all-party
-
అది టీఆర్ఎస్ రాజకీయం కోసమే!
- జీవో 39 అప్రజాస్వామికం.. ఉపసంహరించుకునే దాకా పోరాటం: అఖిలపక్షం - 14న గవర్నర్‌కు వినతిపత్రం.. 15న ధర్నా - అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు - టీజేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీలో తీర్మానం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పాలనా వ్యవస్థలను, స్థానిక సంస్థలను ధ్వంసం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 39 అప్రజాస్వామికమని అఖిలపక్షం మండిపడింది. దాన్ని ఉప సంహరించుకునేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్‌లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన అఖి లపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), కె.లక్ష్మణ్ (బీజేపీ), ఎల్.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), కె.గోవర్ధన్ (న్యూడెమో క్రసీ), ప్రతాపరెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం, భైరి రమేశ్, సారంగపాణి, వివిధ రైతు, ప్రజా సంఘాల నేతలు, ఆయా పార్టీల నేతలు, రైతు విభాగాల అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారు. రైతులను బందీ చేసే కుట్ర గ్రామీణ వ్యవస్థలను ధ్వంసం చేయాలని, టీఆర్ఎస్ కార్యకర్తలతో రైతులను బందీలుగా చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం జీవో 39ను తెచ్చిందని కోదండరాం మండిపడ్డారు. దానిని రద్దు చేసేదాకా పోరాడుతామన్నారు. ఈ నెల 14న గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామని, 15న వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట« నిరసన దీక్ష చేపడతా మని వెల్లడించారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తం గా గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఇక అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి అఖిలపక్షా లు నిర్ణయించాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల రైతు విభాగాలు, రైతు సంఘాలతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామ ని.. వీటిని నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అవి టీఆర్ఎస్ కమిటీలు ప్రజల సొమ్మును టీఆర్ఎస్ నాయకులతో పంపిణీ చేయడానికే ప్రభుత్వం ఈ కమిటీల ను వేస్తోందని, అవి టీఆర్ఎస్ కమిటీలేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. ఆ కమిటీలకు ప్రత్యామ్నాయంగా రైతులతో కమిటీలు వేస్తామని, అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ నేతలతో రైతు సమితులు ఏర్పాటు చేస్తు న్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ విమర్శిం చారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌కు ఇచ్చే ఖర్చులాగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం, నిబంధనలను పట్టించుకోకుండా జీవోలు తెస్తున్న అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధిపై అన్ని పార్టీలు, సంఘాలతో చర్చిస్తామన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. -
హైదరాబాద్ వెలుపల అభివృద్ధిపై అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కాకుండా శివార్లలో నలుదిక్కులా కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటు మహబూబ్‌నగర్, అటు వరంగల్, కరీంనగర్.. ఇలా పలుదిక్కుల వివిధ రకా లుగా పురోగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. నగరం చుట్టూ విస్తరించిన ఔటర్ రింగురోడ్డు–కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు మధ్య, రీజినల్ రింగురోడ్డు అవతల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఫార్మాసిటీ, ఐటీ కారిడార్, టెక్స్టైల్ పార్కు.. ఇలా పలు ఉపాధి రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు శుక్రవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. వీటి సమగ్ర వివరాలను అన్ని పక్షా లకు అందించే ఉద్దేశంతో త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఫార్మా కాలుష్యం తగ్గాలి హైవే మీదుగా వెళ్తుంటే ఎక్కడ ఘాటైన వాసన వస్తే అక్కడ ఫార్మా కంపెనీ ఉన్నట్టు ఇట్టే అర్థమవుతుందని సీఎం అన్నారు. ఆ రకమైన కాలుష్యం లేకుండా చూడాల్సిన అవసర ముందని ఆయన చెప్పారు. 10వేల కోట్లతో టెక్స్టైల్ పార్కు: కేటీఆర్ వరంగల్‌లో 1,200 ఎకరాల్లో రూ.10 వేల కోట్ల వ్యయంతో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఫైబర్ టూ ఫ్యాబ్రిక్‌గా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తాం. ఇది 2018లో అందుబాటులోకి వస్తుంది. త్వరలో శంకుస్థాపన ఉంటుంది. వరంగల్ రూరల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ చేరువలో రూ.270 కోట్లతో లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు. -
పెద్ద నోట్ల రద్దుపై నిరసన
అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు దహనం నిజామాబాద్ : పెద్ద నోట్ల చెలామణి రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగారుు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ వంటి పట్టణాలతోపాటు పలు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగారుు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నేతలు కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగారుు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) తదితర పార్టీలు, అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని స్థానిక గాంధీచౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నిజాంసాగర్ కాలువ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. నందిపేట్‌లో బస్టాండ్ ఎదుట ర్యాలీ, ధర్నా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మాక్లూర్ మండలంలో సీపీఎం(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, మోదీ బొమ్మను దగ్ధం చేసారు. బోధన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వర్ని మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్ష నేతలు ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కోటగిరి మండలంలో ర్యాలీ జరిగింది. డిచ్‌పల్లిలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో, సిరికొండలో న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. మోర్తాడ్‌లో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో 64వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. -
రోడ్డుపై రాస్తారోకో, ధర్నా, వంటావార్పు
- పాలమూరులో కలిపే వరకు ఉద్యమం ఆగదంటున్న అఖిలపక్ష నాయకులు దౌల్తాబాద్: పాలమూరు జిల్లాలో దౌల్తాబాద్ మండలాన్ని కలిపే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన నేపథ్యంలో దౌల్తాబాద్ మండలాన్ని వికారబాద్ జిల్లాలో కలపడం పట్ల మండల అఖిలపక్ష నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామల్లో నిరసనలు చేపట్టారు. గోకఫసల్వాద్ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకోతో పాటు వంటావార్పులు చేపట్టారు. తిమ్మారెడ్డిపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలో ఉదయం 11గంటల నుంచి మండలంలోని అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులతో నారాయణపేట-కొడంగల్ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. 60కి.మీ దూరంలో ఉన్న పాలమూరును వదిలి ఎక్కడో 90కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి గుట్టల్లో మండలాన్ని కలపడం అన్యాయమన్నారు. అయితే రాత్రికి రాత్రి మండలాన్ని వికారాబాద్‌లో కలిపిన నాయకులకు పుట్టగతులుండవని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మహిపాల్‌రెడ్డి, కూరవెంకటయ్య, రెడ్డిశ్రీనివాస్, భీములు, సతీష్, రాజు, తదితరులున్నారు. -
కదం తొక్కిన ములుగు
• ములుగు జిల్లా కోసం ఆందోళనలు • అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో • రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు ములుగు : ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా.. ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడం తో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసు లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ స భ్యుడు పోరిక గోవింద్‌నాయక్ మాట్లాడు తూ తనతో పాటు టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్ సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వినర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమం లో మేడారం ట్రస్ట్ బోర్డు తాత్కాలిక చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామితో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, సర్పం చ్‌లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్, లాల్‌పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, మధు, కోటేశ్వర్రావు పాల్గొన్నారు. సీఎం, మంత్రికి పిండప్రదానం ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పోరిక రాజునాయక్ గుండు గీయించుకుని సీఎం కేసీఆర్, మంత్రి చందూలాల్‌కు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని నాయకులతో మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని తమకు సమయం ఇవ్వాలని నాయకులు కోరడంతో వెనక్కి వచ్చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, ఎంపీటీసీ రాజు, సర్పంచ్ రహీంపాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మేమంతా మీ వెంటే..
-
మేమంతా మీ వెంటే..
♦ కేంద్రానికి అఖిలపక్ష మద్దతు ♦ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాం ♦ ఆర్మీపై అభినందనల వెల్లువ న్యూఢిల్లీ: పాకిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి మద్దతు ఉంటుందని అఖిలపక్షం తెలిపింది. ఉడీ ఘటనకు ప్రతీకారంగా జరిపిన ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులను ప్రశంసించింది. కేంద్ర హో మంత్రి రాజ్‌నాథ్ నాయకత్వంలో గురువారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది. సర్జికల్ దాడుల విధానాన్ని కేంద్రం వివరించింది. కుప్వారా, పూంచ్ సెక్టార్ల వెంబడి ఎల్వోసీలో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేశామని.. డీజీఎంవో(డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ అఖిలపక్ష సభ్యులకు తెలిపారు. భేటీ అనంతరం సమాచార మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ. నిఘా నివేదికల ప్రకారం భారత్‌లో దాడులకు, చొరబాట్లకు ప్రయత్నించటంతోనే ఈ దాడులు జరిపామన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. భేటీకి గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), ఏచూరి (సీపీఎం), శరద్ పవార్ (ఎన్సీపీ), బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సీఎంలతో మాట్లాడిన రాజ్‌నాథ్.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, బిహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల సీఎంలతోపాటు మాజీ ప్రధాని దేవెగౌడ, విపక్ష నేతలతో హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడి దాడుల గురించి చెప్పారు.అంతకుముందు ప్రధాని నేతృత్వంలో భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది జాతీయ భద్రత సలహాదారు దోవల్, డీజీఎంవో రణ్‌బీర్ కూడా హాజరయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షించిన మోదీ అనంతరం.. రాాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లకు సర్జికల్ దాడుల వివరాలను ఫోన్లో తెలిపారు. -
ఎన్నికల సంస్కరణలపై అఖిలపక్షం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం డిమాండ్ సాక్షి, హైద రాబాద్: దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ నిజంగా పట్టుదలతో ఉంటే వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాంతరంగా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణల ప్రక్రియను ప్రారంభించాలని, పార్లమెంట్ కూడా ప్రత్యేక స్థాయి సంఘం ద్వారా చర్చించి అవసరమైన సిఫార్సులు చేయాలన్నారు. ఈ ప్రక్రియ అంతటికీ నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నికల సంస్కరణలు, డబ్బు నిర్వహించే పాత్రపై కేరళలోని కోజికోడ్‌లో మోదీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. వెంటనే ఎన్నికల సంస్కరణలను చేపట్టాలని సీపీఐ, ఇతర వామపక్షాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంస్కరణల్లో భాగంగా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అనేది భారత్‌కు సంబంధించి అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, పాత్రను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్
రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం అఖిలపక్షం నేతలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
చర్చలతోనే పరిష్కారం
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం కావాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం సూచించింది. రెండ్రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన బృందం సభ్యులు సమావేశమయ్యారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనే చర్యలతోపాటు.. ప్రజల్లో విశ్వాసం కల్పించేలా కార్యాచరణ ప్రారంభించాలని సభ్యులు సూచించారు. దీంతోపాటు పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కూడా పలువురు సభ్యులు తెలిపారు. కశ్మీరీ ప్రజలు కూడా హింసను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి హింసకు తావుండకూడదని.. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తున్నట్లు తాము విశ్వస్తిన్నామన్నారు. దీనిపై అఖిలపక్షానికి నాయకత్వం వహించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. లోయలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు భారత సార్వభౌమత్వానికి ఇబ్బంది కలగకుండానే చర్యలు చేపడతామన్నారు. సమావేశం తీర్మానాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలు జరపాలని అఖిలపక్షం చేసిన సూచనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే.. హురియత్ నేతల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కాగా, సమావేశంలో అన్ని పక్షాలు చర్చల విషయంపై ఏకాభిప్రాయానికి రాగా.. వామపక్ష పార్టీలు మాత్రం పాకిస్తాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని ప్రతిపాదించాయి. కాగా, కశ్మీర్లో పరిస్థితిని అదుపుచేయటంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మజ్లిస్ ఎంపీ ఒవైసీ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేని నిజనిర్ధారణ కమిటీని మరోసారి కశ్మీర్‌కు పంపి ప్రజలతో మాట్లాడిస్తే.. సమస్యకు పరిష్కారం దొరకొచ్చన్నారు. కొండను తవ్వి.. కశ్మీర్లో అఖిలపక్షం పర్యటించటం ద్వారా లాభమేమీ జరగలేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో అఖిలపక్షం పర్యటన ద్వారా ఒక చిన్న మంచి విషయాన్ని కూడా సాధించినట్లు నాకు అనిపించటం లేదు. వివిధ పార్టీలు కశ్మీర్‌కు రాకుండా కూడా ఓ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు. అనవసరంగా అక్కడ పర్యటన పేరుతో డబ్బులు, సమయం వృథా అయ్యేవి కావు’ అని ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్యకు భాగస్వామ్య పక్షాల(వేర్పాటువాదులు)తో సమావేశం కావటం కీలకమైన పరిణామమని సీపీఎం నేత తరిగామి తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే సీనియర్ ఎంపీలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కశ్మీర్లో మళ్లీ అల్లర్లు.. అఖిలపక్షం పర్యటన సందర్భంగా రెండ్రోజుల పాటు శాంతిగా కనిపించిన లోయలో మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజా గొడవల్లో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కశ్మీర్లో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. శ్రీనగర్ తప్ప మిగిలిన ప్రాంతాల్లోనే గొడవలు జరిగాయి. కాగా, శ్రీనగర్‌లో సాయంత్రం ఆరునుంచి 12 గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేశారు. -
నేటి నుంచి కశ్మీర్లో అఖిలపక్షం
-
నేటి నుంచి కశ్మీర్లో అఖిలపక్షం
వేర్పాటువాదులను చర్చలకు ఆహ్వానించిన మెహబూబా సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆదివారం నుంచి రెండ్రోజులపాటు అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు కేంద్రమంత్రులు అనంత్ కుమార్, జితేంద్ర సింగ్, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి, పలు రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం చర్చలు జరుపనుంది. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ సింగ్ తో పాటుగా కేంద్ర మంత్రులు జైట్లీ, రాం విలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరీ (సీపీఎం), డి.రాజా (సీపీఐ), శరద్ యాదవ్ (జేడీయూ), సౌగత రాయ్ (టీఎంసీ), తారీఖ్ అన్వర్ (ఎన్సీపీ), సంజయ్ రావత్ (శివసేన), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), ప్రేమ్ సింగ్ (అకాలీదళ్), దిలీప్ తిర్కే (బీజేడీ), అహ్మద్ (ముస్లిం లీగ్), తోట నరసింహం (టీడీపీ), ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్ఎస్), పి. వేణుగోపాల్ (ఏఐఏడీఎంకే), ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ), తిరుచి శివ (డీఎంకే) తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ తరపున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కశ్మీర్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల బృందంతో వెళ్లటం లేదు. అయితే కశ్మీర్‌పై కేంద్రం చేప ట్టే చర్యలకు తమ మద్దతుంటుందని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. కశ్మీర్ పర్యటను దూరంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు కూడా కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని వెల్లడించాయి. కాగా, ఢిల్లీ అఖి లపక్షంతో చర్చించేందుకు రావాలంటూ వేర్పాటువాద నేతలకు జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ లేఖరాశారు. -
రేపు కశ్మీర్‌కు అఖిలపక్షం
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 4, 5 తేదీల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రితో బృందం చర్చలు జరుపుతుంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర వర్గాలతో శ్రీనగర్‌లో చర్చిస్తుంది. మొత్తం 30 మంది సభ్యుల బృందంలో 20కి పైగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. మరోవైపు అఖిలపక్ష బృందంతో చర్చల్లో పాల్గొనవద్దని హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాతో పాటు అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్, బారాముల్లా, పట్టాన్ల్లో కర్ఫ్యూ విధించారు. 35 చోట్ల రాళ్ల దాడి వంటి సంఘటనలు జరిగాయని పోలీసులు చెప్పారు. శ్రీనగర్ శివారులో ఏడో తరగతి చదువుతున్న డానిష్ సుల్తాన్ స్నేహితులతో కలిసి అల్లర్లలో పాల్గొనగా పోలీసులు వారిని వెంటతరిమారు. తప్పించుకునేందుకు ఆ బాలుడు జీలం నదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అల్లర్ల మృతుల సంఖ్య 70కి పెరిగింది. మరోవైపు పాక్ దళాలు సరిహద్దు రేఖ వెంట అక్నూర్ సెక్టార్లో కాల్పులకు తెగబడ్డాయి. -
సంతకాల సేకరణకు విశేష స్పందన
మొయినాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని తూర్పు రంగారెడ్డి జిల్లాలోనే కలపాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారని అఖిలపక్షం నేతలు అన్నారు. మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే పశ్చిమ రంగారెడ్డిలో కలుపొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పెద్దమంగళారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి చేపడుతున్న సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మండలాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలిపితే మండల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి అందులో మొయినాబాద్ మండలాన్ని కలిపితే మండలానికి అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందడి వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గీతావనజాక్షి, ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్, నాయకులు పద్మారావు, కృష్ణ, సంజీవరావు, వెంకటేష్, ప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి
కేంద్రసహకార బ్యాంకు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రామాయంపేట: రైతు రుణమాఫీని ఒకేసారి చేపట్టి కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధర్యంలో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, టీటీడీపీ, బీజేపీ కార్యకర్తలు బ్యాంకు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈసందర్భగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాపు యాదగిరి, బీజేపీ జిల్లా నాయకుడు వెల్ముల సిద్దరాంలు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులపాలవుతున్నారన్నారు. ఇప్పటివరకు మూడో విడత రుణమాఫీ నిధులు మంజూరు కాకపోడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సుధాకర్‌రెడ్డి, రఘుపతిగౌడ్, శీలం క్రిష్ణారెడ్డి, చింతల క్రిష్ణ, చింతల శ్రీనివాస్, ఎనిశెట్టి అశోక్, నవాత్ నగేశ్, రమేశ్‌రెడ్డి, హస్నొద్దీన్, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధే మా ధ్యేయం
అఖిలపక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం దేశ అభివృద్ధికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటీవలి పరిణామాలపై పార్లమెంటులో లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య ఉభయ సభలకు చెందిన వివిధ పార్టీల నేతలకు హామీ ఇచ్చారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూ సంఘటనలు, రిజర్వేషన్ల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన బిల్లులైన జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ బిల్లుల ఆమోదంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే తాము లేవనెత్తే అంశాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి కోరారు. పంచాయతీ రాజ్ వ్యవహారాలపై రాజ్యసభ కమిటీని రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా కేశవరావు(టీఆర్ఎస్), గరికపాటి మోహన్‌రావు(టీడీపీ), జైరాం రమేశ్(కాంగ్రెస్)లను నామినేట్ చేశారు. ప్రతిపాదించిన ఎజెండా.. 25న ప్రశ్నోత్తరాలు ముగిశాక రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు.29న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. చర్చ, ఆమోదానికి ఉన్న బిల్లులు.. ► ఆర్థిక బిల్లు, 2016. 8 ఎనిమీ సంపత్తి(సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు.(ఆర్డినెన్స్ స్థానంలో). 8ది రీజనల్ సెంటర్ ఫర్ బయో-టెక్నాలజీ బిల్లు.8ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు, 2016 లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నవి.. ► లోక్‌పాల్, లోకాయుక్త, సంబంధిత ఇతర చట్టాలు(సవరణ) బిల్లు, 2014 లోక్‌సభ ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నవి ► రాజ్యాంగ(నూటా ఇరవై రెండో సవరణ) బిల్లు, 2014-(జీఎస్టీ బిల్లు) ► ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిల్లు, 2015. 8 పరిశ్రమల(అభివృద్ధి, నియంత్రణ) బిల్లు, 2015 ► వినియోగ చట్టాలు(రద్దు) బిల్లు, 2015 ► జాతీయ జల మార్గాల బిల్లు, 2015 ► విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు ► హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సర్వీసు షరతులు) సవరణ బిల్లు, 2015 రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ► రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2013 ► హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, 2014 కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులు ► రాజ్యాంగ(షెడ్యూలు కులాలు) ఉత్తర్వులు(సవరణ) బిల్లు.8 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు. -
అంత తొందరెందుకు?
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ భవనాలను శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు నిలబడేలా చేపట్టాల్సిందిగా పలువురు నేతలు సూచించారు. హడావుడిగా నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకునే అవకాశం ఉండగా తొందరపాటు ఎందుకనే అభిప్రాయం వ్యక్తమైంది. హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెప్పారు. తాత్కాలిక నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం తన చాంబర్లో వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతల సమావేశం నిర్వహించారు. శాసనసభాపక్ష నేతలు ఎవరూ హాజరుకాలేదు. మండలి చైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మండలిలో వివిధపక్షాల నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), విఠాపు బాలసుబ్రహ్మణ్యం (పీడీఎఫ్), పీజే చంద్రశేఖర్ (సీపీఐ), శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, అధికారులు, శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ ఏపీ పరిపాలనా యంత్రాంగం కొత్త రాజధానికి తరలిపోతున్న నేపథ్యంలో శీతాకాల సమావే శాలు అక్కడ నిర్వహించుకుంటే శాసనసభ కూడా తరలివస్తోందని ప్రజల్లోకి సందేశం పంపినట్లు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారని చెప్పారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటే ఇప్పుడే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని, కేవలం ఐదురోజుల సమావేశాల కోసం హడావుడిగా నిర్మాణాలు చేపట్టడం సరికాదని చెప్పారు. శీతాకాల, వచ్చే బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని, ఈలోగా కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలు పూర్తయ్యేవరకు ఉండేలా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సమావేశం అనంతరం స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆమోదానికి లోబడి సభ నిర్వహణపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. అఖిలపక్షం ఆమోదం: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహణకు అఖిలపక్షం ఆమోదం తెలిపిందని స్పీక ర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాభీష్టం మేరకు సమావేశాలు ఏపీ భూభాగంలో నిర్వహిస్తే బాగుంటుందన్న సభాపతి సూచనకు రాజకీయపక్షాలు తమ అంగీకారాన్ని తెలిపాయని పేర్కొంది. -
హోదా కోసం అఖిలపక్షం అవసరం లేదు
రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నపుడు డెడ్లైన్లు సరికాదు: సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ తయారు చేస్తున్న ఈ సమయంలో డెడ్లైన్లు పెట్టడం సరికాదన్నారు. అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిన అనంతరం బుధవారం శాసనసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15 నుంచి చేస్తానంటున్న నిరవధిక నిరాహారదీక్షలో చిత్తశుద్ధి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని రాజకీయం చేయాలని ప్రతిపక్షం చూస్తోందన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకించారని, ఇపుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న సీఎం.. సాగునీటి ప్రాజెక్టుల వంటి మంచి అంశాలను రాజకీ యం చేయటం సరికాదన్నారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు. జగన్ సొంతూరుకు కూడా నీరందిస్తాం, అపుడు ఏం చెప్తారు, మేం వద్దన్నా నీరిచ్చారని చెప్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సాహసించలే ని వ్యక్తి ఏం సాధిస్తారని అన్నారు. సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న బలమైన మంచి వ్యక్తులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఈదర మోహన్ టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రసంగించారు. -
అట్టుడికిన కలెక్టరేట్
- అఖిల పక్షం ఆధ్వర్యంలో ముట్టడి విజయవంతం - నాయకులను అరెస్టు చేసిన పోలీసులు - కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు అనంతపురం: మున్సిపల్ కార్మికులను కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ముట్డడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఆందోళనలో పాల్గొనడంతో కలెక్టరేట్ కార్యాలయం అట్టుడికిపోయింది. సీఐలు శుభకుమార్, రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐలు కె. వెంకటరమణ, నాగమధు, క్రాంతికుమార్, రఫీక్, జీటీ నాయుడు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడి సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఆందోళనకారులు కలెక్టరేట్ గేటును తోసుకుని కార్యాలయంలోకి చొచ్చుకుపోయి.. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముట్టడి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సీపీఐ నాయకులు జాఫర్, ఏఐటీయూసి నాయకులు కె.రాజారెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఓబుళ, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాంభూపాల్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఆందోళనకారులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డౌన్..డౌన్.. మంత్రి నారాయణ ఖబర్దార్ అంటూ.. నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూవజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.రాజీవ్‌రెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి, సీపీఎం కార్పొరేటర్ భూలక్ష్మి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనరాజారెడ్డి, వైఎస్సార్సీపీ లారీ అసోసియేషన్ నాయకలు రంగ, విశ్వనాథ్‌రెడ్డి, పీరా, జేఎం బాషా, రిలాక్స్ నాగరాజు, భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు గౌసుల లక్ష్మన్న, నారాయణస్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బీసీఆర్ దాస్, మున్సిపల్ కార్మిక జేఏసీ నాయకలు గోపాల్, పెన్నోబులేసు, నరసింహులు, పెద్దన్న, ఆటో యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, సీపీఎం నాయకులు వలి, రాంరెడ్డి, నాగరాజు, నల్లప్ప, కే.వీరన్న, వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను అడ్డుకుంటున్నారు
ఏపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు అఖిలపక్షం ఫిర్యాదు వాస్తవాలను కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్లాలని వినతి హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) నీటి హక్కులను కాలరాసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణి ఉందని ఆ జిల్లా అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో తమ జిల్లాకు లభించే న్యాయమైన హక్కు లకు భంగం కలిగించేలా పాల మూరు, డిండీ ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించినా, తదుపరి వీటి నిర్మాణాలపై శ్రద్ధ చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని చేపట్టేందుకు ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. అపెక్స్ కౌన్సెల్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాల మూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా అఖిలపక్ష నేతలు సోమవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎడ్మా కిష్టారెడ్డి (వైఎస్సార్ సీపీ), బీజేపీ నేతలు నాగూరావ్ నామాజీ, ఆచారి, బాల నరసింహులు (సీపీఐ), జబ్బర్ (సీపీఎం), శ్యాంసుందర్‌రెడ్డి, నారాయణరావు (లోక్‌సత్తా) గవర్నర్‌ను కలసి నాలుగు పేజీల వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టులు లేకే వలసలు కృష్ణాలో 70 టీఎంసీలతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72 , 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండీ ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న ఇచ్చిన జీవో 159 లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని నేతలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. కరువు ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలకు ఈ రెండు ప్రాజెక్టులు అత్యవసరమని వివరించారు. జిల్లాలోని ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటే కేవలం 10 వేల ఎకరాలకే నీరందుతోందని, సీమాంధ్ర నేతలు తుంగభద్ర నీటిని తరలించుకుపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే పాలమూరు ప్రజలు వలస బాట పడుతున్నారని తెలిపారు. -
మహోద్యమం
కావేరి నదీ జలాల్ని అడ్డుకునేందుకు కర్ణాటక చేస్తున్న కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా రాష్ట్రంలో మహోద్యమానికి అఖిల పక్షం నిర్ణయించింది. 28న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. శనివారం చెన్నైలో జరిగిన అఖిల పక్షం భేటీకి అన్నాడీఎంకే డుమ్మా కొట్టింది. కర్ణాటక చర్యలకు కళ్ల్లెం వేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖాస్త్రంతో సరి పెట్టారు. సాక్షి, చెన్నై : తమిళనాడు-కర్ణాటక మధ్య ఏళ్ల తరబడి కావేరి నదీ జలాలపై వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఎట్టకేలకు ట్రిబ్యునల్‌లో తమిళనాడుకు అను కూలంగా తీర్పు రావడంతో ఆ జలాలమీద ఆధార పడ్డ డెల్టా అన్నదాతల్లో ఆనందం వికసించింది. అయితే, కేంద్రంలోని పాలకులు ఆ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి మండలి, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో మెతక వైఖరి అనుసరిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కర్ణాటక సర్కారు కొత్త ఎత్తుకు సిద్ధ పడింది. తమిళనాడు సరిహద్దుల్లోని తమ రాష్ట్ర భూ భాగం మేఘదాతులో రెండు చిన్న సైజు డ్యాముల్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఈ డ్యాముల్ని నిర్మించిన పక్షంలో తమిళనాడులోకి కావేరి జలాలు ఒక్క బొట్టుకూడా వచ్చే అవకాశాలు లేదు. దీంతో కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ అన్నదాతలు ఉద్యమాన్ని సాగిస్తూ వస్తున్నారు. అయినా కేంద్రంలోని పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. తమతో కలసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేతులు కలపాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. మహోద్యమంతో అటు కేంద్రం, ఇటు కర్ణాటక పాలకుల నడ్డి విరవడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అఖిల పక్షం భేటీ: రైతు సంఘాలు ఇచ్చిన పిలుపునకు సర్వత్రా స్పందించారు. శనివారం చెన్నైలోని అమిర్ మహల్ సమీపంలోని ఎంఎస్ మహల్లో అఖిల పక్షం భేటీ జరిగింది. డీఎంకే తరపున టీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే తరపున బాల అరుల్ సెల్వన్, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ తరపున బలరామన్, పీఎంకే తరపున అరంగ వేలు, ఎండీఎంకే తరపున మల్లై సత్య, బీజేపీ తరపున తమిళిసై సౌందరరాజన్, వీసీకే తరపున తిరుమావళవన్, ఎస్ఎంకే తరపున ఎర్నావూర్ నారాయణన్, ఎంఎంకే తరపున జవహరుల్లా, ముస్లిం లీగ్ తరపున మహ్మద్, ఐజేకే తరపున రాజేంద్రన్‌లతో పాటుగా చిన్న పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వర్తక, కార్మిక సంఘాల నాయకులు తరలి వచ్చి రైతు సంఘాలకు అండగా నిలబడ్డారు. అఖిల పక్షం భేటీకి అందరూ తరలి వచ్చినా అధికార అన్నాడీఎంకే మాత్రం డుమ్మా కొట్టింది. అదే సమయంలో కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖాస్త్రం సంధించడం గమనార్హం. బంద్‌కు పిలుపు: రైతు సంఘాల సమన్వయ కర్త పీకే పాండియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా మహోద్యమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. అఖిలపక్షంలోని అన్ని పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తీర్మానించారు. ఈనెల 28న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇక, కావేరి డెల్టా తీరంలో మిథైన్ తవ్వకాల ప్రాజెక్టును ఉపసంహరించుకుంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని ఈ అఖిల పక్షం భేటీలో ఆహ్వానించారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, కావేరి హక్కుల పరిరక్షణకు సహకరించాలని విన్నవించారు. ఇక, ఈ అఖిల పక్షంకు అన్నాడీఎంకే డుమ్మా కొట్టిన దృష్ట్యా, రాష్ట్రంలో బంద్ సజావుగా సాగేనా అన్నది అనుమానమే. -
భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించాలి
వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధాని నిర్మాణం సరికాదు హేతుబద్ధత లేకుండా వ్యవహరిస్తే సింగూర్ తరహా ఉద్యమాలు ‘ఏపీ రాజధాని-భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ భేటీలో డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించకుండా, రైతుల్లో అపోహలు తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అన్నారు. రాష్ట్ర పరిస్థితులు, వనరులు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలన్నారు. వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధానిని నిర్మిస్తామనడం క్షంతవ్యం కాదన్నారు. బ్లూ ప్రింట్ సమర్పించి కేంద్ర సాయాన్ని కోరకుండా ప్రభుత్వ పెద్దలు సింగపూర్, జపాన్ పర్యటనలు చేపట్టటాన్ని వక్తలు తప్పుపట్టారు. హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయమైన విధానంలో భూ సమీకరణ చేపడితే సింగూర్ భూముల తరహా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని- భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి దీనికి అధ్యక్షత వహించగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. రైతులకనుకూలంగానే సుప్రీం తీర్పులు... ఏపీ రాజధాని ఎలా ఉండాలనే అంశంపై శివరామకృష్ణన్ కమిటీని నియమించినప్పుడు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. నదీ జలాల చెంత నిర్మాణాలు జరపరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నదీ ముఖ రాజధాని అనటం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర రాజధానికి భూ సమీకరణపై రైతుల్లో పలు అభిప్రాయాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకే జపాన్, సింగపూర్ పర్యటనలని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. ల్యాండ్‌పూలింగ్‌లో రైతుల నుంచి సేకరించిన భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేడానికేన్న అనుమానం వ్యక్తం చేశారు. సొంత ఇంటి నిర్మాణం కాదు: