
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసీ బ్రిడ్జిని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జీ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం రూ. 535 కోట్లు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025
దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెనను అందుబాటులోకి వచ్చింది.శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టీకల్ లిఫ్ట్‌ను ప్రారంభించారు.
భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేశారు.

దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు..
1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్‌లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.
దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది.

వంతెన ప్రత్యేకతలు..
వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ.
పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333
సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్‌లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు.
సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్
పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు.
స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది.
ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు.
పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది.
ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే.
నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు.
2022 డిసెంబర్‌లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది.
లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్‌లో లోపాలను చూపుతుంది.
రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్‌చార్జిగా ఉన్నారు.
1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.
Delighted to be in Rameswaram on the very special day of Ram Navami. Speaking at the launch of development works aimed at strengthening connectivity and improving 'Ease of Living' for the people of Tamil Nadu. https://t.co/pWgStNEhYD
— Narendra Modi (@narendramodi) April 6, 2025