Triple divorce
-
శ్రీరాముని సేవలో ట్రిపుల్ తలాక్ బాధితులు
శ్రీరాముని సేవకు మతం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ట్రిపుల్ తలాక్ బాధితులు. వీరంతా జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరు తమ చేతులతో నేసిన దుస్తులను శ్రీరామునికి అందించనున్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన యూపీకి చెందిన మేరా హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫర్హత్ నఖ్వీ నేతృత్వంలో ముస్లిం మహిళలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని ప్రచారం చేస్తూ నిధులు సేకరిస్తున్నారు. బరేలీ, బదౌన్, రాంపూర్, మొరాదాబాద్, మీరట్, ప్రయాగ్‌రాజ్ సహా 30 జిల్లాల నుంచి మహిళలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నిధులను రామమందిరం ట్రస్టుకు అప్పగిస్తానని ఫర్హత్ తెలిపారు. ట్రస్టు నుంచి అనుమతి లభిస్తే ఏటా తమ చేతులతో శ్రీరామునికి దుస్తులు సిద్ధం చేస్తామని ఆ ముస్లిం మహిళలు చెబుతున్నారు. వీరంతా తమ స్వహస్తాలతో జరీ జర్దోసీ వర్క్ చేస్తుంటారు. కాగా ఇటీవల యూపీలోని 27 జిల్లాలకు చెందిన వేల మంది ముస్లింలు నూతన రామాలయానికి విరాళాలు అందించారు. -
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ చట్టబద్ధమేనని కొన్ని ఇస్లాం మత శాఖలు చెబుతున్నప్పటికీ అతి చెత్త విధానమని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం రెండో రోజు విచారణలో పేర్కొంది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ తలాక్ విధానంపై నిషేధం ఉన్న ఇస్లామిక్, ఇస్లామిక్యేతర దేశాల జాబితాను రూపొందించాలని ఆయనను కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్‌కు అనుమతి లేదని ఖుర్షీద్ తెలిపారు. తలాక్ బాధితుల తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తూ.. ఈ విధానం సమానత్వ హక్కుతోపాటు పలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. ‘ట్రిపుల్ తలాక్ చెప్పే అవకాశం భర్తకే ఉంది కానీ భార్యకు లేదు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించడమే. కాగా, ట్రిపుల్ తలాక్ మహిళల హక్కుల అంశమైనప్పటికీ.. సుప్రీం బెంచ్‌లో మహిళా జడ్జి లేకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం ప్రశ్నించారు. -
‘పర్సనల్ లా’ ముస్లింల హక్కు
► ఆలిండియా పర్సనల్ లా బోర్డు స్పష్టీకరణ ► బాబ్రీ అంశంలో కోర్టు వెలుపలి ఒప్పందాలకు నో లక్నో: ‘పర్సనల్ లా’ అనుసరించడమనేది ముస్లింల రాజ్యాంగపరమైన హక్కు అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నొక్కి చెప్పింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి బోర్డు అంగీకరిస్తుందని, అయితే ‘కోర్టు వెలుపలి ఒప్పందాల’కు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రవర్తనా నియమావళిని జారీ చేయాలని బోర్డు నిర్ణయించిందని ఏఐఎమ్‌పీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ ఆదివారం చెప్పారు. షరియా (ఇస్లామిక్ లా) కారణాలు తెలపకుండా విడాకులు ఇచ్చే వారు సాంఘిక బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ ప్రవర్తనా నియమావళిని చదివి వినిపించాలని ఇమామ్‌లను బోర్డు అభ్యర్థించింది. షరియత్ చట్టాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని, దేశంలోని మెజారిటీ ముస్లింలు ‘పర్సనల్ లా’లో ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదంది. పర్సనల్ లా అమలు చేయడంలో అడ్డంకులు సృష్టించొద్దని రెహ్మానీ అభ్యర్థించారు. తలాక్ దుర్వినియోగమైన మహిళలకు బోర్డు అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు అస్మా జహ్రా మాట్లాడుతూ.. తలాక్ విషయం మత సంబంధమైనది కాదని, సామాజిక సంబంధమైనది చెప్పారు. భారత్‌లో మహిళల సమస్యలు ఒకటేనని, ఈ అంశంలో ‘ముస్లిం లా’ని ఒక్కటే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. బాబ్రీ వివాదంపై...: రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనను ఏఐఎమ్‌పీఎల్‌బీ తిరస్కరిం చింది. సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు మాత్రమే తమకు సమ్మతమని స్పష్టం చేసింది. కోర్టు వెలుపల ఒప్పందాలను అంగీకరించబోమని రెహ్మానీ చెప్పారు. ఈ మేరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరిం చుకోవాలని గత మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని నాడు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ చెప్పారు. -
ఎవరిపైనా వివక్ష వద్దు
► పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ► ‘ట్రిపుల్ తలాక్’తో ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దు భువనేశ్వర్: సమాజంలో ఏ వర్గంపైనా ఎలాం టి వివక్షా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాల కు అడ్డుకట్ట వేసి.. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లిం సమాజంలో సంఘర్షణ జరగకూడదని.. సామాజిక చైతన్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాల న్నారు. ముస్లింలలో వెనకబడిన వారు చాలా మందే ఉన్నారని.. వారిని కూడా ఓబీసీ చర్చలో భాగం చేయాలని మోదీ సూచించారు. భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2022కల్లా నవభారత నిర్మాణానికి ప్రభుత్వం, పార్టీ మిషన్ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. పార్టీ చీఫ్ అమిత్ షాపైనా మోదీ ప్రశంసలు కురిపించారు. పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఈ సందర్భంగా మోదీ చురకలంటించారు. ఈ సమావేశాల్లో ఓ రాజకీయ తీర్మానంతోపాటుగా ఓబీసీలపై ప్రత్యేక తీర్మానం చేశారు. మోదీ ప్రసంగం వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాకు వెల్లడించారు. సంఘర్షణ వద్దు చైతన్యంతోనే మార్పు ఇస్లాం సాంప్రదాయమైన ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని అన్నారు. అయితే ముస్లిం సమాజంలో సంఘర్షణ లేకుండా.. వారిని చైతన్య పరచటం ద్వారానే మార్పు తీసుకురావాలని మోదీ తెలిపారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సమాజాన్ని జాగృతం చేయాలని ఆయన సూచించారు. పార్టీ సమావేశంలో ఓబీసీ తీర్మానంపై చర్చలో ప్రధాని జోక్యం చేసుకుని ముస్లింలలోనూ వెనుకబడిన వారి సంఖ్య బాగానే ఉందని.. వీరిని కూడా ఓబీసీలపై చర్చలో భాగం చేయా లని సూచించారు. వెనుకబడిన ముస్లింలను బీజేపీ నేతలు చేరుకోవాలని వారికోసం ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటుచేయాలని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ‘పీ2 జీ2’ (ప్రో పీపుల్, గుడ్ గవర్నెన్స్) ఎజెండాతో చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. ‘దేశంలో మార్పుకోసం మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం. కానీ 2022 కల్లా నవభారతాన్ని నిర్మించటం, చరిత్రను తిరగరాయటం వంటి మన కలల సాకారానికి ఈ వేగం సరిపోదు. అందుకే లాంగ్‌జంప్ చేసేందుకు రెట్టించిన ఉత్సాహంతో క్రియాశీలకంగా పనిచేయాలి’ అని మోదీ తెలిపారు. ఈవీఎంలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని సుతిమెత్తగా చురకలంటించారు. ‘అధికారం లో ఉన్నప్పుడు నాయకులు ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ (మౌనంగా ఉండే కళ)ను అలవర్చుకోవాలి. ఓటమికంటే గెలుపును డీల్ చేయటం చాలా కష్టం. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ప్రధాని సూచించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను చాణక్యుడిగా అభివర్ణించిన మోదీ.. షా నాయకత్వంలోనే దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోనూ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందన్నారు. సమరయోధుల కుటుంబాలకు సన్మానం ఈ సందర్భంగా 1817 పైకా ఉద్యమంలో బ్రిటిషర్లతో పోరాడి అమరులైన 16 మంది స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను మోదీ సన్మానించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో గిరిజనుల పోరాటం చాలా ప్రముఖమైందన్నారు. ‘దురదృష్టవశాత్తూ దేశ స్వాతంత్య్ర పోరాటం కొన్ని కుటుంబాలకు, కొన్ని సంవత్సరాలకు, కొన్ని ఘటనలకే పరిమితమైంది. ఒడిశా ప్రజల పాత్ర కీలకం. తరాల తరబడి దశాబ్దాలపాటు కొనసాగిన ఈ ఉద్యమం గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆ ఉద్యమ చరిత్రే నేటి తరానికి స్ఫూర్తి’ అని మోదీ తెలిపారు. చరిత్రను ప్రతిబిబింబే ఇలాంటి ఉద్యమాలు, అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా 50 చోట్ల మ్యూజియంలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ‘అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. అమరుల కుటుంబాలను కలుసుకోవటం నా అదృష్టం’ అని ప్రధాని అన్నారు. పైకా ఉద్యమం 1817లో బ్రిటిషర్లపై బక్షీ జగబంధు బిద్యాధర్ నేతృత్వంలో జరిగిన మిలిటెంటు పోరాటం. 2019లోనూ మీరే నడిపించాలి కేంద్ర ప్రభుత్వం పేదల గురించి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. 2019లోనూ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రధానిని కోరింది. ‘మూడేళ్లుగా చాలా కష్టపడు తున్నారు. మాట లను చేతల్లో చూపిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. 2019లోనూ ప్రభుత్వాన్ని మీరే నడిపించాలి’ అని రాజకీయ తీర్మానంలో పార్టీ పేర్కొంది. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు మోదీ నాయకత్వాన్ని ప్రోత్సహించా ల్సిందిగా దేశ ప్రజలను కోరింది. తీర్మానం వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియాకు వెల్లడించారు. ‘ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి పునర్వైభవం కలిపించే దిశగా తీసుకెళ్తున్నాయి. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకుం టోంది. సామాన్యులు, పేదలు, అణగారిన వర్గాల ఆశలు, ఆకాంక్షలను మా ప్రభుత్వం నిజం చేస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాల ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని తీర్మానం పేర్కొంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించింది. ఎన్నికల సంస్క రణలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ సమర్థించింది. అయితే బీజేపీ మూలాంశాలైన రామమందిరం, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, గోవధ నిషేధం వంటి అంశాలేవీ తీర్మానంలో కనిపించలేదు. ఓబీసీలకు విపక్షాలు వ్యతిరేకం కాంగ్రెస్, ఇతర విపక్షాలు వెనుక బడిన తరగతుల (ఓబీసీ) వ్యతిరేకులుగా మారారని ఈ సమావేశంలో బీజేపీ ఘా టుగా విమర్శించింది. చరిత్రాత్మక ఓబీసీ బిల్లుకు రాజ్యసభలో అడుగడుగునా అడ్డు పడ్డాయని గుర్తుచేసింది. ‘ప్రస్తుత ఓబీసీ కమిషన్‌కు అధికారాల్లేవు. అందుకే దీనికి రాజ్యాంగ హోదా ఇవ్వటం తప్పనిసరి. దీని ద్వారానే ఓబీసీలకు సమాజంలో సమాన హోదా దక్కడంతోపాటు సామా జిక న్యాయం కలుగుతుంది. కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఓబీసీలను ఓటు బ్యాంకు లాగే వాడుకున్నాయి తప్ప గొప్పగా చేసిందేమీ లేదు. ఇప్పుడు బీజేపీ ఓబీసీల సంక్షేమానికి పాటుపడుతుంటే ఆ పార్టీలన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా యి’ అని ఓబీసీలపై ప్రత్యేకంగా చేసిన తీర్మానంలో పేర్కొంది. గొప్ప నిర్ణయా లను రాజకీయం కోసం అడ్డుకోవటం సరికాదని విమర్శించింది. ఈ తీర్మానాన్ని హుకుమ్ నారాయణ్ యాదవ్ ప్రవేశ పెట్టగా మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ల సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, రఘువర్ దాస్‌లు బలపరిచారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఓబీసీల విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రధాని మోదీని ప్రశంసించారు. -
త్వరలో ట్రిపుల్ తలాక్‌కు స్వస్తి
-
ట్రిపుల్ తలాక్‌తో మహిళలకు అగౌరవం
► సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదన ► దానిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని వినతి న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వం ముస్లిం మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని, వారి సామాజిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అంతేకాక భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా రాతపూర్వక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించింది. ముస్లిం మగవారితోనూ.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన మహిళలతోనూ పోలిస్తే ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ తదితర అంశాల వల్ల అసమానత్వాన్ని, దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్నారని తన అఫిడవిట్లో పేర్కొంది. ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. అలాగే ఆరు దశాబ్దాలుగా ముస్లిం పర్సనల్ లాలో సంస్కరణలు తీసుకురాలేదని గుర్తుచేసింది. దీని వల్ల దేశ జనాభాలో 8 శాతం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు.. తక్షణం విడాకులు వస్తాయనే భయంగా దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ వల్ల కొద్ది మంది మహిళలే ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారనేది నిజమని, అయితే వీటి పరోక్ష ప్రభావం వల్ల ప్రతి మహిళలోనూ అభద్రతాభావం, ఆందోళన, భయం ఉన్నాయనేది వాస్తవమని వివరించింది. అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వంటి కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం ఈ అంశంలో కోర్టుల ప్రమేయాన్ని వ్యతిరేకించాయి. పవిత్ర గ్రంథమైన ఖురాన్లో పేర్కొన్న ప్రకారమే ఇవి కొనసాగుతున్నాయని, ఈ అంశం న్యాయ పరిధిలోకి రాదని వాదించాయి. పలువురు ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో ట్రిపుల్ తలాక్‌కు స్వస్తి బిజ్నూర్: మరో ఏడాదిన్నరలోనే ట్రిపుల్ తలాక్ ప్రక్రియకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) స్వయంగా ముగింపు పలికే అవకాశం ఉందని, అందువల్ల ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఏఐఎంపీఎల్బీ ఉపాధ్యక్షుడు కాల్బీ సాధిఖ్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.