యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం | Four Died And 11 Members Injured In Road Accident In Lucknow Uttar Pradesh, CM Yogi Condoles The Dead | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం

Published Fri, Jan 24 2025 7:10 AM | Last Updated on Fri, Jan 24 2025 8:59 AM

Four Died In Road Accident In Lucknow Uttar Pradesh

లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ  కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.

గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్‌ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్‌, ఆమె కుమారుడు కుందన్‌ యాదవ్‌, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్‌,శోబిత్‌ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్‌ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్‌ అధికారి పంకజ్‌ సింగ్‌ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

ప్రమాద వివరాల్ని ఈస్ట్‌ డీసీపీ శశాంక్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. 

సీఎం యోగి సంతాపం
ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement