విజయకాంత్‌ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం | PM Modi In Tamil Nadu: Emotional Modi Remember Captain Vijayakanth | Sakshi
Sakshi News home page

విజయకాంత్‌ను తల్చుకుని భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ

Published Tue, Jan 2 2024 2:22 PM | Last Updated on Tue, Jan 2 2024 2:42 PM

PM Modi In Tamil Nadu: Emotional Modi Remember Captain Vijayakanth - Sakshi

ఒక పార్టీ అధినేతగా.. విజయకాంత్ రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారని.. 

చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ  కెప్టెన్‌ విజయకాంత్‌ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు.  

‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం.  ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్‌ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ..  విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. 

తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్‌ను ప్రారంభించారు.

అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్‌ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్‌(71). ‘కెప్టెన్‌’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్‌ తనదైన ముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement