కదం తొక్కిన ములుగు | Kadantokkina Mulugu | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ములుగు

Published Fri, Oct 7 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

కదం తొక్కిన ములుగు

కదం తొక్కిన ములుగు

ములుగు జిల్లా కోసం ఆందోళనలు
అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు

ములుగు :  ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్‌ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా.. ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడం తో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసు లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
 
ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ స భ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌ మాట్లాడు తూ తనతో పాటు టీఆర్‌ఎస్‌ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్‌ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్‌ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్‌ సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు.
 
బీజేపీ నియోజకవర్గ కన్వినర్‌ చింతలపూడి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమం లో మేడారం ట్రస్ట్‌ బోర్డు తాత్కాలిక చైర్మన్‌ కాక లింగయ్య, డైరెక్టర్‌ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామితో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, సర్పం చ్‌లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్, లాల్‌పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, మధు, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
 
సీఎం, మంత్రికి పిండప్రదానం
ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు పోరిక రాజునాయక్‌ గుండు గీయించుకుని సీఎం కేసీఆర్, మంత్రి చందూలాల్‌కు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని నాయకులతో మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని తమకు సమయం ఇవ్వాలని నాయకులు కోరడంతో వెనక్కి వచ్చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మల్లాడి రాంరెడ్డి, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, ఎంపీటీసీ రాజు, సర్పంచ్‌ రహీంపాషా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి.రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement