అయోధ్య: చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
శ్రీరామజన్మభూమి ఆలయం గర్భగుడి ద్వారం
క్రతువులకు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా ‘యజమానులుగా’ వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రారం¿ోత్సవం దాకా ప్రతినిత్యం వారే యజమానులుగా ఉంటారు. అయోధ్యలో అనుష్ఠానానికి శ్రీకారం చుట్టామని, ఆలయ ప్రాణప్రతిష్టకు దేవుళ్లందరి అనుగ్రహాన్ని అరి్థస్తూ మొత్తం 11 మంది పూజారులు క్రతువులు ప్రారంభించారని ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయంలో ప్రాణప్రతిష్ట ముగిశాక ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు.
అయోధ్యలోని గోడలపై చిత్రించిన రామాయణంలోని అపురూప ఘట్టాల దృశ్యాలు... ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు
ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో 121 మంది అచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించబోతున్నారు. అయోధ్యలో సోమవారం ప్రాయశి్చత్త, కర్మకుటీ పూజ నిర్వహించారు.
56 రకాల ఆగ్రా పేఠాలు
ఆగ్రా పేఠ.. ఉత్తర భారతీయులకు చాలా ఇష్టమైన మిఠాయి. బూడిద గుమ్మడికాయ, చక్కెర పాకంతో ఈ పేఠాలు తయారు చేస్తారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడికి ఆగ్రా పేఠాలను నివేదించబోతున్నారు. ఇందుకోసం ఏకంగా 56 రకాల పేఠాలను సిద్ధం చేశారు. ఇవి మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగ్రాకు చెందిన పంచీపేఠ అనే మిఠాయిల దుకాణం వీటిని తయారు చేసి పంపించింది. అలాగే అదనంగా 560 కిలోల పేఠాలను సైతం ఆగ్రా ట్రేడ్ బోర్డు ద్వారా పంపింది. వీటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంది. అలాగే రత్నాలు కూర్చిన పట్టు వ్రస్తాలు, వెండి పళ్లేలు, ఇతర పూజా సామగ్రి సైతం వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్నాయి.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
108 అడుగుల అగరు బత్తి వెలిగించారు
గుజరాత్ నుంచి అయోధ్యకు పంపించిన 108 అడుగుల పొడవైన అగరు బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మంగళవారం వెలిగించారు.
గుజరాత్ నుంచి తెచి్చన 108 అడుగుల అగరొత్తికి మొక్కుతున్న భక్తులు
ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ అంటూ జపించారు. దాదాపు 40 రోజుల దాకా ఈ అగరు బత్తి వెలుగుతూనే ఉంటుంది. 3,610 కిలోల బరువు, మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ అగరు బత్తి సువాసన 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని తయారీదారులు చెప్పారు. భారీ అగరు బత్తిని ఆవు పేడ, నెయ్యి, సుగంధ తైలాలు, పూల రెక్కలు, ఔషధ మూలికలతో తయారు చేశారు.
భారీ అగరొత్తిని వెలిగిస్తున్న మహంత్ నృత్య గోపాల్ దాస్
ప్రాణప్రతిష్టలో సంప్రదాయ సంగీత మధురిమలు
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో భారతీయ సంప్రదాయ సంగీతం అతిథులను అలరించబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సంప్రదాయ సంగీత కళాకారులను రప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మణిపూర్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీ, రాజస్తాన్, పశి్చమ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి నుంచి కళాకారులు రాబోతున్నారు. ఇప్పటికే వారిని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటము వాయిద్యానికి స్థానం కల్పించారు. ఈ నెల 22న జరిగే అపూర్వ వేడుకలో కళాకారులు తమ సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పఖవాజ్, తమిళనాడుకు చెందిన మృదంగం వంటి వాయిద్యాలు ప్రదర్శన ఉంటుంది. అయోధ్యలో రామమందిర ప్రారం¿ోత్సవంలో భిన్నరకాల వాయిద్యాలను ఒకేచోట తిలకించవచ్చు. భారతీయ సంప్రదాయ సంగీత మధురిమలను మనసారా ఆస్వాదించవచ్చు. ఇదిలా ఉండగా, ప్రాణప్రతిష్ట ముగిసిన తర్వాత ఈ నెల 23 నుంచి సామాన్య ప్రజలకు బాలరాముడి దర్శనభాగ్యం కలి్పస్తారు. ఈ నెల 26 తర్వాత ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు విడతలవారీగా దర్శించుకొనేలా షెడ్యూల్ రూపొందించారు. వారి దర్శనాలు ఫిబ్రవరి ఆఖరు దాకా కొనసాగుతాయి. అతిథుల కోసం బస ఏర్పాట్లు చేస్తున్నారు.
సరయూ నదిలో సౌర విద్యుత్ పడవ
అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీకి అభివృద్ధి చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంకలి్పంచింది. ఇందులోభాగంగా సౌర విద్యుత్‌కు పెద్ద పీట వేయబోతోంది. అయోధ్యలో సరయూ నదిలో సౌరవిద్యుత్‌తో నడిచే పడవలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి పడవను ఈ నెల 22న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించబోతున్నారు. ఇండియాలో ఇదే తొలి సౌరవిద్యుత్ పడవ కావడం గమనార్హం. అయోధ్య పర్యాటకులు సరయూ నదిలో ఇలాంటి పడవల్లో విహరించవచ్చు. నయా ఘాట్ నుంచి ఈ పడవలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కో బోట్‌లో ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేయడంతో తేలిగ్గా ఉంటాయి. శబ్దం రాదు. పూర్తిగా పర్యావరణ హితం.
ఇది కూడా చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
Comments
Please login to add a commentAdd a comment