వాసిరెడ్డి భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు శుష్క వాగ్దానాలు చేస్తోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం అంటే సొంత ఇంటి నిర్మాణం కాదన్నారు. వేల ఎకరాలు ఎక్కడా తీసుకోలేదు: కాంగ్రెస్ 28 రాష్ట్రాల్లో ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించలేదని, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ విస్తీర్ణమే 25.9 చదరపు కిలోమీటర్లని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇవ్వకుంటే ‘గ్రీన్‌బెల్ట్’ కిందకే! సమీకరణకు అంగీకరించని రైతులను బలవం తం చేయరని, ఆ భూముల్ని గ్రీన్‌బెల్ట్ పరిధిలో తెచ్చే యోచన చేస్తున్నట్లు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్ళిన పది వామపక్ష పార్టీలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ దళిత విభాగం అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు రాజధర్మం పాటించకుండా సామాజిక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణలో వ్యాపార నీతిని ప్రదర్శిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురు కాకతప్పదని రాజకీయ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ హెచ్చరించారు. -
తేల్చని అఖిలపక్షం
రాజధాని ప్రతిపాదిత గ్రామ రైతులను మభ్యపెట్టేందుకు అఖిలపక్షం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఏమీ తేల్చకుండానే మమ అనిపించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని రైతులు తొలి నుంచి చెబుతున్న విషయాన్నే ఇక్కడా మరో సారి ఉద్ఘాటించడం విశేషం. త్వరలో ల్యాండ్ పూలింగ్ కేబినెట్ సబ్‌కమిటీ పర్యటనకు రానున్న నేపథ్యంలో శుక్రవారం తుళ్లూరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పేరుకు అఖిలపక్షం అని పిలిచినా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించకపోవడంతో కేవలం సబ్‌కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఒక్కరే వేదికపై కనిపించారు. మిగిలిన పార్టీ నేతలు లేకుండానే అఖిలపక్ష సమావేశాన్ని ముగించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామం తుళ్లూరులో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రైతులు ఎవరి వాదనలు వారు వినిపించారే తప్ప ఎలాంటి స్పష్టత రాలేదు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు వాదనలు వినిపించారు. తుళ్లూరులో రాజధాని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రోజు నుంచి ఆ మండల రైతు కుటుంబాల్లో అలజడి ప్రారంభమైంది. తరతరాలుగా వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు ప్రభుత్వ నిర్ణయంపై కలత చెందారు. ఉన్న భూమి ప్రభుత్వానికి ఇచ్చి తాము రాజధాని నిర్మాణ పనుల్లో కార్మికుల్లా పనిచేయాలా అని ప్రశ్నించారు. ఓ దశలో రెండు వర్గాల రైతుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా రైతుల మధ్య మరింత అగాధాన్ని పెంచిందని పలువురు వ్యాఖ్యానించారు. భూములు లేని వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలపై సమావేశంలో ప్రస్తావనకే రాలేదు. రోజుకు సగటున రూ.300 కూలి పొందుతున్న వ్యవసాయ కార్మికులు ఈ రంగం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడనుందని భయాందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ భూములు ఉండే అవకాశం లేదని ఇక తామంతా రాజధాని నిర్మాణ పనుల్లో రోజువారీ కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, ఆ పనుల్లో నైపుణ్యత లేకపోవడం వల్ల వేతనం తగ్గుతుందనే భయం వారిని వెన్నాడుతోంది. ఈ భూములపై ఆధారపడిన అన్ని వర్గాల గురించి చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది. ఎమ్మెల్యే కూడా రైతుల అభిప్రాయాలను కేబినెట్ కమిటీకి తెలియచేస్తానని మాత్రమే చెప్పారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అన్ని వర్గాలు నిరుత్సాహంతో వెనుతిరిగారు. -
‘ప్రత్యేక విదర్భ’ సాధనకు ఏకమవ్వాలి
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్ధతు పలకాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఏకమైతే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని అన్నారు. విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పార్లమెం ట్లో ప్రత్యేక విదర్భ బిల్లు పెడితే తమ పార్టీ మద్ధతిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతుగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షు డు దేవేంద్ర ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. అయితే సరైన సమయం ఇప్పటివరకు రాలేదని చెప్పారు. భవిష్యత్‌లో అన్ని పార్టీలు కలిసి వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన విదర్భ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి ఊపందుకుం టుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాం తాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని అన్ని పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర మం త్రి, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకుడు నితిన్ రౌత్ అన్నారు. అయితే కొంతమంది నాయకులు మంత్రుల పదవులు కోల్పోయినప్పుడు మాత్రమే ప్రత్యేక విదర్భ వాదాన్ని నెత్తినెత్తుకుంటున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధితో ఈ పనిచేసేం దుకు అన్ని పార్టీల నాయకులు ఏకమవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.