ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్‌ | Tamilisai Soundararajan Arrested For Leading Signature Campaign In Chennai | Sakshi
Sakshi News home page

ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్‌

Mar 6 2025 1:16 PM | Updated on Mar 6 2025 1:38 PM

Tamilisai Soundararajan Arrested For Leading Signature Campaign In Chennai

తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి

చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.

నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement