Mulugunu District
-
Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు
సాక్షి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు కాజ్‌వేల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాలు, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్ రామన్నగూడెం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు సరస్సులో నీటిపై తేలియాడుతున్నట్లుగా ఉన్న వంతెన కొండాయివద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు కొత్తగూడ: తాడు సాయంతో కత్తెర్ల వాగు దాటుతున్న వేలుబెల్లి గ్రామస్తులు వాజేడు: చింతూరుకు చెందిన మహిళ వైద్యం కోసం వెళ్తుండగా రోడ్డు దాటిస్తున్న యువకులు కోతకు గురైన నర్సింగాపూర్–బోర్లగూడెం ప్రధాన రహదారి కొత్తగూడెం: బూర్కపల్లి వాగు దాటుతున్న రామన్నగూడెం గ్రామస్తులు వాజేడు: భువనపల్లి–లక్ష్మీపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద దొంగలగట్టు వాగు లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న నది మహాముత్తారం: గండికామారం రోడ్డుపై వరద ఉధృతి కాటారం: గంగారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు కోతకు గురైన నర్సింగాపూర్–మీనాజిపేట రహదారి బూర్గుపేట–లక్ష్మీదేవిపేట మధ్య మారేడుగొండ చెరువు ఉధృతి ఏటూరునాగారం: చెల్పాక రోడ్డుపై నాగులమ్మ ఒర్రె వరద -
అక్కొచ్చె.. అన్నం తెచ్చె..
సాక్షి, భద్రాచలం: అడవి బిడ్డల ఆకలి ఆర్తనాదాలు. పూట గడవక పస్తులున్న గిరిపుత్రులు. పట్టెడన్నం కోసం కొండకోనల్లో బిత్తర చూపులు. దయార్ద్ర హృదయం స్పందిస్తారని.. ఎండిన డొక్కలకు తిండి గింజలు పెడతారని దేహీ అంటూ విలపించారు. ఆ మాటలు చెవిన పడిన ఆదివాసీ బిడ్డ.. ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క నేను సైతం అంటూ మూటాముల్లెతో అడవి బాట పట్టారు. కొండకోనలు.. వాగులూ వంకలు దాటి వారి ఆకలి తీర్చారు. అమ్మలా ఆదరించావంటూ అడవి బిడ్డలు తెగ సంబరపడి పోయారు. వివరాలు.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గిరిజన గ్రామం భద్రాచలం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. చదవండి: 21దాకా లాక్డౌన్..? తమకు నిత్యావసర సరుకులు అందక అవస్థలు పడుతున్నామని, అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆ గ్రామానికి చెందిన కొందరు సీతక్క దృíష్టికి తీసుకెళ్లారు. తన నియోజకవర్గం కాకున్నా చలించిన సీతక్క.. ఎర్రటి ఎండలో గుట్టలు, వాగులు, దాటుకుంటూ 15 కి.మీ. సరుకుల మూట మోసుకుంటూ కాలిబాటన వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత దాహం వేయడంతో వాగులోని నీటిని తాగారు. మార్గ మధ్యలో వంట చేసుకుని భుజించారు. పెనుగోలు గ్రామానికి చేరుకున్న ఆమె కొంత మందికి సరుకులను పంపిణీ చేశారు. మిగతా వారికోసం తీసుకొచ్చిన సరుకులను గుమ్మడిదొడ్డి గ్రామంలో ఉంచామని, అక్కడికి వచ్చి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజనుల చెంతకు వెళ్లి ఓదార్చిన మొదటి ప్రజాప్రతినిధి సీతక్క కావడం గమనార్హం. ఆమె వెంట జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా ఉన్నారు. చదవండి: ఆసుపత్రులకు లైన్ క్లియర్ -
అప్పుడు.. ఇప్పుడు.. ప్రజాసేవకే!
సాక్షి, హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆమె ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మీ ఎట్ 20’పేరిట ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో నడుస్తోన్న చాలెంజ్‌లో ఆమె కూడా పాల్గొన్నారు. 20 ఏళ్లు దాటినవారంతా ఇందులో పాల్గొనవచ్చు. తాము 20వ పడిలో ఎలా ఉన్నామో తెలుపుతూ ఓ చిత్రాన్ని పోస్టు చేయాలి. ఇప్పుడు ఈ చాలెంజ్ ట్రెండింగ్‌గా మారింది. ఎమ్మెల్యే సీతక్క రాజకీయాల్లోకి రాకముందు మావోయిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చాలెంజ్‌లో భాగంగా తాను 20 ఏళ్ల వయసులో తుపాకీ పట్టి అడవిబాట పట్టి ప్రజల కోసం పోరాడారు. అప్పుడు తీయించుకున్న ఫొటోను మీ ఎట్ 20 చాలెంజ్‌లో భాగంగా ఆమె పోస్టు చేశారు. తాను గన్ (మావోయిస్టుగా)తో ఉన్నా.. గన్‌మెన్‌తో ఉన్నా (ఎమ్మెల్యేగా ఉన్నా..) పేదల కూడు, గూడు, గుడ్డ కోసమేనంటూ రాసిన ఓ వ్యాఖ్య కూడా పలువురిని ఆకట్టుకుంది. Weather I am with Gun or With Gunmen, it’s for the sake of weaker sections, food,cloth,shelter is always I wanted for them #MeAt20 @INCIndia @MahilaCongress @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @sushmitadevinc @kumari_selja @jothims @INCTelangana @revanth_anumula @IYC pic.twitter.com/UDEPCOSyZv — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) April 19, 2020 -
కల సాకారం..
ఎట్టకేలకు ములుగు ప్రాంత ప్రజల కల సాకారమైంది. నాలుగున్నరేళ్ల ప్రజా ఉద్యమానికి ఫలితం లభించింది. ములుగు జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి విడిపోయి తొమ్మిది మండలాలతో కొత్తగా ములుగు జిల్లా ఉనికిలోకి రానుంది. ఆదివారం నుంచి అధికారికంగా పాలన ప్రారంభం కానుండగా.. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ పేరు ప్రస్తావన రాలేదు. మల్లంపల్లి మండల హామీపై కూడా స్పష్టత లేదు. సాక్షి, భూపాలపల్లి/ములుగు: ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33 కు చేరింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ను ఐదు ముక్కలుగా చేశారు. ప్రస్తుతం ములుగు ఏర్పాటుతో జిల్లాల సంఖ్య ఆరుకు చేరింది. జిల్లా కోసం ఉద్యమించిన ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవెర్చింది. 9 మండలాలతో కూడిన జిల్లా నేటి నుంచి ఉనికిలోకి రానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక స్వరూపం.. ములుగు, వెంకటాపురం(ఎం)ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలతో ములుగు జిల్లా మనుగడలోకి రానుంది. 9 మండలాల పరిధిలో 3,881 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పడనుంది. 177 గ్రామపంచాయతీలు, 336 గ్రామాలు ఉన్నాయి. 6,175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే నాలుగో పెద్ద జిల్లాగా ఉన్న భూపాలపల్లి తన స్థానాన్ని కోల్పోనుంది. పాత 31 జిల్లాలతో పోల్చితే ములుగు 18వ పెద్ద జిల్లాగా కొనసాగనుంది. 2011 జనాభా లెక్కల ములుగు జిల్లాలో 2,94,671 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం జానాభా 3.10 లక్షలకు మించి ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ములుగు మాత్రమే రెవెన్యూ మాత్రమే రెవెన్యూ డివిజన్ హోదా కలిగి ఉంది. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. నియోజకర్గంలోని మిగతా ఏడు మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో ఉండనున్నాయి. ఆదివాసీలు.. పర్యాటకం.. రాష్ట్రంలో ముఖ్య పర్యాటక కేంద్రంగా ములుగు జిల్లా విరాజిల్లనుంది. మేడారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జాతర కొంగుబంగారం కానుంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఆదివాసీ గరిజనుల సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియనున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ జిల్లా పరిధిలోనే ఉండడం, వైల్డ్‌లైఫ్, తాడ్వాయిలోని ఎకోటూరిజం, బొగత జలపాతం, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. ఇదే విధంగా జిల్లా పూర్తిగా ఆదివాసీ, గిరిజన జనాభాతో నిండి ఉంది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంబురాలు.. జిల్లా ఏర్పాటు చేయడంతో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, ఎండీ.మున్సిమ్‌ఖాన్, కుర్రి దివాకర్, రవళిక, కృష్ణవేఢి, బీజేపీ నాయకులు సిరికొండ బలరాం, బల్గూరి చంద్రయ్య కల్వల సంజీవ ఆధ్వర్యంలో శనివారం సంబురాలు జరుపుకున్నారు. జాతీయ రహదారిపై టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఊసేలేని సమ్మక్క–సారలమ్మ పేరు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని నాలుగున్నర సంవత్సరాలుగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ములుగు జిల్లా పేరును మాత్రమే పొందిపరిచింది. దీంతో నియోజకవర్గ ప్రజలు, తల్లుల భక్తులు నిరుత్సాహంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సమ్మక్క–సారలమ్మ పేరిట జిల్లా పేరును మార్చాలని కోరుతున్నారు. తగ్గిన భారం.. ములుగు డివిజన్లోని వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం మండలాల ప్రజలకు ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సుమారు 120 నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఉంది. ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు దూరభారం తగ్గింది. అత్యవసర పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మూడున్నర గంటల పాటు ప్రయాణించే ఏజెన్సీ వాసులు ప్రస్తుతం కేవలం రెండున్నర గంటల్లో ములుగు జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం కలిగింది. -
కదం తొక్కిన ములుగు
• ములుగు జిల్లా కోసం ఆందోళనలు • అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో • రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు ములుగు : ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా.. ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడం తో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసు లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ స భ్యుడు పోరిక గోవింద్‌నాయక్ మాట్లాడు తూ తనతో పాటు టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్ సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వినర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమం లో మేడారం ట్రస్ట్ బోర్డు తాత్కాలిక చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామితో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, సర్పం చ్‌లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్, లాల్‌పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, మధు, కోటేశ్వర్రావు పాల్గొన్నారు. సీఎం, మంత్రికి పిండప్రదానం ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పోరిక రాజునాయక్ గుండు గీయించుకుని సీఎం కేసీఆర్, మంత్రి చందూలాల్‌కు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని నాయకులతో మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని తమకు సమయం ఇవ్వాలని నాయకులు కోరడంతో వెనక్కి వచ్చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, ఎంపీటీసీ రాజు, సర్పంచ్ రహీంపాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.