5, 6 తేదీల్లో రాజమండ్రిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాలపై జగన్ సమీక్షిస్తారని మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి చెప్పారు. ‘9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమీక్షా ఒంగోలులో ఉంటుంది. 11, 12ల్లో అనంతపురంలో రాయలసీమ జిల్లాల సమీక్షలు ఉంటాయన్నారు. శనివారం తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేల సమావేశంతో పాటు పార్టీ లోక్‌సభ సభ్యుల సమావేశం హైదరాబాద్‌లో వేరువేరుగా జరుగుతాయని అన్నారు. ఎంపీల సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. లోక్‌సభ మొదటి విడత సమావేశాల్లో పార్టీ ఎలాంటి అంశాలను ప్రస్తావించాలన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎస్పీవై రెడ్డికి నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచి తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎస్పీవై రెడ్డికి నోటీసు ఇవ్వనున్నట్టు మైసూరారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయంలోనే ఆయనకు నోటీసు ఇస్తామన్నారు. కొన్ని పత్రికలు, మీడియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీని వీడతారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది తప్పుడు ప్రచారమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘సచివులు’ ఎవరో!?
- ఆశలపల్లకిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు - ‘తెలంగాణ’ తొలి సర్కారుపై జోరుగా చర్చ - 16న తేలనున్న ప్రధాన పార్టీల భవితవ్యం - అప్పుడే మొదలైన ‘మంత్రుల’ చర్చ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందూరు జిల్లా రాజకీయ నేతలను ఆశల పల్లకీ ఎక్కిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో తమ దంటే తమదే విజయమని ఢంకా కొడుతుం డగా.. కొత్త సర్కారులో కొలువు దీరేందుకు నేతలు పోటీ పడుతున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో జిల్లా నుంచి ఎవరికి ప్రాధాన్యం దక్కుతుందనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఆశిస్తున్నట్లు ఎవరికీ అధికారం వచ్చినా, మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆందోళన ఆయా పార్టీల నేతల్లో కనిపిస్తోంది. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల కు జరిగిన ఎన్నికలు రాజకీయ పార్టీలలో ఫలి తా ల ఉత్కంఠను కలిగిస్తున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బో ధన్, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితా ల విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా, మిగతా స్థానాల్లో ఫలితాలు ఏ పార్టీలకు అనుకూలమన్న చర్చ కూడా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ‘తెలంగాణ’లో తొలి ప్రభుత్వం మాదేనని చెప్పుకుంటున్నా, ఆ పార్టీ నేతలలో మాత్రం ఇంకా సందిగ్ధమే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిల్లాలో ఎవరెవరు గెలుస్తారు? ఎవరికీ మంత్రిగా అవకాశం దక్కుతుంది? అనే ఆలోచనలో పడిపోయారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకున్నా కూడా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ పార్టీ అధినేత ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, జూన్ మొదటి వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌లో ఎవరికి పదవులు దక్కుతాయి? మంత్రి పదవి వరించే టీఆర్ఎస్ నేతలు ఎవరు? అనే చర్చ ఆ రెం డు పార్టీల నేతలు, క్యాడర్లో జరుగుతోంది. గెలుపోటములపై తేలని ఉత్కంఠ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరిగినా, ఇంకా గెలుపోటములపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, అం దులో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనే అంశాలపైనా అదే రకమైన చర్చలు జరుగుతున్నా యి. కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఎవరు ప్రభుత్వం ఏర్పా టు చేసినా జిల్లాకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే, సీనియర్ నేత, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే ఆయనకు తప్పకుండా కీలక మంత్రిగా అవకాశం దక్కనుంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని ఇదివరకే మోతెలో కేసీఆర్ ప్రకటించారు కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన హన్మంత్ సింధే, గంప గోవర్ధన్‌లలో ఒకరికి కూడా ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూరల్ నుంచి బరిలో ఉన్న పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ గెలిస్తే ఏకంగా జిల్లాకు సీఎం పదవే వరించే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పరిస్థితులు మారితే కీలక మంత్రిగానైనా డీఎస్‌కు ఛాన్స్ ఉంటుందంటున్నారు. షబ్బీర్‌అలీ, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి గెలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవిస్తే వారికి కూడ ఆ మంత్రివర్గంలో పెద్దపీట ఉంటుందని ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల 16న ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.