సంతకాల సేకరణకు విశేష స్పందన
మొయినాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని తూర్పు రంగారెడ్డి జిల్లాలోనే కలపాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారని అఖిలపక్షం నేతలు అన్నారు. మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే పశ్చిమ రంగారెడ్డిలో కలుపొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పెద్దమంగళారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి చేపడుతున్న సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మండలాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలిపితే మండల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి అందులో మొయినాబాద్ మండలాన్ని కలిపితే మండలానికి అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందడి వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గీతావనజాక్షి, ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్, నాయకులు పద్మారావు, కృష్ణ, సంజీవరావు, వెంకటేష్, ప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.