
సాక్షి,చెన్నై: అరకోణం సమీపంలో పెను రైల్వే ప్రమాదం తప్పింది. దుండగులు రైల్వే పట్టాల బోల్ట్‌లను తొలగించారు. పట్టాల బోల్టుల తొలగింపుపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.