signature campaign
-
ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన!
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా 100 మందికి పైగా గాయకులతో ఘంటసాల శతగళార్చన చేశారు. వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులు తో ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శతజయంతి ఉత్సవాలపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కోడలు కృష్ణ కుమారులు సంతోషం వ్యక్తం చేశారు. శ్యాం అప్పాలి బృందం నుంచి (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) నుంచి సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, ఫణి డొక్కా బృందం,దర్భా, మృదురవళి దర్భా, జయ పీసపాటి బృందం నుంచి హర్షిణీ పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా. సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం నుంచి రోహిత్ విస్సంశెట్టి ,ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డా.సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. -
ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికిభారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 130 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగుసంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి విజు చిలువేరు, మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యాఖ్యాతగా 26 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో గీతరచయిత, టాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్,SIIMA, నంది, మిర్చి మ్యూజిక్, మా మ్యూజిక్ అవార్డుల విజేత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికోసం 32 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం అని తెలిపారు. ఘంటసాల గారు గొప్ప జాతిరత్నం అని చెపుతూ, కళేజీవితంగా భావించి, ఆ కళే వృత్తిగా జీవించి, తన చివరి క్షణం వరుకు తన జన్మను కళకే అర్పించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు... గాయకుడికా పదివేల పాటలకు పైగా పాడి, 110 పైగాచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మహా కవులను గౌరవిస్తూ కుంతి విలాపమ, పుష్పవిలాపము లాంటి అరుదైన కావ్యాలను అందించి ఈ సంగీతానికి, తనను నమ్ముకున్నకళలకు, తన పూర్వజన్మ ఋణం అన్నట్లుగా ఆ కళ కోసం తన జన్మనే అర్పించారు, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో సమంజసం అని చెప్పారు. అడిలైడ్ ఆస్ట్రేలియా నుంచి ఘంటసాల శ్యామల అతిథిగా పాల్గొని వారి నాన్నగారితో చిన్ననాటి రోజులును ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతికకళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈకార్యక్రమలో పాల్గొన్న 32 దేశాల సేవలను కొనియాడారు. యూఎస్ఏ నుండి అంజయ్య చౌదరి లావు, తానా అధ్యక్షుడు, యు.యెస్.ఏ శంకరనేత్రాలయ బోర్డు సభ్యులు పార్థ చక్రవర్తి, సోమ జగదీష్, రమేష్ వల్లూరి వ్యవస్థాపక అధ్యక్షుడు, అట్లాంటా తెలుగు సంస్కృతి, శ్రీనివాస్ దుర్గం గాయకుడు, అట్లాంటా, నెదర్లాండ్స్ నుండి సురేందర్ బోడకుంట అధ్యక్షుడు నెదర్ల్యాండ్సు తెలుగు అసోసియేషన్, తైవాన్ నుండి డా. దామోదర్ జన్మంచి, అధ్యక్షుడు తైవాన్ తెలుగు అసోసియేషన్, కోలపల్లి వీఆర్ హరీష్ నాయుడు బ్యాంక్ ఆఫ్శ్రీ ఘంటసాల (స్థాపించబడింది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు నెథర్లాండ్స్, తైవాన్, స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 133 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివరాలు మీఅందరి మద్దతు కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ అడ్డ్రస్సు కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోటు కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, సీఎం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని సామాన్య జనం కోరుతున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు ఆన్ లైన్ పిటిషన్ పంపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా change.org పేరుతో ఒక పేజీని రూపొందించి సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పేజీని ప్రారంభించిన 24 గంటల్లోనే 5 వేల మందిపైగా సంతకాలు చేయడం విశేషం. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులకు ఈ పిటిషన్ పంపనున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులు తమ గళం వినిపించేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. డబ్బు, అధికారం ఉంటే కేసులు నుంచి తప్పించుకోవచ్చన్న భావన సమాజంలో ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని గళం విప్పారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని విచారణ ముందుకు సాగకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ పౌరులుగా ఇలాంటి పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఓటుకు కోట్లు కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటున్నట్టు ఆన్ లైన్ పిటిషన్ (change.org) లో పేర్కొన్నారు. దోషులను తగిన విధంగా శిక్షించాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఈ ఆన్ లైన్ పిటిషన్ పై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ సంతకాల సేకరణ ఊపందుకుంది. -
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
-
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
రంగం సిద్ధం చేసిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు సంతకాల సేకరణ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాపత్రయపడుతున్న శశికళకు, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాకులిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో మకాం వేసిన శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకమందిరంగా మార్చడానికి సంతకాల సేకరణ ఉద్యమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను శనివారం పన్నీర్‌సెల్వం ప్రారంభించారు. అంతేకాక వేదనిలయంలో ఉంటున్న శశికళను ఖాళీ చేయించాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశారు. జయలలిత తన తల్లి మీద ప్రేమతో పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి వేదనిలయంగా పేరు పెట్టుకున్నారు. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె నివాసాన్ని స్మారకమందిరంగా మార్చాలని అప్పుడే పలువురు డిమాండ్ చేశారు. కానీ ఎప్పటినుంచో జయతో కలిసి ఉంటున్న శశికళ, అమ్మ అంత్యక్రియల అనంతరం డైరెక్ట్‌గా పోయెస్ గార్డెన్‌కే వెళ్లారు. ఇక అక్కడే ఆమె నివాసం ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి చక్రం తిప్పుతున్న శశికళను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి తరిమివేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. -
సంతకాల సేకరణకు విశేష స్పందన
మొయినాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని తూర్పు రంగారెడ్డి జిల్లాలోనే కలపాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారని అఖిలపక్షం నేతలు అన్నారు. మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే పశ్చిమ రంగారెడ్డిలో కలుపొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పెద్దమంగళారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి చేపడుతున్న సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మండలాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలిపితే మండల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి అందులో మొయినాబాద్ మండలాన్ని కలిపితే మండలానికి అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందడి వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గీతావనజాక్షి, ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్, నాయకులు పద్మారావు, కృష్ణ, సంజీవరావు, వెంకటేష్, ప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మొయినాబాద్‌ను వికారాబాద్‌లో కలపొద్దు
♦ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి ♦ అఖిలపక్ష నాయకులు ♦ చిలుకూరు, అప్పోజీగూడలో సంతకాల సేకరణ మొయినాబాద్: మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని చేపడుతున్న ఉద్యమంలో మండల ప్రజలంతా భాగస్వాములు కావాలని అఖిలపక్ష నేతలు అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని చిలుకూరు, అప్పోజీగూడ గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ..జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో కలుపొద్దని.. తూర్పురంగారెడ్డి జిల్లాలో కలపాలని చేపడుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. సంతకాల సేకరణకోసం ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సంతకాలు చేసి తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కలిపితే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలగడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకే సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకరవ్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గున్నాల సంగీత, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, పెంటయ్య, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, జయవంత్, ఆండ్రూ, వెంకటేష్ పాల్గొన్నారు. -
మొయినాబాద్‌ను తూర్పులో కలపాలి
కొనసాగుతున్న సంతకాల సేకరణ అఖిలపక్షం నాయకులు మొయినాబాద్: మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటయ్యే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో కాకుండా తూర్పు రంగారెడ్డిలో కలపాలని మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మండలాన్ని పశ్చిమ జిల్లాలో కాకుండా తూర్పుజిల్లాలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్, సురంగల్ గ్రామాల్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వం మండల ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మొయినాబాద్ మండలాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలిపితే తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అన్ని గ్రామాల్లో సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్వల్లి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెకంట్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ మేకల రాంచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, పెంటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ సిడిగిద్ద కృష్ణారెడ్డి, నాయకులు క్యామ పద్మనాభం, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఈగ రవీందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, మెట్టు పెంటయ్య, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. -
మెట్రో స్టేషన్ల వద్ద ఆప్ సంతకాల సేకరణ
న్యూఢిల్లీ: నగరంలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలు సంతకాలను సేకరించారు. ఢిల్లీ విధానసభకు తాజాగా ఎన్నికలు జరపాలంటూ ఆప్ కొద్దిరోజులుగా నగరవాసుల వద్దనుంచి సంతకాలను సేకరిస్తున్న సంగతి విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా స్టేషన్ల వద్ద హోర్డింగ్‌లను ఏర్పాటుచేసిన ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రయాణికుల వద్ద సంతకాలను సేకరించారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
తాజా ఎన్నికల కోసం నేటినుంచి నగరవ్యాప్తంగా సంతకాల ఉద్యమం
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభకు తాజాగా ఎన్నికలు జరపాలనే డిమాండ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం నుంచి నగరవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. పత్పర్గంజ్ నియోజకవర్గంలో ప్రారంభమవనున్న ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, ఢిల్లీ కన్వీనర్ ఆశుతోశ్, రాష్ర్ట శాఖ కార్యదర్శి దిలీప్ పాండే తదితరులు పాల్గొననున్నారు. మరో పక్షం రోజులనాటికల్లా నగరంలోని 70 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల అవసరమేమిటో తెలియజేసేవిధంగా ఆప్ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ సందేశంతో కూడిన ఫారాలను నగరవాసులకు ఈ సందర్భంగా అందజేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అర్వింద్ కేజ్రీవాల్... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈ కార్యక్రమం పేరిట ప్రజలకు మరింత చేరువ కావాలనేది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇటువంటి కార్యక్రమాలకు ఆ పార్టీ దూరంగా ఉండిపోయింది. ఏదిఏమైనప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించినమేర ఫలితాలను సాధించడంలో విఫలమయింది. మరోవైపు తమ పార్టీకి గల ప్రజాదరణను చాటుకునేందుకుగాను ఈ నెల మూడో తేదీన జంతర్‌మంతర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన కేజ్రీవాల్.. ఢిల్లీ శాసనసభకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు ప్రకటించారు. లేకపోతే సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుడతామంటూ హెచ్చరించిన సంగతి విదితమే. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యపడ లేదు.