‘ప్రత్యేక విదర్భ’ సాధనకు ఏకమవ్వాలి
Published Sun, Sep 29 2013 11:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్ధతు పలకాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఏకమైతే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని అన్నారు. విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పార్లమెం ట్‌లో ప్రత్యేక విదర్భ బిల్లు పెడితే తమ పార్టీ మద్ధతిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతుగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షు డు దేవేంద్ర ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. అయితే సరైన సమయం ఇప్పటివరకు రాలేదని చెప్పారు.
భవిష్యత్‌లో అన్ని పార్టీలు కలిసి వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన విదర్భ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి ఊపందుకుం టుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాం తాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని అన్ని పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర మం త్రి, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకుడు నితిన్ రౌత్ అన్నారు. అయితే కొంతమంది నాయకులు మంత్రుల పదవులు కోల్పోయినప్పుడు మాత్రమే ప్రత్యేక విదర్భ వాదాన్ని నెత్తినెత్తుకుంటున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధితో ఈ పనిచేసేం దుకు అన్ని పార్టీల నాయకులు ఏకమవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement