అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికిభారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 130 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగుసంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి విజు చిలువేరు, మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యాఖ్యాతగా 26 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో గీతరచయిత, టాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్,SIIMA, నంది, మిర్చి మ్యూజిక్, మా మ్యూజిక్ అవార్డుల విజేత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికోసం 32 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం అని తెలిపారు.
ఘంటసాల గారు గొప్ప జాతిరత్నం అని చెపుతూ, కళేజీవితంగా భావించి, ఆ కళే వృత్తిగా జీవించి, తన చివరి క్షణం వరుకు తన జన్మను కళకే అర్పించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు... గాయకుడికా పదివేల పాటలకు పైగా పాడి, 110 పైగాచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మహా కవులను గౌరవిస్తూ కుంతి విలాపమ, పుష్పవిలాపము లాంటి అరుదైన కావ్యాలను అందించి ఈ సంగీతానికి, తనను నమ్ముకున్నకళలకు, తన పూర్వజన్మ ఋణం అన్నట్లుగా ఆ కళ కోసం తన జన్మనే అర్పించారు, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో సమంజసం అని చెప్పారు.
అడిలైడ్ ఆస్ట్రేలియా నుంచి ఘంటసాల శ్యామల అతిథిగా పాల్గొని వారి నాన్నగారితో చిన్ననాటి రోజులును ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతికకళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈకార్యక్రమలో పాల్గొన్న 32 దేశాల సేవలను కొనియాడారు.
యూఎస్‌ఏ నుండి అంజయ్య చౌదరి లావు, తానా అధ్యక్షుడు, యు.యెస్.ఏ శంకరనేత్రాలయ బోర్డు సభ్యులు పార్థ చక్రవర్తి, సోమ జగదీష్, రమేష్ వల్లూరి వ్యవస్థాపక అధ్యక్షుడు, అట్లాంటా తెలుగు సంస్కృతి, శ్రీనివాస్ దుర్గం గాయకుడు, అట్లాంటా, నెదర్లాండ్స్ నుండి సురేందర్ బోడకుంట అధ్యక్షుడు నెదర్ల్యాండ్సు తెలుగు అసోసియేషన్, తైవాన్ నుండి డా. దామోదర్ జన్మంచి, అధ్యక్షుడు తైవాన్ తెలుగు అసోసియేషన్, కోలపల్లి వీఆర్ హరీష్ నాయుడు బ్యాంక్ ఆఫ్శ్రీ ఘంటసాల (స్థాపించబడింది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు నెథర్లాండ్స్, తైవాన్, స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 133 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు.
ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివరాలు మీఅందరి మద్దతు కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru
ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ అడ్డ్రస్సు కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు.
Comments
Please login to add a commentAdd a comment