ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక | Hyderabad MLC Election on April 23: Telangana | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక

Published Tue, Mar 25 2025 1:41 AM | Last Updated on Tue, Mar 25 2025 1:41 AM

Hyderabad MLC Election on April 23: Telangana

మార్చి 28న నోటిఫికేషన్‌..

నామినేషన్లకు గడువు ఏప్రిల్‌ 4 

ఏప్రిల్‌ 25న ఫలితాలు 

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం సోమ వారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్‌ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

దీంతో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్‌ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 గడువు. ఏప్రిల్‌ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement