న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు.
ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7,000 కిలోల ‘రామ్ హల్వా’
అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..
Comments
Please login to add a commentAdd a comment