ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రాజకీయాలపై రోజుకో ప్రకటన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. వివిధ రంగాల ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట విడత రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు వుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
కేంద్రంలో కీలక పదవుల్లో పనిచేసిన అధికారులు, సైనిక రంగంలో పనిచేసిన వారితో సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఈ భేటీలు కేవలం హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగుళూరులలో నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
మరోవైపు జాతీయస్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల నుంచి కేసీఆర్‌కు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment