వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం అడవి రంగాపూర్(నారాయణపూర్) గ్రామంలోని బండ్లపహాడ్ గొత్తికోయగూడెం వాసులకు ఎమ్మెల్యే సీతక్క అండగా నిలిచారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆమె శనివారం వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, గూడెంకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్ అయింది. అందులోనే సరుకులు వేసుకుని అదే బండిపై ఎమ్మెల్యే పయనమయ్యారు. ఆమె వెంట అనుచరులు, గన్‌మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ఈ సందర్భంగా బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి భరోసా కల్పించారు.
ప్రతి పేద కుటుంబానికి రూ.6 వేలు ఇవ్వాలి..
కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున, ప్రతీ పేద కుటుంబానికి రూ.6 వేలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మొద్దునిద్ర వీడాలని ఆమె సూచించారు.
Every drop of my blood will contribute to the growth of this nation and to make our people strong & developed.@RahulGandhi @priyankagandhi @manickamtagore @JitendraSAlwar #aimcprayaas #SOSTCongress @MahilaCongress @INCIndia @kumari_selja @sushmitadevinc #COVID #RahulGandhi pic.twitter.com/Ifkbb3GFEJ
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) May 30, 2021
Comments
Please login to add a commentAdd a comment