అయోధ్య/లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి సుమారు 325 మంది అయోధ్యలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం లక్నో నుంచి 10 బస్సుల్లో, కొందరు తమ కార్లలో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. నగరంలో వారికి ఘన స్వాగతం లభించింది. పుణేలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని వారితో కలిశారు. కొందరు శాసనసభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు.
అంతా కలిపి సుమారు 400 మంది విడతల వారీగా సుమారు రెండున్నర గంటల సమయంలో బాల రాముడి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. రాముడిని దర్శించుకున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల శాసనసభ్యులతోపాటు కాంగ్రెస్, బీఎస్‌పీకి చెందిన వారు కూడా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలె వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రస్తుతం యూపీ శాసనసభలోని 399 మందిలో బీజేపీకి 252 మంది, మిత్రపక్షాలకు 19 మంది సభ్యుల బలముంది. ప్రతిపక్షంలో ఎస్‌పీకి 108 మంది, ఇతరులకు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సైతం ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment