న్యూఢిల్లీ: నగరంలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలు సంతకాలను సేకరించారు. ఢిల్లీ విధానసభకు తాజాగా ఎన్నికలు జరపాలంటూ ఆప్ కొద్దిరోజులుగా నగరవాసుల వద్దనుంచి సంతకాలను సేకరిస్తున్న సంగతి విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా స్టేషన్ల వద్ద హోర్డింగ్‌లను ఏర్పాటుచేసిన ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రయాణికుల వద్ద సంతకాలను సేకరించారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.
అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.
ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మెట్రో స్టేషన్ల వద్ద ఆప్ సంతకాల సేకరణ
Published Mon, Aug 18 2014 10:25 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement