శ్రీరాముని సేవకు మతం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ట్రిపుల్ తలాక్ బాధితులు. వీరంతా జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరు తమ చేతులతో నేసిన దుస్తులను శ్రీరామునికి అందించనున్నారు.
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన యూపీకి చెందిన మేరా హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫర్హత్ నఖ్వీ నేతృత్వంలో ముస్లిం మహిళలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని ప్రచారం చేస్తూ నిధులు సేకరిస్తున్నారు. బరేలీ, బదౌన్, రాంపూర్, మొరాదాబాద్, మీరట్, ప్రయాగ్‌రాజ్ సహా 30 జిల్లాల నుంచి మహిళలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నిధులను రామమందిరం ట్రస్టుకు అప్పగిస్తానని ఫర్హత్ తెలిపారు.
ట్రస్టు నుంచి అనుమతి లభిస్తే ఏటా తమ చేతులతో శ్రీరామునికి దుస్తులు సిద్ధం చేస్తామని ఆ ముస్లిం మహిళలు చెబుతున్నారు. వీరంతా తమ స్వహస్తాలతో జరీ జర్దోసీ వర్క్ చేస్తుంటారు. కాగా ఇటీవల యూపీలోని 27 జిల్లాలకు చెందిన వేల మంది ముస్లింలు నూతన రామాలయానికి విరాళాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment