సాక్షి, హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆమె ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మీ ఎట్ 20’పేరిట ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో నడుస్తోన్న చాలెంజ్‌లో ఆమె కూడా పాల్గొన్నారు. 20 ఏళ్లు దాటినవారంతా ఇందులో పాల్గొనవచ్చు. తాము 20వ పడిలో ఎలా ఉన్నామో తెలుపుతూ ఓ చిత్రాన్ని పోస్టు చేయాలి. ఇప్పుడు ఈ చాలెంజ్ ట్రెండింగ్‌గా మారింది. ఎమ్మెల్యే సీతక్క రాజకీయాల్లోకి రాకముందు మావోయిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఈ చాలెంజ్‌లో భాగంగా తాను 20 ఏళ్ల వయసులో తుపాకీ పట్టి అడవిబాట పట్టి ప్రజల కోసం పోరాడారు. అప్పుడు తీయించుకున్న ఫొటోను మీ ఎట్ 20 చాలెంజ్‌లో భాగంగా ఆమె పోస్టు చేశారు. తాను గన్ (మావోయిస్టుగా)తో ఉన్నా.. గన్‌మెన్‌తో ఉన్నా (ఎమ్మెల్యేగా ఉన్నా..) పేదల కూడు, గూడు, గుడ్డ కోసమేనంటూ రాసిన ఓ వ్యాఖ్య కూడా పలువురిని ఆకట్టుకుంది.
Weather I am with Gun or With Gunmen, it’s for the sake of weaker sections, food,cloth,shelter is always I wanted for them #MeAt20 @INCIndia @MahilaCongress @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @sushmitadevinc @kumari_selja @jothims @INCTelangana @revanth_anumula @IYC pic.twitter.com/UDEPCOSyZv
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) April 19, 2020
Comments
Please login to add a commentAdd a comment