ఎవరిపైనా వివక్ష వద్దు | PM Narendra Modi Offers Prayers At Lingaraj Temple in Bhubaneswar | Sakshi
Sakshi News home page

ఎవరిపైనా వివక్ష వద్దు

Published Mon, Apr 17 2017 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

ఎవరిపైనా వివక్ష వద్దు - Sakshi

ఎవరిపైనా వివక్ష వద్దు

► పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ
► ‘ట్రిపుల్‌ తలాక్‌’తో ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దు


భువనేశ్వర్‌: సమాజంలో ఏ వర్గంపైనా ఎలాం టి వివక్షా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాల కు అడ్డుకట్ట వేసి.. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లిం సమాజంలో సంఘర్షణ జరగకూడదని.. సామాజిక చైతన్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాల న్నారు. ముస్లింలలో వెనకబడిన వారు చాలా మందే ఉన్నారని.. వారిని కూడా ఓబీసీ చర్చలో భాగం చేయాలని మోదీ సూచించారు.

భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2022కల్లా నవభారత నిర్మాణానికి ప్రభుత్వం, పార్టీ మిషన్‌ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. పార్టీ చీఫ్‌ అమిత్‌ షాపైనా మోదీ ప్రశంసలు కురిపించారు. పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఈ సందర్భంగా మోదీ చురకలంటించారు. ఈ సమావేశాల్లో ఓ రాజకీయ తీర్మానంతోపాటుగా ఓబీసీలపై ప్రత్యేక తీర్మానం చేశారు. మోదీ ప్రసంగం వివరాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మీడియాకు వెల్లడించారు.

సంఘర్షణ వద్దు చైతన్యంతోనే మార్పు
ఇస్లాం సాంప్రదాయమైన ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని అన్నారు. అయితే ముస్లిం సమాజంలో సంఘర్షణ లేకుండా.. వారిని చైతన్య పరచటం ద్వారానే మార్పు తీసుకురావాలని మోదీ తెలిపారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సమాజాన్ని జాగృతం చేయాలని ఆయన సూచించారు. పార్టీ సమావేశంలో ఓబీసీ తీర్మానంపై చర్చలో ప్రధాని జోక్యం చేసుకుని ముస్లింలలోనూ వెనుకబడిన వారి సంఖ్య బాగానే ఉందని.. వీరిని కూడా ఓబీసీలపై చర్చలో భాగం చేయా లని సూచించారు. వెనుకబడిన ముస్లింలను బీజేపీ నేతలు చేరుకోవాలని వారికోసం ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటుచేయాలని ప్రధాని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ‘పీ2 జీ2’ (ప్రో పీపుల్, గుడ్‌ గవర్నెన్స్‌) ఎజెండాతో చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. ‘దేశంలో మార్పుకోసం మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం. కానీ 2022 కల్లా నవభారతాన్ని నిర్మించటం, చరిత్రను తిరగరాయటం వంటి మన కలల సాకారానికి ఈ వేగం సరిపోదు. అందుకే లాంగ్‌జంప్‌ చేసేందుకు రెట్టించిన ఉత్సాహంతో క్రియాశీలకంగా పనిచేయాలి’ అని మోదీ తెలిపారు. ఈవీఎంలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

ఇటీవలి కాలంలో బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని సుతిమెత్తగా చురకలంటించారు. ‘అధికారం లో ఉన్నప్పుడు నాయకులు ఆర్ట్‌ ఆఫ్‌ సైలెన్స్‌ (మౌనంగా ఉండే కళ)ను అలవర్చుకోవాలి. ఓటమికంటే గెలుపును డీల్‌ చేయటం చాలా కష్టం. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ప్రధాని సూచించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాను చాణక్యుడిగా అభివర్ణించిన మోదీ.. షా నాయకత్వంలోనే  దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోనూ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందన్నారు.

సమరయోధుల కుటుంబాలకు సన్మానం
ఈ సందర్భంగా 1817 పైకా ఉద్యమంలో బ్రిటిషర్లతో పోరాడి అమరులైన 16 మంది స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను మోదీ సన్మానించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో గిరిజనుల పోరాటం చాలా ప్రముఖమైందన్నారు. ‘దురదృష్టవశాత్తూ దేశ స్వాతంత్య్ర పోరాటం కొన్ని కుటుంబాలకు, కొన్ని సంవత్సరాలకు, కొన్ని ఘటనలకే పరిమితమైంది.

ఒడిశా ప్రజల పాత్ర కీలకం. తరాల తరబడి దశాబ్దాలపాటు కొనసాగిన ఈ ఉద్యమం గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆ ఉద్యమ చరిత్రే నేటి తరానికి స్ఫూర్తి’ అని మోదీ తెలిపారు. చరిత్రను ప్రతిబిబింబే ఇలాంటి ఉద్యమాలు, అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా 50 చోట్ల మ్యూజియంలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ‘అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. అమరుల కుటుంబాలను కలుసుకోవటం నా అదృష్టం’ అని ప్రధాని అన్నారు. పైకా ఉద్యమం 1817లో బ్రిటిషర్లపై బక్షీ జగబంధు బిద్యాధర్‌ నేతృత్వంలో జరిగిన మిలిటెంటు పోరాటం.

2019లోనూ మీరే నడిపించాలి
కేంద్ర ప్రభుత్వం పేదల గురించి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. 2019లోనూ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రధానిని కోరింది. ‘మూడేళ్లుగా చాలా కష్టపడు తున్నారు. మాట లను చేతల్లో చూపిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. 2019లోనూ ప్రభుత్వాన్ని మీరే నడిపించాలి’ అని రాజకీయ తీర్మానంలో పార్టీ పేర్కొంది. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు మోదీ నాయకత్వాన్ని ప్రోత్సహించా ల్సిందిగా దేశ ప్రజలను కోరింది. తీర్మానం వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మీడియాకు వెల్లడించారు.

‘ప్రధాని  మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి పునర్వైభవం కలిపించే దిశగా తీసుకెళ్తున్నాయి. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకుం టోంది. సామాన్యులు, పేదలు, అణగారిన వర్గాల ఆశలు, ఆకాంక్షలను మా ప్రభుత్వం నిజం చేస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాల ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని తీర్మానం పేర్కొంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించింది. ఎన్నికల సంస్క రణలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ సమర్థించింది. అయితే బీజేపీ మూలాంశాలైన రామమందిరం, ఆర్టికల్‌ 370, ఉమ్మడి పౌరస్మృతి, గోవధ నిషేధం వంటి అంశాలేవీ తీర్మానంలో కనిపించలేదు.

ఓబీసీలకు విపక్షాలు వ్యతిరేకం
కాంగ్రెస్, ఇతర విపక్షాలు వెనుక బడిన తరగతుల (ఓబీసీ) వ్యతిరేకులుగా మారారని ఈ సమావేశంలో బీజేపీ ఘా టుగా విమర్శించింది. చరిత్రాత్మక ఓబీసీ బిల్లుకు రాజ్యసభలో అడుగడుగునా అడ్డు పడ్డాయని గుర్తుచేసింది. ‘ప్రస్తుత ఓబీసీ కమిషన్‌కు అధికారాల్లేవు. అందుకే దీనికి రాజ్యాంగ హోదా ఇవ్వటం తప్పనిసరి. దీని ద్వారానే ఓబీసీలకు సమాజంలో సమాన హోదా దక్కడంతోపాటు సామా జిక న్యాయం కలుగుతుంది.

కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఓబీసీలను ఓటు బ్యాంకు లాగే వాడుకున్నాయి తప్ప గొప్పగా చేసిందేమీ లేదు. ఇప్పుడు బీజేపీ ఓబీసీల సంక్షేమానికి పాటుపడుతుంటే ఆ పార్టీలన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా యి’ అని ఓబీసీలపై ప్రత్యేకంగా చేసిన తీర్మానంలో పేర్కొంది. గొప్ప నిర్ణయా లను రాజకీయం కోసం అడ్డుకోవటం సరికాదని విమర్శించింది. ఈ తీర్మానాన్ని హుకుమ్‌ నారాయణ్‌ యాదవ్‌ ప్రవేశ పెట్టగా మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ల సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, రఘువర్‌ దాస్‌లు బలపరిచారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఓబీసీల విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రధాని మోదీని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement